Janvi Kapoor: కందిపోయిన అందాల భామ.. జాన్వీ పాప కష్టాలు మామూలుగా లేదుగా..
Janhvi Kapoor: అలనాటి అందాల తార శ్రీదేవి నట వారసురాలిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అమ్మడు జాన్వీ కపూర్. హిందీలో పలు సినిమాల్లో నటించి, మెప్పించింది. ఈ క్రమంలోనే గతేడాది ఎన్టీఆర్ 'దేవర' సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ఎన్టీఆర్‌కు జోడీగా దేవర తో టాలీవుడ్‌కి పరిచయమైన జాన్వీ కపూర్ ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలుకరించబోతుంది. అయితే.. తాజాగా జాన్వీ కపూర్ సంబంధించిన ఓ ఫోటో నెట్టింట్లో తెగ వైరలవుతున్నాయి. ఇంతకీ ఏమైందంటే ?
అతిలోక సుందరి శ్రీదేవి కూతురు, బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. స్టార్ కిడ్ గా బాలీవుడ్ లో అడుగుపెట్టింది. అలా 'దఢక్' సినిమాతో హీరోయిన్ గా బాలీవుడ్ లోకి ఏంట్రీ ఇచ్చింది. ఈ బ్యూటీ తొలి సినిమాతోనే సక్సెస్ అందుకుని స్టార్ హీరోయిన్ గా మారింది. ఆ తర్వాత పలు కమర్షియల్, ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీస్ చేసింది. ఇక హిందీలో సినిమాలే కాకుండా వెబ్ సిరీస్ కూడా చేసింది.

గతేడాది గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీలో 'తంగం' అనే పాత్రలో పల్లెటూరి తెలుగు అమ్మాయిలా నటించి, మెప్పించింది. ఇక 'చుట్టమల్లె' పాటలో మాత్రం జాన్వీ డాన్స్ అదుర్స్. ప్రేక్షకులందరీకి గుర్తుండిపోయేలా అందాలు ఆరబోసింది జాన్వీ. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ - బుచ్చిబాబు కాంబోలో వస్తున్న సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. మెగాస్టార్ కొడుకు, అతిలోక సుందరి కూతురు కాంబోలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ కూడా హిట్ టాక్ సొంతం చేసుకుంటే.. జాన్వీ పాప టాలీవుడ్ ను ఏలేస్తుందడంలో ఎలాంటి సందేహం లేదు.
జాన్వీ కపూర్ సినిమాల్లోనే కాదు.. సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టీవ్ గా ఉంటుంది. ఎల్లప్పుడూ తన హాట్ ఫోటోలను, వీడియోలను షేర్ చేస్తుంటుంది. తనకి సంబందించిన ప్రతి అప్డేట్ ను తన అభిమానులతో పంచుకుంటుంది. ఇందులో భాగంగానే తాజాగా జాన్వీ కపూర్ తన సోషల్ మీడియాలో తన సినిమా షూటింగ్ కు సంబంధించిన ఓ ఫోటోని షేర్ చేసింది. ఆ ఫోటో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. ఆ ఫోటోలో జాన్వీ కపూర్ బ్యాక్ సైడ్ వీపు భాగం ఎర్రగా కమిలిపోయి కనిపిస్తుంది. పైగా బర్న్ట్అని క్యాప్షన్ పెట్టింది. ఈ ఫోటో క్షణాల్లో వైరల్ గా మారింది.

ఆ ఫోటోను చూసిన ఆమె అభిమానులు తెగ టెన్షన్ పడుతున్నారు. అసలేం ఏమైందని ఆరా తీసున్నారు. షూటింగ్లో పాల్గొంటున్నారా? లేకపోతే ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చిందంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. అయితే.. జాన్వీ కపూర్ ఎండలో ఎక్కువ సమయం గడపడం వల్లనే ఇలా ఎర్రగా బొబ్బలొచ్చాయంట. వీపు భాగం ఎర్రగా కందిపోయిందంట. కొచ్చిలో షూటింగ్ టైం లోనే ఎండకు ఇలా జరిగిందని కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు.
ఇక జాన్వీ మాత్రమే కాదు.. హీరో సిద్ధార్థ్ కూడా షూటింగ్ పాల్గొని ఇలాంటి ఫోటోలనే షేర్ చేసిన విషయం తెలిసిందే. తాజా వీరిద్దరూ కలిసి
"పరం సుందరి" ఒక అనే రొమాన్స్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా జూలై 25న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రాన్ని నిర్మాణ సంస్థ మాడాక్ ఫిల్మ్స్ నిర్మిస్తుండగా.. "దాస్వి" ఫేమ్ తుషార్ జలోటా దర్శకత్వం తెరకెక్కుతుంది.


Click it and Unblock the Notifications











