ఇంకా అమ్మ అక్కడే .. నేను బాధ్యతారాహిత్యంగా.. జాన్వీ కపూర్ ఎమోషనల్
బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ 21 రోజుల లాక్‌డౌన్ పిరియడ్‌ను భావోద్వేగాలతో నింపేసుకొంటున్నారు. స్వీయ గృహ నిర్బంధంలో ఉన్న జాన్వీ కపూర్ తాజాగా ఇన్స్‌టాగ్రామ్‌లో తన దినచర్యను, అలాగే తల్లి శ్రీదేవి గురించి ఎమోషనల్‌గా స్పందించారు. వారం రోజుల గృహ నిర్బంధంలో తన ఆలోచనలను సోషల్ మీడియా ద్వారా పంచుకొన్నారు. అవేమిటంటే..

లాక్‌డౌన్ అన్ని నేర్పింది
కరోనావైరస్ కారణంగా ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌లో భాగంగా జీవితంలో చాలా విషయాలు అర్ధమయ్యాయి. నేను తినే ఆహారం విలువ ముందుగా తెలిసింది. ఇంట్లో వస్తువులు ఎక్కువగా ఉంటాయనే భావిస్తుంటాను. లాక్‌డౌన్ ముగిసే సమయానికి ఇంటి రేషన్ అయిపోతుందని తెలిస్తే ఎలా ఉంటుందో అర్ధమైంది అని జాన్వి కపూర్ పేర్కొన్నారు.

నిత్యావసర వస్తువుల కోసం
ఇంట్లో నిత్యావసర వస్తువులు అయిపోతే వాళ్లు బయటకు వెళ్లి ఎంత కష్టపడాల్సి వస్తుందో ఇప్పుడు అర్థమైంది. వాళ్లు ఎలా తమ ప్రాణాలను రిస్క్‌లో పెడుతారో స్పష్టంగా అర్థమవుతున్నది. నాకు ఆ అవసరం వస్తే ఎలా అనేది నాకు భయం కలిగించింది. ఆహారం విషయంలో నాకు మొదటిసారి నేను ఎంత స్వార్ధపరురాలినో.. బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తానో తెలిసింది.

కుటంబ పట్ల బాధ్యతగా ఉండాలని
గత వారం రోజుల్లో ఇంట్లోకి ఏమి అవసరం అవుతాయనే విషయాన్ని తెలుసుకొన్నాను. నా కుటుంబ సభ్యుల కోసం బాధ్యతగా ఉండాలని నిర్ణయించుకొన్నాను. ఇంట్లో ఉండే ప్రతీ ఒక్కరి గురించి పట్టించుకోవాలనే ధ్యాస కలిగింది. వారి ఆరోగ్యం దెబ్బ తింటే.. నా ఆరోగ్యంపై కూడా ప్రభావం పడుతుందనే విషయాన్ని తెలుసుకొన్నాను. కాబట్టి నా తండ్రి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలనే నిర్ణయాన్ని తీసుకొన్నాను అని జాన్వీ తెలిపింది.

అమ్మ ఇంకా డ్రెస్పింగ్ రూమ్‌లో
ఒక రోజులో ఎన్ని గంటలు ఉంటాయో అనే విషయాన్ని ఒంటరితనంలో తెలుసుకొన్నాను. ఇంట్లో ఉంటే నా తల్లి కూడా ఇంకా ఉందని, ఆమె తన డ్రెస్సింగ్ రూమ్‌లో ఉందనే ఫీలింగ్ ఇంకా ఉంది. వాస్తవం జీవితం కంటే ఊహా జీవితంలో నేను గొప్ప చిత్రకారిణి, చాలా అందమైన కళాకారిణి అనే ఫీలింగ్ కలిగింది అని జాన్వీ కపూర్ భావోద్వేగానికి గురయ్యారు.


Click it and Unblock the Notifications











