Devara: దేవరలో జాన్వీ కపూర్‌పై ప్రియుడు షాకింగ్ కామెంట్స్.. ఇంతకీ ఏమన్నారంటే?
Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్, సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబో తెరకెక్కిన మూవీ 'దేవర'. ఈ మూవీ భారీ అంచనాలతో సెప్టెంబర్ 27 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు ఆరేండ్ల తరువాత జూనియర్ ఎన్టీఆర్ సోలో హీరోగా వస్తుండటంతో ఫ్యాన్స్ అంచనాలు ఆకాశానికి అంటాయి. అలాగే.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆచార్య డిజాస్టర్ తర్వాత వస్తున్న మూవీ కావడంతో హిట్ ఇస్తారనే నమ్మకం డైరెక్టర్ కెరటాలపై రెట్టింపు అయ్యింది. ఇలా ఎన్నో భారీ అంచనాలతో విడుదలైన ఈ మూవీ మిక్స్డ్ టాక్ తో దూసుకుపోతుంది. తొలి రోజే రూ.170 కోట్ల వరకు వసూలు చేసిన దేవర మూవీపై, జాన్వీ కపూర్ బాయ్ ఫ్రెండ్ శిఖర్ పహరియా షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇంతకీ ఏమన్నారో మీరు కూడా ఓ లూక్కేయండీ.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన దేవర మూవీలో భారీ అంచనాల మధ్య విడుదలైంది. ఈ మూవీలో ఎన్టీఆర్ డ్యూయల్ రూల్ మెప్పించారు. కొరటాల శివ దర్శకత్వంలో దేవర హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కింది. ఈ మూవీలో ఎన్టీఆర్ నటనకు భారీ రెస్పాన్స్ వస్తుంది. ఫ్యాన్స్ నుంచే కాదు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకున్నారు తారక్. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా కనిపించారు. సైఫ్ కూడా యాక్టింగ్ పరంగా చించేశారు.

ఇక దేవర హీరోయిన్ జాన్వీ కపూర్ విషయానికి వస్తే.. ఈ మూవీలో జాన్వీ తంగం అనే పల్లెటూరి పిల్లా పాత్రలో నటించింది. ఈ మూవీలో తెలుగు అమ్మాయిలా సందడి చేసింది. అయితే.. దేవర పార్ట్ 1లో జాన్వీ కపూర్ 20 నిమిషాల కన్నా ఎక్కువ కనిపించదు. జాన్వీ అసలు ఫస్టాఫ్‌లో అసలు కనిపించలేదు. సెకండ్ హాఫ్ లో తంగం గా చలాకీగా కనిపించిన జాన్వీ కపూర్ పాటల్లో మాత్రం అందంగా కనిపించింది. జాన్వీ మొదటి నుంచి చెప్పినట్టుగానే దేవర 2 లో ఆమె పాత్ర హైలెట్ అయ్యేలా కనిపిస్తుంది.
ఈ మూవీ పార్ట్ 1 లో దర్శకుడు హీరో ఎలివేషన్స్, యాక్షన్ మీద ఫోకస్ చేయడంతో హీరో, హీరోయిన్ మధ్యన కెమిస్ట్రీ ట్రాక్ కి అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదనే చెప్పాలి. కానీ కనిపించిన ఆ 20 నిమిషాలు ఆమె పాత్ర హైలెట్ అయ్యేలా నటించింది. ఇక 'చుట్టమల్లె' సాంగ్ లో మాత్రం జాన్వీ డాన్స్ అదుర్స్. క్యారక్టర్ లెంగ్త్ తక్కువగానే ఉన్నా.. ప్రేక్షకులందరీకి గుర్తుండిపోయేలా అందాలు ఆరబోసింది జాన్వీ. జాన్వీ స్క్రీన్ టైమ్ ఎక్కవ ఉండే బాగుంటుందనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. అయితే.. జాన్వీ కపూర్ సీన్స్, ఓ పాట అంటే దాదాపు ఏడు నిముషాల దాకా కట్ చేసారని టాక్. దావూది సాంగ్ కూడా తీసేసారు.
దేవర మూవీపై, జాన్వీ కపూర్ నటనపై జాన్వీ బాయ్ ఫ్రెండ్ శిఖర్ పహరియా షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ మూవీ చూసిన ఆయన జాన్వీ యాక్టింగ్‌కు ఫిదా అయినట్లు తెలిపాడు. ఆమె స్క్రీన్ ప్రజెన్స్‌కు తాను మైమరిచిపోయానని పేర్కొన్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తెలియజేస్తూ దేవరలోని జాన్వీ కపూర్ ఫొటోను షేర్ చేశాడు. 'నేనేమైనా కలలో ఉన్నానా?' అంటూ ఇంట్రెస్టింట్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. దీంతో మీ రిలేషన్ గురించి త్వరగా బయటకు చెప్పేయండి అంటూ పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఇంతకీ శిఖర్ పహరియా ఎవరు?
మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్‌కుమార్ షిండే మనవడే శిఖర్ పహరియా. శిఖర్ తో జాన్వీ చాలాకాలంగా డేటింగ్‌లో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. శిఖర్, జాన్వీ ఇద్దరూ ఒకే స్కూల్‌లో చదువుకున్నారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. ఇద్దరం హైస్కూల్ వరకు కలిసి చదువుకున్నాం. శిఖర్ ప్రొఫెషనల్ పోలో ప్లేయర్ కాగా, 26 ఏళ్ల శిఖర్ పహాడియా యువ వ్యాపారవేత్తగా మారాడు. శిఖర్ తన ప్రేయసి జాన్వీతో కలిసి పలు పార్టీలు, ఈవెంట్‌లలో పలుమార్లు కనిపిస్తాడు. ఇది మాత్రమే కాదు నటి జాన్వీ కపూర్ కుటుంబానికి కూడా శిఖర్ చాలా సన్నిహితుడు.
ఇదిలా ఉంటే.. తిరుమలకు కలిసి వెళ్లడం వంటి చేస్తుంటారు. దీంతో వీరిద్దరి డేటింగ్ రూమర్స్ ప్రచారం జోరందుకుంది. అలాగే.. 'మైదాన్' ప్రమోషన్స్‌లోనూ పహరియా నిక్‌నేమ్‌తో కూడిన నెక్లెస్‌ను జాన్వీ ధరించడం కూడా బాలీవుడ్ లో చర్చనీయంగా మారింది. హిందీలో కాఫీ విత్ కరణ్ షోలనూ 'మీ స్పీడ్ డయిల్ లిస్ట్‌లో ఎవరి నంబర్లు ఉంటాయి?' అని అడగగా తన డాడీ, సిస్టర్, తన బాయ్ ఫ్రెండ్ శిఖర్ పేర్లు ఉన్నట్టు తెలిపింది. ఈ ఘటన కూడా జాన్వీ - శిఖర్ రిలేషన్ ఉందంటూ పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











