టాలీవుడ్ లో మరో హీరోకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన జాన్వీ కపూర్.. లక్కీ ఛాన్స్?

అతిలోక సుందరి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు అందుకునే విధంగా అడుగులు వేస్తోంది. ఇంకా ఆమెకు బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సరైన విజయం దక్కకపోయినప్పటికీ కూడా గ్లామర్ కు మాత్రం సోషల్ మీడియాలో భారీ స్థాయిలో స్పందన లభిస్తోంది. ఇక ఆమెకు అవకాశాలు కూడా చాలానే వస్తున్నాయి. మొదట దడక్, గుంజన్ సక్సెనా కార్గిల్ గర్ల్ వంటి సినిమాలతో నటిగా ప్రముఖుల ప్రశంసలు కూడా అందుకుంది. అంతే కాకుండా జాన్వి లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తోంది. ఈ బ్యూటీకి మొదట్లోనే తెలుగులో కూడా చాలా మంచి ఆఫర్స్ వచ్చాయి. కానీ అమ్మడు మాత్రం తొందర పడకుండా ఎందుకో తెలుగు సినిమాలకు ఓకే చెప్పలేకపోయింది. దాదాపు నాలుగైదు స్టార్ హీరోల ఆఫర్స్ వచ్చినప్పటికీ ఆమె తెలుగులో నటించేందుకు ఆసక్తి చూపలేదు.

ప్రస్తుతం జాన్వికపూర్ కరణ్ జోహార్ ఆధ్వర్యంలోనే మంచి కథలను సెలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తోంది. అంతేకాకుండా కరణ్ జోహార్ నిర్మాతగా రూపొందుతున్న రెండు సినిమాల్లో కూడా జాన్వికపూర్ మెయిన్ హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఇటీవల పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో తెరకెక్కనున్న మరొక సినిమాకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ లైగర్ సినిమా అనంతరం మరొక సినిమా చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. పూరి జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ జనగణమన షూటింగ్ త్వరలోనే మొదలు పెట్టబోతున్నారు. ఇక ఈ సినిమాలో ప్రధాన హీరోయిన్ గా జాన్వికపూర్ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది అంతేకాకుండా జాన్వీ కపూర్ మరొక తెలుగు హీరో తో కూడా ఓ సినిమా చేసేందుకు ఒప్పుకున్నట్లు గా తెలుస్తోంది. అతను మరెవరో కాదు అక్కినేని చిన్న వారసుడు అఖిల్ అని తెలుస్తోంది.

Janhvi Kapoor another movie with tollywood young hero

ప్రస్తుతం అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా లో సాక్షి వైద్య మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఏజెంట్ సినిమాను ఆగస్టు 12వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ సభ్యుల ఇటీవల అఫీషియల్గా క్లారిటీ కూడా ఇచ్చేశారు. ఈ సినిమాపై అంచనాలు అయితే మాములుగా లేవు తప్పకుండా ఏజెంట్ సినిమాతో అఖిల్ బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో విజయాన్ని అందుకున్నాడు అని తెలుస్తోంది. అయితే ఈ సినిమా అనంతరం అఖిల్ అక్కినేని తో కూడా జాన్వికపూర్ కొత్త సినిమా చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

అఖిల్ అక్కినేని తో కరణ్ జోహర్ ఎప్పటినుంచో బాలీవుడ్ లో ఒక సినిమా చేయాలని అనుకుంటున్నాడు. ఇదివరకే కొన్నిసార్లు నాగార్జునకు కథలు కూడా వినిపించాడు. ఇటీవల నాగార్జున ఒక స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఆ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో తెరపైకి తీసుకురావాలి అని ఆలోచిస్తున్నారట. ఇంకా దర్శకుడు ఎవరనే విషయంలో అయితే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదట. మరి ఆ సినిమాతో జాన్వీ ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X