విచిత్రమైన డ్రెస్‌లో జాన్వీ కపూర్ రచ్చ: వామ్మో మరీ ఇంత దారుణమా!

జాన్వీ కపూర్.. ఈ పేరుకు దేశ వ్యాప్తంగా పెద్దగా పరిచయం అవసరం లేదు. అంతలా ఈ చిన్నది దిగ్గజ నటి, అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా చాలా చిన్న వయసు నుంచే నేషనల్ రేంజ్‌లో పాపులారిటీని సంపాదించుకుంది. ఇక, హీరోయిన్‌గా పరిచయం అయిన తర్వాత మరింతగా క్రేజ్‌ను అందుకుంది. దీంతో రెట్టించిన ఉత్సాహంతో వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ కెరీర్‌ను మరింత ముందుకు తీసుకు వెళ్తోంది. ఇలా సుదీర్ఘ కాలంగా వరుస సినిమాలతో సందడి చేస్తోన్నా.. జాన్వీ కపూర్ సోషల్ మీడియాలోనూ విపరీతంగా హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ అమ్మడు కొన్ని హాట్ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. వాటిపై మీరు కూడా ఓ లుక్కేయండి మరి!

అలా పాపులర్ అయిన జాన్వీ

అలా పాపులర్ అయిన జాన్వీ

అలనాటి అందాల తార శ్రీదేవి కూతురిగా ప్రపంచానికి పరిచయమైన జాన్వీ కపూర్.. 'ధడక్' అనే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో ఆమె అద్భుతమైన నటనతో యమ హైలైట్ అయింది. మొదటి చిత్రమే అయినా ఏమాత్రం బెరుకు లేకుండా హవభావాలు పలికించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఫలితంగా జాన్వీ కపూర్ మరింత పాపులర్ అయింది.

ఎక్కువగా అలాంటి మూవీలే

ఎక్కువగా అలాంటి మూవీలే

'ధడక్' మూవీతో జాన్వీ కపూర్‌కు భారీ స్థాయిలో గుర్తింపు వచ్చింది. దాన్ని ఏమాత్రం పాడు చేసుకోకుండా ఈ అమ్మడు తనకంటూ ప్రత్యేకమైన పంథాను ఏర్పరచుకుని ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగానే 'గుంజాన్‌ సక్సేనా: ద కార్గిల్‌ గర్ల్‌' అనే బయోపిక్ మూవీలో నటించి ఆకట్టుకుంది. అయితే మరో ప్రయోగాత్మక చిత్రం 'రూహీ' మాత్రం జాన్వీకి నిరాశనే మిగిల్చింది.

గుడ్ లక్ అంటూ.. ఆ రెండు

గుడ్ లక్ అంటూ.. ఆ రెండు

జాన్వీ కపూర్ బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతోంది. ఇందులో 'గుడ్ లక్ జెర్రీ' అనే మూవీ తమిళంలో హిట్ అయిన 'కలమావు కోయిల'కు రీమేక్‌గా తెరకెక్కింది. ఇది జూలై 29 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రానికి ఆశించిన రీతిలో స్పందన రావట్లేదు. అలాగే, 'దోస్తానా 2', బోనీ కపూర్ నిర్మిస్తోన్న 'మిలీ' అనే సినిమాలోనూ ఈ చిన్నది హీరోయిన్‌గా చేస్తోంది.

టాలీవుడ్ ఎంట్రీ... ప్లాన్స్‌తో

టాలీవుడ్ ఎంట్రీ... ప్లాన్స్‌తో

జాన్వీ కపూర్ తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వబోతుందని చాలా కాలంగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ, ఎన్టీఆర్ సినిమాల్లో ఆమె భాగమైందని ఊహాగానాలు వచ్చాయి. కానీ, వాటిని బోనీ కపూర్ ఖండించారు. అయితే, ప్రస్తుతం జాన్వీ కపూర్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చే దిశగా ప్లాన్లు చేస్తున్నట్లు దేశ వ్యాప్తంగా ప్రచారం జరుగుతోంది.

సోషల్ మీడియాలో బిజీగా

సోషల్ మీడియాలో బిజీగా

హీరోయిన్‌గా పరిచయమైన చాలా తక్కువ టైంలోనే జాన్వీ కపూర్ స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది. అదే సమయంలో వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తోంది. అయినప్పటికీ.. ఈ అమ్మడు సోషల్ మీడియాలోనూ యమ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో షేర్ చేసుకుంటోంది. దీంతో ఫాలోయింగ్ పెంచుకుంటోంది.

అందాల విందు చేస్తోంది

అందాల విందు చేస్తోంది

జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో ఏ రేంజ్‌లో రెచ్చిపోతోందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరీ ముఖ్యంగా ఆమె అందాలను ఆరబోస్తూ ఓ రేంజ్‌లో రచ్చ చేస్తోంది. ఇందులో భాగంగానే తన లేలేత అందాలను షో చేస్తూ దిగిన ఫొటోలు, తీసుకున్న వీడియోలనే ఎక్కువగా షేర్ చేస్తోంది. ఫలితంగా ఈ బ్యూటీ తరచూ హాట్ టాపిక్ అవుతూ ఇంటర్నెట్‌లో విపరీతంగా హైలైట్ అయిపోతోంది.

హాట్ ఫొటోలు వదిలింది

హాట్ ఫొటోలు వదిలింది

తాజాగా జాన్వీ కపూర్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె ఈ అమ్మడు క్లీవేజ్ షో చేస్తూ రెచ్చిపోయింది. ఫలితంగా ఈ ఫొటోల్లో జాన్వీ కపూర్ ఎద అందాలు విపరీతంగా కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ కుర్ర హీరోయిన్ షేర్ చేసిన ఈ పిక్స్‌కు నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. తద్వారా ఇవన్నీ తెగ వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X