పూనమ్ పాండేను మించిపోయేలా.. హద్దుమీరిన జాన్వీ కపూర్ గ్లామర్ ట్రీట్.. దారుణంగా నెటిజన్ల ట్రోలింగ్
శ్రీదేవి నటవారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన ఆమె పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ ఎలా అయినా హిట్ కొట్టాలని చూస్తోంది. ఇప్పటిదాకా ఆమెకు సరైన హిట్ కొట్టలేదు. ఎలా అయినా స్టార్ హీరోయిన్ అని అనిపించుకోవడానికి ఆమె చేయని ప్రయత్నం అంటూ లేదు. రకరకాల ఫోటో షూట్లు చేస్తూ హాట్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూనే ఉంటుంది. తాజాగా ఆమె ఒక హాట్ అవుట్ ఫిట్లో కనిపించగా ఆ డ్రెస్ ఇప్పుడు పెద్ద రచ్చకు దారి తీసింది. ఆ వివరాల్లోకి వెళితే..

హాట్ అనిపిస్తే
బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ఎప్పుడూ తన స్టైల్ స్టేట్‌మెంట్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తుస్తూ ఉంటుంది. ఆమె ఇటీవల ఒక ఈవెంట్‌కు వెళ్ళినప్పుడు హాట్ అవుట్ ఫిట్ లో కనిపిచింది. టీవీ మొదలు సినిమా స్టార్స్ అందరూ హాజరైన ఒక స్టార్-స్టడెడ్ గ్రాండ్ అవార్డ్ నైట్‌కు హాజరైన ఆమె ఒక కొత్తరకం డ్రెస్లో కనిపించింది. కొంతమంది ఆమె డ్రెస్ హాట్ అనిపిస్తే మరికొంతమందికి ఆమె డ్రెస్ నచ్చినట్టు లేదు.

రకరకాల వింత డ్రెస్సులు
దీంతో ఆమె మీద విమర్శల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా జాన్వీ ఒక లోతైన నెక్‌లైన్ ఉన్న సైడ్ కట్ అవుట్ బ్లాక్ డ్రెస్‌లో సెక్సీగా దర్శనం ఇచ్చింది. ఆమె తన హాట్‌నెస్‌తో ఈవెంట్ మొత్తంలో కూడా సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలిచింది. అయితే నెటిజన్లు మాత్రం ఆమెను ఉర్ఫీ జావేద్ అని ట్రోల్ చేస్తున్నారు. రకరకాల వింత డ్రెస్సులు వేసుకుంటూ ఉండే ఉర్ఫీని ప్రతిసారీ ట్రోల్ చేస్తూనే ఉంటా

బట్టలు తగ్గించే పోటీ
ఇప్పుడు అదే విధంగా ఆమె పేరు పెట్టి జాన్వీని ట్రోల్ చేస్తున్నారు. 'జాన్వీ చాలా అందంగా ఉంది, ఆమె లుక్ చాలా బాగుంది' అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా, మరొకరు "హాట్‌గా కనిపిస్తున్నారు" అని మరో నెటిజన్ కామెంట్ చేశారు. ఇక మరో నెటిజన్ అయితే బట్టలు తగ్గించే పోటీ నడుస్తోందని కామెంట్ చేస్తే మరొకరు జాన్వీ పూనమ్ పాండేకి హై-క్లాస్ వెర్షన్" అని కామెంట్ చేసారు.

సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా
మరో నెటిజన్ అయితే "ఎన్నో శస్త్రచికిత్సల తర్వాత ఆమె ఇలా ఉంది." అంటూ కామెంట్ చేశారు. వారి కామెంట్ల సంగతి ఎలా ఉన్నా జాన్వీ మాత్రం కిల్లర్ లుక్స్ తో చంపేస్తోందని చెప్పక తప్పదు. ఆమె ఆ ఈవెంట్ మొత్తానికి సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలిచి ఆకట్టుకుంది. ఇక సినిమాల విషయానికి వస్తే జాన్వీ తన సినిమాలతో నటిగా తన సత్తాను మెల్లగా నిరూపించుకోగలిగింది.

వచ్చే ఏడాది విడుదల
గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్‌లో ఆమె నటనకు ప్రశంసలు అందుకుంది. ఆమె తర్వాత రాజ్‌కుమార్ రావుతో కలిసి మిస్టర్ అండ్ మిసెస్ మాహి అనే సినిమాలో కనిపించనుంది. ఇక ఆమె దోస్తానా 2 లో కూడా నటిస్తోంది. ఇక ఆమె నితేష్ తివారీ దర్శకత్వం వహించిన బవాల్ వచ్చే ఏడాది విడుదల కానుంది. ఇక మొత్తం మీద ఎలా అయితేనేమి ఆమె మాత్రం వార్తల్లో నిలుస్తోందని చెప్పక తప్పదు.


Click it and Unblock the Notifications











