Devara:దేవర పాటలో జాన్వీ కపూర్ అదిరిపోయే అందాల విందు..హాట్ షోతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు మాటిపోయేలా!
గత కొన్నాళ్ల నుంచి సౌత్ సినిమాకి చెందిన పలువురు హీరోయిన్స్ నార్త్ మార్కెట్ లోకి వెళ్లడం అక్కడ తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడం చేస్తూ వచ్చారు. అయితే సౌత్ నుంచి నార్త్ కి వెళ్లి పాగా వేసిన హీరోల రేటు ఎక్కువ శాతం ఉంది కానీ హీరోయిన్స్ మాత్రం చాలా తక్కువే ఉంటారని చెప్పాలి. కాగా ఒకప్పుడు ఎప్పుడో శ్రీదేవి వెళ్లి సక్సెస్ అయ్యి అక్కడే పాగా వేసేసారు. తర్వాత శృతి హాసన్ కూడా వెళ్ళింది కానీ సక్సెస్ కాలేకపోయింది.
అయితే నార్త్ నుంచి సౌత్ లోకి వచ్చి పాగా వేసిన హీరోయిన్స్ కూడా ఉన్నారు. వారిలో తమన్నా సౌత్ లోనే హిట్స్ అందుకోగా ఇంకొంతమంది అలా వచ్చి మళ్ళీ హిందీ సినిమాలోకే వెళ్లిపోయారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. తెలుగు సినిమా సత్తా కూడా చాటుతుండడంతో హిందీ మార్కెట్ నుంచి తెలుగు మార్కెట్ లోకి కొందరు హీరోయిన్స్ సినిమాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

అలా గత ఏడాది అనన్య పాండే పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ "లైగర్" తో వచ్చింది కానీ తనకి హిట్ దక్కలేదు. ఇక నెక్స్ట్ తన ఫ్రెండ్, అలనాటి నటి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ కూడా తెలుగులో మొదటి సినిమాగా భారీ చిత్రాన్ని సొంతం చేసుకుంది. బిగ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తో దర్శకుడు కొరటాల శివ లాంటి కాంబినేషన్ ను పట్టి మొదటి సినిమానే గ్రాండ్ లెవెల్లో ప్లాన్ చేసుకుంది.
అయితే తన రోల్ కి మొదటి భాగం కంటే రెండో భాగంలోనే ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది అని కూడా చెప్పుకొచ్చింది. కానీ జాన్వీ కపూర్ అందాలను మాత్రం ఎలా వాడాలో అలా ఈ సినిమాకి వాడేసినట్టుగా తాజా సాంగ్ చూస్తే అర్ధం అవుతుంది. ఎన్టీఆర్ పక్కన తన అండ చందాలతో జాన్వీ కపూర్ మాత్రం ఈ సాంగ్ లో అదరగొట్టింది అని నెటిజన్స్ అంటున్నారు.

అనిరుద్ ఇచ్చిన ట్యూన్ కి పెద్దగా మార్కులు రాలేదు కానీ జాన్వీ కపూర్ అందాన్ని తన హాట్ షో ని మాత్రం పొగడకుండా నెటిజన్స్ ఉండలేకపోతున్నారు. ఏ అందాన్ని ఎక్కడ వరకు చూపించాలో అన్నట్టుగా డ్రెస్సింగ్, తన స్కిన్ షో ఆ విజువల్స్ తో మరింత హైలైట్ అయ్యింది. దీనితో తన మొదటి సినిమాకే జాన్వీ కపూర్ ఈ రేంజ్ ట్రీట్ ఇస్తుంది అని చాలా మంది ఊహించి ఉండకపోవచ్చు.
ఫస్ట్ లుక్ వదిలినపుడు చాలా సింపుల్ గానే జాన్వీ కపూర్ కనిపించింది కానీ ఈ సాంగ్ చూసాక మాత్రం హీటెక్కించింది అనే చెప్పి తీరాలి. మరి సినిమాలో తన గ్లామర్ షో ఒక్క సాంగ్ వరకు మాత్రమేనా నార్మల్ సీన్స్ లో కూడా ఉంటాయా అనేది చూడాలి. కాగా ఈ చిత్రాన్ని మేకర్స్ ఈ సెప్టెంబర్ 27కి గ్రాండ్ రిలీజ్ చేసే విధంగా షెడ్యూల్ చేయగా పాన్ ఇండియా భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











