Janhvi Kapoor: ఓ రేంజ్‌లో రెచ్చిపోయిన శ్రీదేవి కూతురు.. బ్రా మాత్రమే ధరించి అలా పడుకుని!
దేశంలోని మిగిలిన ఇండస్ట్రీలతో పోల్చుకుంటే బాలీవుడ్‌లోనే స్టార్ల వారసులు పరిచయం అవుతుంటారు. అక్కడ అబ్బాయిలే కాదు.. తమ అమ్మాయిలను సైతం తెరంగేట్రం చేయిస్తున్నారు. ఇలా కొన్నేళ్ల క్రితం బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. చాలా తక్కువ సమయంలోనే స్టార్‌డమ్‌ను అందుకుంది అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్. చూపు తిప్పుకోకుండా చేయగల అందంతో పాటు అద్భుతమైన నటనతో మాయ చేస్తోన్న ఈ భామ.. ఇప్పటికే కొన్ని విజయాలను కూడా సొంతం చేసుకుంది. అదే సమయంలో భారీగా ఫాలోయింగ్‌ను సైతం సంపాదించుకుంది. ఇక, సోషల్ మీడియాలో ఎప్పుడూ రచ్చ చేసే జాన్వీ కపూర్.. తాజాగా ఓ హాట్ పిక్‌ను షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? ఆ ఫొటోను మీరూ చూడండి!

అలా ఎంట్రీ.. యమ పాపులర్
దిగ్గజ నటి శ్రీదేవి కూతురిగా 'ధడక్' అనే సినిమాతో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా పరిచయం అయింది. ఇందులో ఆమె అద్భుతమైన నటనతో అందరినీ తనవైపు చూసేలా చేసుకుంది. మొదటి చిత్రమే అయినా ఏమాత్రం బెరుకు లేకుండానే హవభావాలు పలికించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఫలితంగా బాలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీని సొంతం చేసుకుని సత్తా చాటుకుంది.

అలాంటి మూవీలతో ఫేమస్
ఫస్ట్ మూవీకే యమ పాపులర్ అయిన జాన్వీ కపూర్.. ఆ తర్వాత కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటోంది. ఎక్కువగా తన పాత్రకు ప్రాధాన్యం ఉన్న వాటికే సైన్ చేస్తోంది. ఇలా ఇప్పటికే 'గుంజాన్ సక్సేనా: ద కార్గిల్ గర్ల్' అనే బయోపిక్ మూవీలో నటించి అలరించింది. అనంతరం 'రూహీ' అనే సినిమా చేసింది. అయితే, ఇది మాత్రం జాన్వీకి నిరాశనే మిగిల్చింది.

వరుస సినిమాలతో హల్‌చల్
చాలా తక్కువ సమయంలోనే బాలీవుడ్‌లో జాన్వీ కపూర్ స్టార్‌డమ్ వచ్చేసింది. దీంతో వరుసగా సినిమాలు చేస్తోంది. ఇక, ప్రస్తుతం ఈ బ్యూటీ 'గుడ్ లక్ జెర్రీ' అనే మూవీలో నటిస్తోంది. ఇది తమిళంలో హిట్ అయిన 'కలమావు కోయిల'కు రీమేక్‌గా తెరకెక్కుతోంది. అలాగే, 'దోస్తానా 2'తో పాటు బోనీ కపూర్ నిర్మిస్తోన్న 'మిలీ' అనే సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేసేసుకుంది.

టాలీవుడ్ ఆఫర్స్.. నో క్లారిటీ
జాన్వీ కపూర్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతుందని చాలా కాలంగా ఎన్నో వార్తలు ప్రచారం అవుతూనే ఉన్నాయి. ఇక, ఇప్పుడామె పూరీ జగన్నాథ్ - విజయ్ దేవరకొండ కలయికలో రాబోయే 'జన గణ మన' మూవీ ద్వారా తెలుగులోకి వస్తుందని ప్రచారం జరుగుతోంది. అలాగే, ఎన్టీఆర్ సినిమాకూ ఓకే చెప్పిందని అన్నారు. కానీ, ఈ వార్తను బోనీ కపూర్ దీన్ని ఖండించారు.

అందులో మాత్రం ఫుల్ బిజీ
చిన్న వయసులోనే స్టార్‌డమ్‌ను అందుకుని వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తోన్న జాన్వీ కపూర్.. సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ తనకు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో షేర్ చేసుకుంటోంది. అదే సమయంలో సినిమాల అప్‌డేట్లు కూడా ఇస్తోంది. వీటితో పాటు ఫొటోలు, వీడియోలను వదులుతోంది.

గ్లామర్ ట్రీట్‌తో జాన్వీ మాయ
సోషల్ మీడియాలో ఎంతో కాలంగా జాన్వీ కపూర్ చేస్తోన్న రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరీ ముఖ్యంగా తన అందాలను చూపిస్తూ దిగిన హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను ఎక్కువగా షేర్ చేస్తోంది. ఇలా ఈ అమ్మడు ఈ మధ్య కాలంలో గ్లామర్ ట్రీట్ చేస్తూ మరింతగా రెచ్చిపోతోంది. ఫలితంగా జాన్వీ తెగ హైలైట్ అవడంతో పాటు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.

ఫిల్మ్‌ఫేర్ కోసం ఘాటు ఫోజు
జాన్వీ కపూర్ తన బ్రాండ్ వ్యాల్యూను కూడా విపరీతంగా పెంచుకుంది. దీంతో ఎన్నో బ్రాండ్లకు ప్రచారకర్తగా చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఫిల్మ్‌ఫేర్ మ్యాగజైన్ కోసం కవర్ ఫోటోకు ఫోజులిచ్చింది. ఇందులో ఆమె బ్రా మాత్రమే ధరించి ఘాటు ఫోజులిచ్చింది. ఫలితంగా దీనికి నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. దీంతో ఈ పిక్ తెగ వైరల్ అయిపోతోంది.


Click it and Unblock the Notifications











