కండోమ్ యాడ్స్‌కు జాన్వీ కపూర్ బెస్ట్.. ప్రముఖ వ్యాపార్త వేత్త షాకింగ్ కామెంట్స్
బాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో అలరిస్తూ వస్తోంది. ఇటీవల పరమ్ సుందరి అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక తెలుగులో గ్లోబల్ స్టార్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన దేవర : పార్ట్ 1 చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. దేవర చిత్రం తర్వాత జాన్వీ కపూర్ కు టాలీవుడ్ టాప్ ప్రాజెక్ట్స్ ల్లో అవకాశాలు దక్కడం విశేషం. దీంతో బాలీవుడ్, సౌత్ లో జాన్వీ కపూర్ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.
ఈ క్రమంలో జాన్వీకపూర్ రేంజ్ పెరగడంతో పలు బ్రాండ్స్ ను ఎండోర్స్ మెంట్ కు సైన్ చేస్తూ వస్తోంది. పలు ప్రాడక్ట్స్ కు సంబంధించిన యాడ్ ఫిల్మ్స్ లో నటిస్తూ కనిపిస్తోంది. ఇప్పటికే జాన్వీ కపూర్ విటేరో టైల్స్, నైకా, కోకా - కోలా వంటి బ్రాండ్స్ కు అంబాసిడర్ గా వ్యవహరించింది. వీటితో పాటు మర్నిన్ని క్లాథింగ్, బ్యూటీ ప్రాడక్ట్స్ ను కూడా ప్రమోట్ చేస్తూ వచ్చింది. ఇలా యాడ్ ఫిల్మ్స్ తోనూ తన మార్కెట్ ను పెంచుకుంది.

కాగా జాన్వీ కపూర్ పై ప్రముఖ వ్యాపారవేత్త షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రముఖ మ్యాన్ ఫోర్స్ కంపెనీ అధినేత రాజీవ్ జునెజా జాన్వీ కపూర్ గురించి మాట్లాడారు. ఇటీవల ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ 'జాన్వీ కపూర్, రన్బీర్ కపూర్ ఇద్దరు కలిసి కండోమ్స్ బ్రాండ్ ను ఎండార్స్ చేయించాలనే ఆలోచన ఉండింది. జాన్వీ కపూర్ బెస్ట్ ఛాయిస్ అని నా నమ్మకం.' అంటూ ఆసక్తికరంగా కామెంట్స్ చేశారు.
ఇక వ్యాపార వేత్తలు తమ వ్యాపారాన్ని దేశ వ్యాప్తంగా ప్రమోట్ చేసేందుకు సెలబ్రెటీలతో అగ్రిమెంట్ ప్రకారం యాడ్ ఫిల్మ్స్ చేయిస్తూ ఉంటారనేది తెలిసిందే. ఇక జాన్వీ కపూర్ దేశ వ్యాప్తంగా తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంది. ఈ క్రమంలోనే వ్యాపార వేత్త రాజీవ్ ఇలాంటి కామెంట్స్ చేశారని తెలుస్తోంది. కానీ జాన్వీ కపూర్ మాత్రం తన కెరీర్ లో ఆచీతూచీ అడుగులు వేస్తోంది. సెలెక్టెడ్ ప్రాజెక్ట్స్ ల్లోనే నటిస్తూ వస్తోంది. తనకు ఏమాత్రం నచ్చకపోయినా ఆ ప్రాజెక్ట్ కు సైన్ చేయడం లేదు.
ప్రస్తుతం జాన్వీ కపూర్ టాలీవుడ్ భారీ చిత్రం పెద్ది చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ - బుచ్చిబాబు దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మాతలు నవీన్ యేర్నెనేని, రవి శంకర్ రూ.300 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది మార్చి 27న విడుదల కానుంది. అలాగే అల్లు అర్జున్ - అట్లీ ప్రాజెక్ట్ లోనూ జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఎంపికైందని తెలుస్తోంది. మరోవైపు హిందీలోనూ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ ల్లో అవకాశం దక్కించుకుంది. ఇలా బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ లో సూపర్ బిజీగా ఉంది జాన్వీ కపూర్.


Click it and Unblock the Notifications











