అందాల ఆరబోతలో బౌండరీ దాటిన జాన్వీ కపూర్: బీచ్‌లో కుర్రాడితో కలిసి రచ్చ.. ఆ అబ్బాయి అతడేనా!

అలనాటి అందాల తార.. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు ఇండియన్ సినిమాలో తన హవాను చూపించిన అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తెగా సినిమాల్లోకి ప్రవేశించింది బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్. తల్లి చాటు బిడ్డలా ప్రపంచానికి పరిచయం అయిన ఆమె.. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మాత్రం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది. సినిమాల పరంగానే కాదు.. తన వ్యవహార శైలితో నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా జాన్వీ కపూర్ బీచ్‌లో దిగిన బికినీ ఫొటోలను షేర్ చేసింది. అందులో ఓ కుర్రాడు కూడా ఉన్నాడు. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

చిన్న వయసులోనే లవ్ ట్రాకులు

చిన్న వయసులోనే లవ్ ట్రాకులు

జాన్వీ కపూర్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందే ఎంతో ఫేమస్ అయిపోయింది. దీనికి కారణం చిన్న వయసులోనే ఆమె ప్రేమాయణాలు సాగించడమే. మొదట్లో అక్షత్ రంజన్ అనే కుర్రాడితో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఈ భామ.. ఆ తర్వాత శిఖర్ పహారియా అనే అబ్బాయితో ప్రేమాయణం సాగించింది. వీళ్లిద్దరితో సన్నిహితంగా దిగిన ఫొటోలు అప్పట్లో సంచలనం అయిపోయాయి.

సినిమాల్లోకి ఎంట్రీ... అదరగొట్టింది

సినిమాల్లోకి ఎంట్రీ... అదరగొట్టింది

కొన్నేళ్ల క్రితం జాన్వీ కపూర్ 'ధడక్' అనే సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయింది. శాడ్ లవ్ స్టోరీగా వచ్చిన ఈ చిత్రంలో ఆమె నటనతో మెప్పించింది. అదే సమయంలో ఏమాత్రం బెరుకు లేకుండానే హవభావాలు పలికించి విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఫలితంగా గ్రాండ్ ఎంట్రీని సొంతం చేసుకుంది. శశాంక్ ఖైతాన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో ఇషాన్ ఖట్టర్ హీరోగా చేశాడు.

వరుస చిత్రాలతో జాన్వీ దూకుడు

వరుస చిత్రాలతో జాన్వీ దూకుడు

మొదటి సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో జాన్వీ కపూర్‌కు అవకాశాలు వెల్లువెత్తాయి. అయితే, ఆమె మాత్రం పాత్రకు ప్రాధాన్యం ఉన్న సినిమాలనే ఒప్పుకుంటోంది. ఈ క్రమంలోనే గత ఏడాది 'గుంజాన్‌ సక్సేనా: ద కార్గిల్‌ గర్ల్‌' అనే బయోపిక్ మూవీలో నటించింది. ఇక, ఈ సంవత్సరం 'రూహీ' అనే సినిమా చేసింది. అయితే, ఇది మాత్రం జాన్వీ కపూర్‌కు నిరాశనే మిగిల్చింది.

అందులో యమ బిజీగా ఉంటోంది

అందులో యమ బిజీగా ఉంటోంది

కొంత కాలంగా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటోంది జాన్వీ కపూర్. అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ తనకు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. అదే సమయంలో సినిమాల అప్‌డేట్లు కూడా ఇస్తోంది. వీటితో పాటు ఫొటోలు, వీడియోలను వదులుతూ ఇంటర్నెట్‌లో సెన్సేషన్ అవుతోంది.

గ్లామర్ ట్రీట్‌తో క్రష్‌గా మారిన పిల్ల

గ్లామర్ ట్రీట్‌తో క్రష్‌గా మారిన పిల్ల

చిన్న వయసు నుంచే జాన్వీ కపూర్ అందాల విందు చేయడంలో ముందుంటుంది. ఇందులో భాగంగానే సోషల్ మీడియాలో తరచూ గ్లామర్ ట్రీట్ చేస్తూ అందరి దృష్టినీ తన వైపునకు తిప్పుకుంటోంది. మరీ ముఖ్యంగా ఎక్కువగా క్లీవేజ్ షో చేసే ఫొటోలనే ఇంటర్నెట్‌లో షేర్ చేస్తోంది. తద్వారా దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది. తద్వారా ఎంతో మందికి క్రష్‌గా మారిపోయింది.

బీచ్‌లో బాయ్‌ఫ్రెండ్‌‌తో కలిసి రచ్చ

బీచ్‌లో బాయ్‌ఫ్రెండ్‌‌తో కలిసి రచ్చ

సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోన్న జాన్వీ కపూర్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో బీచ్‌లో దిగిన కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఈ అమ్మడు బికినీ ధరించి అందాలను ఆరబోస్తుంది. మరీ ముఖ్యంగా బుల్లి బట్టల్లో క్లీవేజ్ షోతో సెగలు రేపుతోంది. సముద్రపు అలల మధ్యలో పరువాలను ఎరగా వేస్తోంది. ఇక, ఇందులో ఆమె వెంట ఓ కుర్రాడు కూడా ఉన్నాడు.

Recommended Video

Bigg Boss Telugu Season 5 : Contestants వీళ్ళే ! మీకు ఓకే నా ? || Filmibeat Telugu
ఇంతకీ అందులో కుర్రాడు ఎవరబ్బా

ఇంతకీ అందులో కుర్రాడు ఎవరబ్బా

జాన్వీ కపూర్ షేర్ చేసిన ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి విపరీతమైన స్పందన వస్తోంది. అదే సమయంలో ఇందులో ఆమె వెంట ఉన్న కుర్రాడు ఆమె బాయ్‌ఫ్రెండేనా అని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఆ ఫొటోలో ఆ కుర్రాడు వెనుక నుంచి కనిపించడంతో.. అతనెవరనేది సస్పెన్స్‌గా మారింది. ఈ అంశం ఇప్పుడు బాలీవుడ్‌లోనే కాకుండా దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X