Devara: ఎన్టీఆర్ తో ఆ విషయంలో జాన్వీ కపూర్ చిరాకు.. దేవర షూటింగ్ లో ఏం జరిగిందంటే?
ఇప్పుడు పాన్ ఇండియా సినిమా దగ్గర మంచి మోస్ట్ అవైటెడ్ గా ఉన్న భారీ చిత్రాల్లో ఈ సెప్టెంబర్ లోనే రిలీజ్ కి రాబోతున్న చిత్రం "దేవర" ప్రధానంగా కనిపిస్తుంది. కాగా ఈ భారీ చిత్రం స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తన గత చిత్రం ఆర్ ఆర్ ఆర్ లాంటి సెన్సేషనల్ సక్సెస్ తో తారక్ పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ లో కూడా మంచి ఆదరణ అందుకున్నాడు.
దీనితో అలాంటి సినిమా తర్వాత అందులోని ఎన్టీఆర్ నుంచి దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత సోలోగా వస్తున్న భారీ చిత్రమే ఈ "దేవర". కాగా ఆ RRR దర్శకుడు రాజమౌళి సెంటిమెంట్ ని బ్రేక్ చేస్తుంది అంటూ వచ్చిన "ఆచార్య" పెద్ద డిజాస్టర్ కాగా మళ్ళీ అదే సినిమాని తెరకెక్కించిన కొరటాల శివతో చేసిన సినిమానే ఇది. దీనితో ఈ సినిమాపై అంచనాలు ఎన్నైతే ఉన్నాయో అనుమానాలు కూడా అంతే ఉన్నాయి.

కాగా ఈ సినిమాతో బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది. పైగా తెలుగులో ఈమెకి మొదటి సినిమా కావడంతో తన ఎంట్రీపై కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అప్పట్లో తాతతో సీనియర్ శ్రీదేవి, ఇప్పుడు మనవడు జూనియర్ ఎన్టీఆర్ తో జూనియర్ శ్రీదేవి అంటూ జాన్వీపై మంచి బజ్ అయితే ఏర్పడింది.
ఇక ఈ సినిమాలో జాన్వీ అందాల ఆరబోత అలాగే తన గ్లామర్ షో ఇంకా తన డాన్స్ లతో అసలు ఎన్టీఆర్ నే డామినేట్ చేసినంత పని చేసింది. ఒక చుట్టమల్లే సాంగ్ లో కానీ తర్వాత వచ్చిన మాస్ నెంబర్ దావుది సాంగ్ లో అయితే కానీ జాన్వీ కపూర్ ఒక్కసారిగా హాట్ టాపిక్ అయ్యింది. అయితే జాన్వీ దేవర సినిమాలో మాత్రం కొన్ని సీన్స్ చిరాగ్గా ఫీల్ అయ్యి ఇబ్బంది పడిందట.

ఆ సీన్స్ ఏవో కూడా కాదు ఎన్టీఆర్ తో పాటలకి డాన్స్ చెయ్యాల్సి వచ్చినపుడే చాలా ఇరిటేటింగ్ గా ఫీల్ అయ్యేదట. డాన్స్ షూట్ ఉందంటేనే చిరాకు వచ్చేది అని సినిమాలో ఇవి కాకుండా ఎన్టీఆర్ తో నటించే సీన్స్ ఎంతో ఎంజాయ్ చేస్తూ చేశాను అని జాన్వీ రీసెంట్ ఇంటర్వ్యూలో తెలిపింది. దీనితో ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి.
కాగా ఈ సినిమాతో జాన్వీ కపూర్ తో పాటుగా బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీఖాన్ కూడా తెలుగు ఎంట్రీ ఇవ్వబోతుండగా ఈ సినిమా కోసం అటు బాలీవుడ్ ఆడియన్స్ కూడా బాగానే ఎదురు చూస్తున్నారు. ఇంకా ఈ భారీ చిత్రంలో శ్రీకాంత్, అజయ్, గెటప్ శ్రీను తదితరులు కూడా నటించగా అనిరుద్ సెన్సేషనల్ మ్యూజిక్ ని ఈ చిత్రానికి అందించాడు. అలాగే కొత్త నిర్మాణ సంస్థ యువసుధ ఆర్ట్స్ వారు ఈ చిత్రంతో టాలీవుడ్ కి పరిచయం అవుతుండగా వీరితో ఎన్టీఆర్ అన్న నందమూరి తన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై సంయుక్తంగా 300 కోట్ల బడ్జెట్ తో నిర్మాణం వహించినట్టు టాక్ ఉంది.


Click it and Unblock the Notifications











