దేవర మూవీలో జాన్వీకి తీరని అన్యాయం.. దేవర 2 పరిస్థితి ఏంటంటే?
ప్రస్తుతం మన సౌత్ ఇండియా సినిమా దగ్గర షేక్ చేస్తున్న నార్త్ ఇండియా బ్యూటీ ఎవరైనా ఉన్నారు అంటే అది అలనాటి నటి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ అని చెప్పాలి. అందాల ఆరబోతలో జాన్వీ కపూర్ కి బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది కానీ సినిమాల పరంగా జాన్వికి అనుకున్న రేంజ్ హిట్ అయితే లేదు. కాగా ఇలానే తెలుగులో కూడా అదృష్టం పరీక్షించుకోడానికి ఈమె మ్యాన్ ఆఫ్ మాసెస్ తో జత కట్టింది.
కాగా ఇలా జాన్వీ తన తెలుగు సినిమానే ఒక భారీ డెబ్యూట్ గా మార్చుకుంది. కాగా ఇక్కడ నుంచి జాన్వీ పేరు తెలుగులో సహా సౌత్ ఇండియా మార్కెట్ లో దద్దరిల్లింది. రిలీజ్ ముందే పాటలతో మత్తెక్కించిన జాన్వీ సినిమా రిలీస్ తర్వాత మరింత హీట్ పుట్టించింది. దీనితో ప్రెజెంట్ యువతలో జాన్వీ కపూర్ అందాల ఆరబోత కోసమే మాట్లాడుకుంటున్నారు.

అయితే ఈ సినిమాలో జాన్వీ కపూర్ రోల్ నామమాత్రంగానే కనిపించిన సంగతి తెలిసిందే. సినిమా ఫస్టాఫ్ మొత్తంలో ఈమె ఎక్కడా కూడా కనిపించదు. కేవలం తన చిన్ననాటి రోల్ మాత్రమే కనిపిస్తుంది. కంప్లీట్ గా జాన్వీ ఎంటర్ అయ్యేది సినిమా సెకండాఫ్ లో మాత్రమే.. అయితే జాన్వీ కపూర్ కి ముందు చెప్పినట్టే పెద్దగా సినిమాలో స్కోప్ లేకుండా పోయింది.
కేవలం పాటలు సినిమాలో ఉన్న సీన్స్ కూడా కొన్నే ఉండడంతో ఈమెకి అన్యాయం జరిగిందనే టాక్ కూడా లేకపోలేదు. కాగా ఇది సర్వ సాధారణమే కానీ జాన్వీ కపూర్ రోల్ పై తాజాగా దర్శకుడు కొరటాల శివ గ్యారెంటీ ఇస్తున్నారు. రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జాన్వీ నుంచి పార్ట్ 1 ల్లో ఇది కేవలం ట్రైలర్ మాత్రమే అని పార్ట్ 2 లో జాన్వీ రోల్ అదిరిపోతోంది అని ప్రామిస్ చేస్తున్నారు కొరటాల.

పార్ట్ 2 లో జాన్వీ రోల్ కి చాలా స్కోప్ ఉంటుందట. అటు గ్లామర్ తో పాటుగా జాన్వీ పెర్ఫామెన్స్ అంతా కూడా పార్ట్ 2 లో కనిపిస్తుంది అని తెలుస్తుంది. కాగా పార్ట్ 2 ని ఎలాగో 'వర' గా ఉంటుంది అని కన్ఫర్మ్ చేసిన సంగతి తెలిసిందే. దీనితో ఇలా ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో ఎన్టీఆర్ తో కలిపి జాన్వీ రోల్ కూడా ఫుల్ లెంగ్త్ లో కనిపిస్తుంది అని చెప్పాలి. సో మొత్తానికి పార్ట్ 2 లో అయితే జాన్వీ కపూర్ రోల్ మామూలుగా ఉండనుందట..
ఇక పార్ట్ 1 తో జాన్వీ కపూర్ తో పాటుగా బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కూడా తెలుగులో ఈ సినిమాతోనే ఎంట్రీ ఇచ్చాడు. కాగా ఈ సినిమాకి అనిరుద్ సంగీతం అందించగా ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్ వారు సంయుక్తంగా భారీ బడ్జెట్ 300 కోట్లతో నిర్మాణం వహించారు. అలాగే పార్ట్ 2 ని 2028 నాటికి ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











