Janhvi Kapoor: తిరుపతిలో శ్రీదేవి కూతురు.. అచ్చమైన తెలుగమ్మాయిలా.. చూస్తే మతిపోవాల్సిందే

అతిలోకసుందరిగా ఇండియన్ సినిమా చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న శ్రీదేవి గురించి ఎంతో చెప్పినా తక్కువే. ఇక ఆమె తర్వాత తరం జాన్వీ కపూర్ కూడా తన అందంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్ గా మారినప్పటికీ కూడా జాన్వికపూర్ తన తల్లికి ఎంతో ఇష్టమైన ఆచారాలను పద్ధతులను ఏమాత్రం మర్చిపోవడం లేదు. రీసెంట్ గా ఆమె తెలుగుతనం ఉట్టిపడేలా కనిపించిన విధానం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది.

మంచి నటిగా గుర్తింపు

మంచి నటిగా గుర్తింపు

శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా మంచి అవకాశాలు అందుకుంటున్న విషయం తెలిసిందే. మొదట ఆమె ధడక్ సినిమాలో వెండితెరకు పరిచయమై మంచి నటిగా గుర్తింపుని అందుకుంది. ఆ తర్వాత చాలా తొందరగానే లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో కూడా అవకాశాలు అందుకుంటూ వచ్చింది. బాక్స్ ఆఫీస్ సక్సెస్ కంటే కూడా ఆమె విమర్శకుల ప్రశంసలు అందుకునే విధంగానే మంచి కంటెంట్ ఉన్న కథలను సెలెక్ట్ చేసుకుంటోంది.

 బికినీల్లో కూడా..

బికినీల్లో కూడా..

ఇక ఇది వరకే జాన్వీ కపూర్ బికినీలో కూడా షాక్ ఇచ్చింది. రెగ్యులర్ గా ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసే కొన్ని ఫోటోలు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. గ్లామర్ డోస్ తో రోజురోజుకు తన సోషల్ మీడియా ఫాలోవర్స్ ని కూడా పెంచుకుంటుంది. మొదట్లో ఆమె అందంపై కొన్ని ట్రోల్స్ వచ్చినప్పటికీ ఆ తర్వాత జాన్వీకపూర్ చాలా పాజిటివ్గా ముందుకు కొనసాగుతూ తన స్థాయిని పెంచుకుందనే చెప్పాలి.

తిరుమల దర్శనం

తిరుమల దర్శనం

ఇక శ్రీదేవి ఫ్యామిలీకి ఎంతో ఇష్టదైవమైన తిరుమల తిరుపతి దేవస్థానంకు కూడా తరచుగా జాన్వీకపూర్ వస్తూ ఉండడం విశేషం. ఇంతకుముందు శ్రీదేవి అలాగే తన కుటుంబ సభ్యులను ఇద్దరు కుతుళ్ళను కూడా తిరుపతికి తీసుకువచ్చి ప్రత్యేకంగా ఇక్కడ దర్శనం చేసుకుంటూ ఉండేవారు. ఇక తల్లి మరణించిన తర్వాత కూడా జాన్వీ కపూర్ తరచుగా శ్రీవారిని దర్శించుకోవడం విశేషం.

తెలుగు ట్రెడిషినల్ లుక్

తెలుగు ట్రెడిషినల్ లుక్

ఇక శుక్రవారం రోజు కూడా ఉదయాన్నే జాన్వికపూర్ ప్రత్యేకంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారిని దర్శించుకుని చాలా సింపుల్ గా కనిపించారు. ఆమె తెలుగుతనం హైలైట్ అయ్యే విధంగా లంగా వోనిలో కనిపించారు. అసలు ఆ లుక్ లో జాన్వీ ని చూసిన జనాలు ఎవరు కూడా గుర్తుపట్టలేకపోయారు. ఎప్పుడు గ్లామరస్ ప్రపంచంలో బిజీగా ఉండే జాన్వీ అలా మొదటిసారి లంగా వోనిలో కనిపించేసరికి అందరూ ఫిదా అయిపోయారు.

తెలుగు సినిమాలు చేస్తే..

తెలుగు సినిమాలు చేస్తే..

జాన్వి కపూర్ గ్లామరస్ డ్రెస్ లలో కన్నా ఈ లంగా వోనిలోనే చాలా అందంగా ఉంది అంటూ చాలా సోషల్ మీడియాలో అయితే చాలా పాజిటివ్ కామెంట్ చేస్తున్నారు. తప్పకుండా తెలుగులో కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది అని ఇక్కడ సినిమాలు కూడా చేస్తే బాగుంటుంది అని సలహాలు ఇస్తున్నారు. అయితే గతంలోనే జాన్వీ కపూర్ విజయ్ దేవరకొండ తో నటించాలని ఉంది అని వివరణ ఇచ్చింది. మరి రాబోయే రోజుల్లో ఈ బ్యూటీ తెలుగులో ఎలాంటి సినిమాలు చేస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X