Devara: కొరటాల స్క్రిప్టు ఇస్తే జాన్వీ కపూర్ చించి పారేసిందంట.. సెట్‌లో అలా షాక్‌లో ఎన్టీఆర్!
ఇప్పుడు సౌత్ ఇండియా సినిమా దగ్గర భారీ అంచనాలు సెట్ చేసుకొని రిలీజ్ కి వస్తున్నా లేటెస్ట్ సినిమా ఏదన్నా ఉంది అంటే ఆ చిత్రం ఖచ్చితంగా మ్యాన్ ఆఫ్ మాసెస్ హీరో ఎన్టీఆర్ కథానాయకుడుగా దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కించిన రెండో సినిమా అందులోని బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాగా వస్తున్న చిత్రం "దేవర" కోసమే అని చెప్పాలి.
కాగా దేవర సినిమా హిట్ కావాల్సిన పరిస్థితి ఒక్క అభిమానులకే కాకుండా సినిమా యూనిట్ కి కూడా ఎంతో కీలకల్ అని చెప్పాలి. ఎందుకంటే ఎన్టీఆర్ దాదాపు 5 ఏళ్ల తర్వాత సోలోగా చేసిన మొదటి పాన్ ఇండియా సినిమా ఇది. అలాగే ఈ సినిమా ఆచార్య అనే ఎపిక్ డిజాస్టర్ తర్వాత కొరటాల శివ నుంచి వస్తున్నా సినిమా కావడం అలాగే ఎన్టీఆర్ కి రాజమౌళి తర్వాత తన నుంచి వస్తున్నా సినిమా కావడంతో ఆ సెంటిమెంట్ ని ఈ సినిమా అయినాయి బ్రేక్ చేస్తుందా అనేది ఆసక్తిగా మారింది.

ఇక దీనితో పాటుగా ఈ సినిమాతోనే తెలుగు ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కి కూడా ఈ చిత్రం ఎంతో కీలకంగా నిలిచింది. ఇంకా ఈ సినిమా హిట్ కావాల్సిన అవసరం చాలా మందికి కనిపిస్తుంది. అయితే జాన్వీ కపూర్ కి ఇది తెలుగులో మొదటి సినిమా సో తనకి మరింత ప్రెజర్ ఉంటుందని చెప్పొచ్చు. మరి మొదటి సినిమా అంటే ఏ నటుడు అయినా నటి అయినా కూడా ప్రాణం పెట్టి పని చేస్తారు.
అలానే ఈ సినిమాకి జాన్వీ అయితే తన వర్క్ తో ఎన్టీఆర్ అలాగే కొరటాల కొరటాల శివ మైండ్ బ్లాక్ చేసిందట. జెనరల్ గా నార్త్ హీరోయిన్స్ అనే కాకుండా నార్త్ నుంచి విలన్స్ అన్నా కూడా మనకి మక్కువ ఎక్కువ అలానే వారికి తెలుగు రాకపోయినా వారు డైలాగ్స్ సరిగ్గా మ్యాచ్ చేస్తూ చెప్పకపోయినప్పటికీ మనోళ్లు ఏదొకలా డబ్బింగ్ లో మ్యానేజ్ చేసేస్తారు. కానీ ఇక్కడ దేవర విషయంలో జాన్వీ చాలా ఆశ్చర్యపరిచిందట.
జాన్వికి ఒక రెండు పేజీల డైలాగ్స్ సీన్ ని కొరటాల డిజైన్ చేస్తే ఆ మొత్తం సీన్ ని జాన్వీ ఎలాంటి కట్ లేకుండా నాన్ స్టాప్ గా అద్భుతమైన నటనతో చేసి పారేసిందట. దీనితో ఈ సీన్ చూసిన ఎన్టీఆర్ అలా షాకయ్యాయిపోయానని చెప్పాడు. ఆ సీన్ చించి అవతలేసింది అని శివకి ఇంకో టేక్ అవసరం లేదు జాన్వీ టోటల్ సీన్ అద్భుతంగా చేసింది అని ఎన్టీఆర్ చెప్పాడట.

అలాగే మరో ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ ఏమిటంటే సినిమాలో ఎన్టీఆర్ తో ఎనర్జిటిక్ సాంగ్ దావుది కోసం తెలిసిందే. ఇందులో జాన్వీ కపూర్ మైండ్ బ్లోయింగ్ డాన్స్ మూమెంట్స్ చూసి చాలా మంది షాకయ్యారు. అయితే అసలు డాన్స్ షూట్ కి ముందు అంతా జాన్వీ చాలా జ్వరంతో బాధపడిందట.
కానీ ఇలా తగ్గిందో లేదో వెంటనే సెట్స్ లోకి వచ్చేసి ఈ పవర్ఫుల్ మూమెంట్స్ ఉన్న సాంగ్ ని చేసేసింది అని తారక్ తెలిపాడు. ఇలా జాన్వీ అయితే దేవర విషయంలో ఎంతో ఆశ్చర్యపరిచింది అని చెప్పాలి. మరి అలనాటి నటి శ్రీదేవి వారసురాలిగా అదే డెడికేషన్ డిక్షన్ తో జాన్వీ కపూర్ తల్లికి తగ్గ కూతురు అనిపించుకుందని కూడా ఆమె సెలవిచ్చాడు. మరి ఆ రేంజ్ జాన్వీ అయితే ఇంప్రెస్ చేసింది.


Click it and Unblock the Notifications











