వైరల్ వీడియో.. వయ్యారంగా ఊపుతున్న జాన్వీ.. ఎవ్వరైనా సరే ఫిదా అవ్వాల్సిందే!!
స్వర్గీయ అతిలోక సుందరి శ్రీదేవీ తనయగా వెండితెరకు పరిచయమైంది జాన్వీ కపూర్. మరాఠీలో వచ్చిన సైరాత్‌కు రీమేక్‌గా వచ్చిన ధడక్ అనే చిత్రంతో తెరంగేట్రం చేసింది. ఇప్పటి వరకు కనిపించింది ఒక్క సినిమాలోనే అయినా.. స్టార్ హీరోయిన్ స్టేటస్ వచ్చేసింది. కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకుంది. వెండితెరపై సినిమాలతో అభిమానుల ముందుకు రాకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం నిత్యం టచ్‌లోనే ఉంటుంది. తాజాగా ఆమె చేసిన డ్యాన్స్ అందరిని గతంలోకి తీసుకెళ్లేలా ఉంది. ఆ కథెంటో ఓసారి చూద్దాం.

సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్..
జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటుంది. వ్యాయామాం చేస్తున్న వీడియోలు, ఫోటోలు, పార్టీలకు సంబంధించిన పిక్స్ ఇలా ప్రతీ ఒక్క అప్‌డేట్ ఇస్తూ ఉంటుంది. జాన్వీ కపూర్ ధరించే దుస్తులు ఒక్కోసారి హాట్ టాపిక్‌గా మారుతుంటాయి.

పొట్టి దుస్తులపై ట్రోలింగ్..
జాన్వీ నిత్యం స్కర్ట్, షార్ట్స్ అంటూ పొట్టి దుస్తులను ధరిస్తూ ఉంటుంది. ముఖ్యంగా జిమ్‌కు వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు క్లిక్‌మనిపించే ఫోటోలు ఓ రేంజ్‌లో వైరల్ అవుతుంటాయి. వీటిపై జాన్వీ కూడా స్పందిస్తూ.. వాటి గురించి కాదు తన నటను గురించి మాట్లాడండి.. అలా మాట్లాడేలా చేస్తానని కూడా చెప్పుకొచ్చింది.

తాజాగా తిరుమలలో ప్రత్యక్షం..
తాజాగా ఈ ముద్దుగుమ్మ తిరుమలలో ప్రత్యక్షం అయింది. కాలినడకన వెళ్లి శ్రీవారిని దర్శించుకుంది. కొండ మీద లంగావోణిలో జాన్వీ దిగిన ఫోటోలు ఓ రేంజ్‌లో చక్కర్లు కొట్టాయి. పద్దతి, సంప్రదాయానికి ఓణి కడితే ఎలా ఉంటుందో జాన్వీ అలా ఉందని కామెంట్స్ చేశారు.
Recommended Video

నాటి నృత్యంతో అలరిస్తోంది..
తాజాగా ఓ డ్యాన్స్ వీడియోను షేర్ చేసింది. గైడ్ సినిమాలోని 'పియా తోసే నైనా లాగిరే' పాటకు ఆమె చేసిన డ్యాన్స్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు. పాత పాటకు ఆమె వయ్యారాలతో హొయలొలికిస్తూ పాదం కదపగా.. ఫాలోవర్స్ అందరూ ఫిదా అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో అభిమానుల ఎదలో కుంపటి పెట్టేలా కనిపిస్తోంది. జాన్వీ ప్రస్తుతం తఖ్త్, గుంజాన్ సక్సేనా, రూహీ అఫ్జానా, దోస్తానా 2 చిత్రాలతో జాన్వీ బిజీగా ఉంది.


Click it and Unblock the Notifications











