మళ్లీ రెచ్చిపోయిన జాన్వీ కపూర్.. బెడ్ పై పొట్టి దుస్తుల్లో అరాచకం
తెలుగులో ఒక్క సినిమా కూడా చేయనప్పటికీ జాన్వీ కపూర్ కి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆమె తల్లి అందాల నటి శ్రీదేవి తెలుగు సినిమా ద్వారానే రంగప్రవేశం చేసి ఆ తర్వాత బాలీవుడ్ ను కొంత కాలం పాటు ఏలింది.. ఆమె అకాల మరణంతో ఇప్పుడు జాన్వీ కపూర్ తన తండ్రి బోనీ కపూర్ సహాయంతో సినిమాల్లో నిలదొక్కుకునే ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే ఎప్పటికప్పుడు హాట్ ఫోటో షూట్స్ వదులుతూ సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతుంది. తాజాగా ఆమె వదిలిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఆ సంగతి ఏంటో చూద్దామా..

రెండేళ్ల పాటు ఖాళీగా
జాన్వీ కపూర్ 2018వ సంవత్సరంలో శశాంక్ ఖైతాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ధఢక్ అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో హీరోగా ఇషాన్ ఖట్టర్ నటించాడు. మరాఠీలో విడుదలై సూపర్ హిట్ గా నిలిచిన సైరాత్ అనే సినిమాకు ఇది బాలీవుడ్ రీమేక్ గా తెరకెక్కింది. ఈ సినిమాకు మంచి స్పందన అయితే లభించ లేదు కానీ కలెక్షన్లు మాత్రం అద్భుతంగా వచ్చాయి. అయితే మొదటి సినిమా పూర్తయిన తర్వాత మరో రెండేళ్ల పాటు ఆమె మరో సినిమా ఏది ఒప్పుకోలేదు.

ఘోస్ట్ స్టోరీస్ లో
అయితే ఆమె ఘోస్ట్ స్టోరీస్ అని ఒక వెబ్ సిరీస్ లో నర్సు పాత్రలో నటించి ఆకట్టుకుంది. జోయా అక్తర్ తెరకెక్కించిన ఆ సిరీస్ ఆమెకు మంచి పేరు తెచ్చి పెట్టింది. ఇక ఆ తర్వాత గుంజన్ సక్సేనా అనే ఒక సినిమాలో నటించి గుంజన్ సక్సేనా పాత్రలో ప్రేక్షకులందరినీ ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత రూబీ అనే సినిమాలో కూడా ఆమె నటించింది కానీ ఈ సినిమా కూడా ఆమెకు పెద్దగా పేరు తీసుకు రాలేదు.

సోషల్ మీడియాలో
ఇక ఆ తర్వాత ఆమె గుడ్ లక్ జెర్రీ, మిల్లీ అనే సినిమల షూటింగ్ పూర్తి చేయగా ఆ సినిమాలు ఈ ఏడాది విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే ఆమె చేస్తున్న మరో సినిమా భవ వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే అడపాదడపా తెలుగు సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్న జాన్వి ఎప్పటికప్పుడు అభిమానులను అలరించడానికి తన హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.

పీహెచ్డీ చేసిందా అన్నట్టు
ఆమె ఫోటో షూట్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే బాగా అప్డేటెడ్ గా ఉండే ఆమె డిజైనర్ దుస్తులు ధరించి అందులో తళుక్కున మెరుస్తూ చూపరులను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇక గ్లామర్ ఎలివేషన్స్ లో పీహెచ్డీ చేసిందా అన్నట్టు ఆమె అందాలు ఆరబోస్తోంది.

మంత్రముగ్ధుల్ని
తాజాగా ఆమె బెడ్ పై లోదుస్తుల్లో కెమెరాకి టెంప్టింగ్ ఫోజులు ఇవ్వగా అవి వెంటనే వైరల్ గా మారాయి. బ్లాక్ కలర్ టాప్ లో డార్క్ లైట్ లో ఒకపక్క ఎద అందాలు ఆరబోస్తూనే మరోపక్క మత్తెక్కించే చూపులతో మంత్రముగ్ధుల్ని చేస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.


Click it and Unblock the Notifications











