కరణ్ జోహర్ చేసిన పనికి ఇంకా షాక్‌లోనే.. జాహ్నవి కపూర్

By Rajababu

ధడక్ చిత్రంతో దివంగత అందాల నటి శ్రీదేవి వారసురాలిగా అడుగుపెట్టిన జాహ్నవి కపూర్ మరో అద్బుతమైన అవకాశాన్ని చేజిక్కించుకొన్నది. ప్రముఖ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న తఖ్త్ చిత్రంలో కీలక పాత్రకు ఎంపికైన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ అగ్రతారలు రణ్‌వీర్ సింగ్, కరీనా కపూర్ ఖాన్, అలియాభట్, వికీ కౌశల్, భూమీ పడ్నేకర్, అనిల్ కపూర్‌ తదితరులు నటిస్తున్నారు. ధడక్ ఘన విజయం తర్వాత సెన్సేషనల్ ప్రాజెక్టులో ఆఫర్ కొట్టేయడంపై జాహ్నవి స్పందించారు.

తఖ్త్ చిత్రంలో పాత్రను కరణ్ ఆఫర్ చేసినప్పుడు షాక్ తిన్నంత పని అయింది. ఇంకా ఆ షాక్‌లో నుంచి బయటకు రాలేదు. నా కెరీర్‌లో ఇది భారీ అవకాశం. కెరీర్ ఆరంభంలోనే ఇంత మంచి అవకాశం ఇచ్చిన కరణ్‌కు రుణపడి ఉంటాను అని జాహ్నవి వెల్లడించింది.

Janhvi Kapoor I am still in shock. Takht big deal for me

తఖ్త్ ఆఫర్ గురించి ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాను. చాలా ఉత్తేజకరంగా ఉంది. సంతోషంలో మునిగి తేలుతున్నాను అని జాహ్నవి మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

ఆగస్టు 9 తేదీన తఖ్త్ చిత్రాన్ని ప్రకటించి బాలీవుడ్‌కు కరణ్ ఓ షాకిచ్చారు. మొగల్ సామ్రాజ్యానికి సంబంధించిన కథను కరణ్ జోహర్ తెరకెక్కిస్తున్నారు. తఖ్త్ సినిమాలో రణ్‌వీర్, కరీనా అక్కా తమ్ముళ్లుగా నటిస్తున్నారు. మొగల్ సామ్రాజ్యానికి సంబంధించిన తొలి పౌరురాలు జాహనారా బేగంగా కరీనా కనిపించనున్నారట. జహనారా బేగం షాజాహాన్, ముంతాజ్ కూతురు జాహనారా బేగం అనే విషయం తెలిసిందే.

తఖ్త్ చిత్రంలో కుటుంబ కలహాలు, అధికార పీఠం కోసం వెన్నుపోట్లు, ప్రేమ, విజయం లాంటి విభిన్నమైన, భావోద్వేగ అంశాలతో రూపొందనున్నది. ప్రేమ కోసం యుద్ధం చేయడమే తఖ్త్ చిత్ర కథ అని కరణ్ జోహర్ చెప్పారు. ఈ చిత్రం 2020లో ప్రేక్షకుల ముందుకు రానున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X