ముద్దు అడిగిన అభిమాని.. మాస్క్ పెట్టుకొని తెలివిగా ప్రవర్తించిన జాన్వీ కపూర్
అతిలోకసుందరి శ్రీదేవి గారాల కూతురు జాన్వీ కపూర్ చాలా రోజుల తరువాత సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమె ఒక నెటిజన్ కు ఇచ్చిన సమాధానంపై ఫాలోవర్స్ షాక్ అవుతూ కామెంట్ చేస్తున్నారు. అలాగే తన ఇష్టాలను అలవాట్లను కూడా షేర్ చేసుకున్న ఈ బ్యూటీ ముద్దు అడిగిన అభిమానికి మాత్రం అదిరిపోయే సమాధానం ఇచ్చింది. అందుకు సంబంధించిన ఫొటో కూడా వైరల్ గా మారింది.

విభిన్నమైన కథలపై ఫోకస్
శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఇంకా అనుకున్నంత రేంజ్ లో క్రేజ్ అందుకోలేదు. మొదటి సినిమా ధడక్ బాక్సాఫీస్ వద్ద పెద్దగా లాభాలను అంధించలేదు. అయినప్పటి అమ్మడు తన టాలెంట్ తోనే విభిన్నమైన కథలను ఎంచుకొంటోంది. ఇక కమర్షియల్ గా కూడా ఈ బ్యూటీ బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టాలని చూస్తోంది.

ఆ సినిమాతో మంచి క్రేజ్
గుంజన్ సక్సెనా బయోపిక్ కార్గిల్ గర్ల్ గత ఏడాది నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన విషయం తెలిసిందే. థియేటర్స్ లో విడుదల కావాల్సిన ఆ సినిమా కరోనా లాక్ డౌన్ కారణంగా ఓటీటీలోనే విడుదల అయ్యింది. నటిగా అయితే ఆమెకు మంచి మార్కులే పడ్డాయి. కెరీర్ మొదట్లోనే ఇలాంటి కథలను ఎంచుకోవడం గ్రేట్ అంటూ అగ్ర నటులు ప్రశంసలు కురిపించారు.

ముద్దు అడిగిన అభిమాని
ఇక అప్పుడప్పుడు విమర్శలను ఎదుర్కొనే జాన్వీ తనదైన శైలిలో కౌంటర్లు కూడా ఇస్తోంది. సోషల్ మీడియా ద్వారా అభిమానులకు దగ్గరాగా ఉండే ఈ బ్యూటీ ఇటీవల ఒక అభిమాని ముద్దు అడగడంతో ఎవరు ఊహించని విధంగా సమాధానం ఇచ్చింది. అందుకు సంబంధించిన ఫొటో కూడా ఇప్పుడు వైరల్ అవుతోంది.

మాస్క్ పెట్టుకొని..
అభిమాని ముద్దు అడగడంతో సాధారణంగా నో అంటే సరిపోతుంది. కానీ ఈ బ్యూటీ మాస్క్ పెట్టి మరి నో అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీంతో నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ఏదేమైనా ఈ బ్యూటీకి ఈ మధ్య సోషల్ మీడియాలో ఫాలోవర్స్ అయితే గట్టిగానే పెరుగుతున్నారు. ఎలాంటి ఫొటో పోస్ట్ చేసినా కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

సినిమాలతో బిజీగా
ఇక ఇటీవల రూహి అనే హారర్ కామెడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన జాన్వీ అందులో దెయ్యంగా కనిపించి షాక్ ఇచ్చింది. ప్రస్తుతం చేతిలో మంచి సినిమాలే ఉన్నాయి. దోస్తానా 2 సినిమాతో పాటు గుడ్ లక్ జెర్రీ అనే సినిమా చేస్తోంది. కమర్షియల్ సినిమాలాతో పాటు ప్రయోగాత్మకమైన కథలను ఎంచుకుంటోంది. అలాగే రానున్న రోజుల్లో కరణ్ జోహార్ ప్రొడక్షన్ లోనే మరో రెండు సినిమాలు చేయనున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











