నా బాత్రూమ్ కి గడియ ఉండదు.. చెన్నైలో జాన్వీ కపూర్ హోమ్ టూర్, ఇంద్రభవనంలా శ్రీదేవి ఇల్లు
అతిలోక సుందరి, దివంగత శ్రీదేవి నట వారసురాలిగా ఆమె ముద్దుల తనయ జాన్వీ కపూర్ సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. శ్రీదేవి కూతురిలానే కాకుండా తనదైన శైలీలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తుంది ఈ ముద్దుగుమ్మ. మరాఠీ చిత్రం సైరాట్ మూవీకి హిందీలో రీమేక్ గా వచ్చిన దఢక్ చిత్రంతో తెరగేంట్రం చేసింది ముద్దుగుమ్మ. 2018లో వచ్చిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఇటీవల మిలి సినిమాతోప్రేక్షకుల ముందుకు వచ్చిన జాన్వీ కపూర్ చెన్నైలోని శ్రీదేవి ఇల్లు, దాని విశేషాలు చెప్పుకొచ్చింది.

ప్రత్యేక గుర్తింపు..
దివగంత నటి శ్రీదేవి ముద్దుల కూతురిగా దఢక్ మూవీతో హిందీ చిత్రపరిశ్రమలోకి అడుగు పెట్టిన జాన్వీ కపూర్ తనదైన శైలీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే దఢక్ సినిమా తర్వాత గుంజన్ సక్సెనా, ఘోస్ట్ స్టోరీస్, అంగ్రేజీ మీడియం, రూహి చిత్రాలతో తనలోని నటిని బయటపెట్టింది జాన్వీ కపూర్. ఆ తర్వాత సౌత్ లేడి సూపర్ స్టార్ నయనతార హిట్ మూవీ కోలమావు కోకిల రీమేక్ సినిమాలో నటించింది.

హాట్ హాట్ ఫొటోషూట్ లతో..
తమిళంలో సూపర్ హిట్ అయిన కోలమావు కోకిల సినిమాను నార్త్ ప్రేక్షకుల అభిరుచికి తగినట్లుగా గుడ్ లక్ జెర్రీ అనే టైటిల్ తో రీమేక్ చేశారు. ఈ చిత్రం డైరెక్ట్ ఓటీటీలో విడుదలకాగా, దీంతో జాన్వీ కపూర్ డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చినట్లు అయింది. ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోషూట్ లతో హడావిడి చేసే జాన్వీ కపూర్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది.

చెన్నైలో హోమ్ టూర్..
జాన్వీ కపూర్ చేతిలో ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉన్న మిలి, మిస్టర్ అండ్ మిసెస్ మహి, బావల్, రూహ్ అఫ్జా, దోస్తానా 2, తక్థ్ తదితర బిగ్ బడ్జెట్ చిత్రాలు ఉన్నాయి. ఇక ఇటీవల మిలి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన జాన్వీ కపూర్ బాగానే అలరించింది. ఇదిలా ఉంటే తాజాగా శ్రీదేవి, బోనీ కపూర్ చెన్నైలో గడిపిన ఇల్లు హోమ్ టూర్ వ్లాగ్ చేసింది జాన్వీ కపూర్. ఇంద్రభవనంలాంటి శ్రీదేవి ఇల్లు గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది జాన్వీ.

శ్రీదేవి వేసిన పెయింటింగ్స్..
హాయ్ అంటూ తమ ఇంట్లోకి ఆహ్వానించిన జాన్వీ కపూర్ తమ ఇల్లు ప్రధాన ద్వారం వాస్తు ప్రకారం ఉందని చెప్పింది. తర్వాత బోనీ కపూర్ ఆఫీస్ రూమ్ చూపించింది. బోనీ కపూర్ చుట్టూ 10 వేల ఫొటోలు ఉన్నాయని పేర్కొంది. ఈ ఇంట్లో శ్రీదేవి కొన్నేళ్లుగా సేకరించిన పెయింటింగ్స్, ఆర్ట్ పీస్ లను చూపించింది. అలాగే శ్రీదేవి వేసిన పెయింటింగ్స్ కూడా ఉన్నాయి. జాన్వీ కపూర్ తన తల్లిదండ్రుల పెళ్లి ఫొటోలను చూపించింది.

నా గది బాత్ రూమ్ కు గడియ ఉండదు..
బోనీ కపూర్, శ్రీదేవి రహస్యంగా పెళ్లిచేసుకున్నట్లు తెలిపింది. ఇది అమ్మానాన్నల పెళ్లి ఫొటో. వీరిద్దరు సీక్రెట్ పెళ్లి చేసుకున్నారు. అందుకే వారి ఫొటోల్లో వారు టెన్షన్ లో ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ, ఎందుకు అలా ఉన్నారో నాకు నిజంగా నాకు తెలియదు అని చెప్పింది. అనంతరం తన బెడ్ రూమ్ చూపించింది జాన్వీ కపూర్. నా గది బాత్ రూమ్ కు గడియ ఉండదు. లాక్ పెట్టేందుకు అమ్మ అంగీకరించలేదు. బాత్ రూమ్ లోకి వెళ్లి అబ్బాయిలతో ఫోన్లో మాట్లాడుతానేమోనన్న భయం అమ్మలో ఉండేది.
ఇల్లు మొత్తం రెన్నోవేషన్..
అందుకే నా బాత్రూమ్ డోర్ కు లోపలి వైపు గడియ పెట్టేందుకు అనుమతించలేదు అని చెప్పుకొచ్చింది జాన్వీ. లీకేజీల కారణంగా ఇల్లు మొత్తం రెన్నోవేషన్ చేసినట్లు జాన్వీ తెలిపింది. ఇప్పుడు ఈ గదులన్నీ కొత్తగా ఉన్నా నా బాత్రూమ్ కి గడియ మాత్రం ఉండదు అని జాన్వీ కపూర్ వివరించింది. అలాగే ఈ ఇల్లుతో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయని జాన్వీ కపూర్ ఆసక్తిగా చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











