‘బుచ్చిబాబు పైకి అమాయకంగా కనిపిస్తాడు. కానీ, నాతో అలాంటి పనులు చేయించాడు'

టాలీవుడ్‌లో భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా పెద్ది(Peddi) ఇప్పుడు ప్రమోషన్లతో మరింత హైప్ క్రియేట్ చేస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)హీరోగా, 'ఉప్పెన' ఫేమ్ బుచ్చి బాబు సనా (Buchi Babu Sana)దర్శకత్వంలో రూపొందుతున్న ఈ స్పోర్ట్స్ డ్రామా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. రిలీజ్ సమయం దగ్గరపడుతుండడంతో మూవీ మేకర్స్ ముంబైలో గ్రాండ్‌గా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ వేడుకలో హీరోయిన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఏమన్నారంటే?

ఈ ఈవెంట్‌లో జాన్వీ కపూర్ మాట్లాడుతూ.. దర్శకుడు బుచ్చిబాబు సానాపై చేసిన కామెంట్స్ హైలెట్ గా నిలిచాయి. "చూడటానికి చాలా అమాయకంగా కనిపిస్తాడు కానీ... నిజానికి ఆయన చాలా డేంజర్. ఇండియాలోనే పెద్ద రౌడీ డైరెక్టర్" అంటూ సరదా కామెంట్స్ చేసింది. అందులో ఆయన పనిపై ఉన్న డెడికేషన్ స్పష్టంగా కనిపిస్తుందని ఆమె వివరించింది. సినిమా కోసం ఆయన ఎంత కష్టపడతారో, ఎంత డీటైల్‌గా నటీనటులపై పని చేయిస్తారో ఆమె చెప్పుకొచ్చింది. అయితే ఈ 'రౌడీయిజం' షూటింగ్ సమయంలో మాత్రం బయటపడదని, సెట్స్‌లో మాత్రం ఫ్రెండ్లీగా, అందరితో కలిసిపోయే వ్యక్తిగా ఉంటాడని జాన్వీ చెప్పడం గమనార్హం.

Janhvi Kapoor Calls Buchi Babu Rowdy Director Peddi Trailer Event Goes Viral

పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ 'అచ్చియమ్మ' అనే మాస్, ఎనర్జీతో నిండిన పాత్రలో కనిపించనుంది. ఇప్పటివరకు తన కెరీర్‌లో ఇలాంటి పాత్ర చేయలేదని ఆమె తెలిపింది. 'నాలుక ఇలా తిప్పు, లంగా ఇలా పట్టుకో, ఇలా మాట్లాడాలి' అంటూ బుచ్చిబాబు ఇచ్చిన డైరెక్షన్‌ను బ్లైండ్‌గా ఫాలో అయ్యానని, ఈ పాత్ర తనకు పూర్తిగా కొత్త అనుభవమని చెప్పింది. అంతేకాదు, సినిమా రిలీజ్ తర్వాత తన నటన బాగున్నా, బాలేకపోయినా క్రెడిట్ మొత్తం డైరెక్టర్‌కే ఇవ్వాలని సరదా కామెంట్స్ చేసింది. దీన్ని బట్టి ఈ సినిమా కోసం జాన్వీ ఎంతగా ఎఫర్ట్ పెట్టిందో అర్థమవుతోంది.

హీరో రామ్ చరణ్ గురించి కూడా జాన్వీ కపూర్ ఎంతో గొప్పగా మాట్లాడింది. 'ఆయన చాలా మంచి వ్యక్తి. ఆయనతో పని చేయడం నా అదృష్టం' అంటూ ప్రశంసలు కురిపించింది. ఈ సందర్భంగా తన తల్లి శ్రీదేవి (Sridevi), మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కాంబినేషన్‌ను గుర్తు చేస్తూ, ఇప్పుడు తాము ఇద్దరం కలిసి నటించడం ఒక 'కాస్మిక్ కనెక్షన్' లా అనిపిస్తోందని చెప్పింది. ఈ వ్యాఖ్యలు మెగా అభిమానుల్లో మరింత ఎమోషన్ క్రియేట్ చేశాయి. గతంలో చిరంజీవి-శ్రీదేవి జంట సృష్టించిన మ్యాజిక్ మళ్లీ రిపీట్ అవుతుందా? అనే ఆసక్తి పెరిగింది.

ముంబైలో నివసిస్తున్నప్పటికీ, తనకు తెలుగు రాష్ట్రాలే సొంతిల్లు అని జాన్వీ చెప్పడం మరో హైలైట్‌గా నిలిచింది. స్టేజ్‌పైనే "అందరికీ నమస్కారం" అంటూ తెలుగు మాట్లాడి అభిమానులను ఆకట్టుకుంది. భవిష్యత్తులో మరిన్ని తెలుగు సినిమాలు చేయాలనే ఆసక్తిని కూడా వ్యక్తం చేసింది. ఈ ఈవెంట్‌లో రామ్ చరణ్ చేతికి గాయంతో కనిపించడం కూడా చర్చనీయాంశమైంది. షూటింగ్ సమయంలో ఒక యాక్షన్ సీన్ చేస్తుండగా గాయం అయినట్లు ఆయన స్వయంగా వెల్లడించారు. అయినప్పటికీ ప్రమోషన్స్‌లో పాల్గొనడం ఆయన కమిట్‌మెంట్‌కు నిదర్శనంగా అభిమానులు అభినందిస్తున్నారు.

పెద్ది సినిమా పైన ఉన్న అంచనాలను ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ మరింత పెంచింది. రియల్ లైఫ్ ఇన్‌స్పిరేషన్‌తో కూడిన స్పోర్ట్స్ డ్రామాగా, మాస్ ఎలిమెంట్స్‌తో కూడిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. జూన్ 4న విడుదల కానున్న ఈ సినిమా రామ్ చరణ్ కెరీర్‌లో మరో బిగ్ హిట్‌గా నిలుస్తుందా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X