మహేశ్ బాబుపై జాన్వీ కపూర్ అలాంటి ఫీలింగ్ .. ఆ విషయంలో బ్యూటీ అసూయ
బాలీవుడ్ యంగ్ హీరోయిన్, అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ తెలుగు ప్రేక్షకులకు కూడా బాగానే పరిచయం అయింది. టాలీవుడ్ లోకి గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ సరసన దేవర చిత్రంలో నటించి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగు ప్రేక్షకులు కూడా ఈ ముద్దుగుమ్మకు ఘనంగానే స్వాగతం పలికారు. తొలి చిత్రంతోనే జాన్వీకపూర్ సౌత్ఆడియన్స్ను తన వైపు తిప్పుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో కంటే టాలీవుడ్ లోనే భారీ చిత్రాల్లో అవకాశాలు అందుకుంటుంది. అటు నార్త్ లోను పలు చిత్రాల్లో నటించి మెప్పించింది.
శ్రీదేవి కూతురిగా జాన్వీ కపూర్ కు తెలుగు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ దక్కింది. ఇక ప్రస్తుతం తల్లికి తగ్గ తనయురాలు అనిపించుకునేందుకు ప్రయత్నిస్తుంది. తనకు వచ్చిన అవకాశాలను సరిగ్గా వినియోగించుకుంటూ నటిగా ప్రశంసలు పొందుతుంది. మరింత గా ఎదిగేందుకు తన వంతు ప్రయత్నం చేస్తుంది. అయితే జాన్వీ కపూర్ దేవర చిత్ర సమయంలో పలు ఇంటర్వ్యూలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కూడా ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తన వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ సూపర్ స్టార్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది.

టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా వెలుగొందుతున్న మహేష్ బాబు గురించి జాన్వీ కపూర్ కు ప్రశ్న ఎదురయింది. మహేష్ బాబు పై మీ అభిప్రాయం ఏంటి అని అడగ్గా ఆసక్తికరంగా బదులిచ్చింది. మహేష్ బాబు పేరు రాగానే తనకు మొట్టమొదటిగా యంగ్ లుక్ గుర్తుకు వస్తుందని చెప్పింది. ఈ వయసులోనూ ఆయన యంగ్ గా కనిపిస్తుండడం ఆశ్చర్యంగా ఉంటుందని తెలిపింది. ఇప్పటికీ మహేష్ బాబు తనకంటే యంగ్ గా కనిపిస్తుండడం కాస్త అసూయను పుట్టించిందని ఫన్నీగా బదులిచ్చింది.
ఇక జాన్వీ కపూర్ మహేష్ బాబుకు చిన్నప్పటినుంచి పెద్ద అభిమాని అని తన తల్లి శ్రీదేవి గత ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. మహేష్ బాబు అంటే తన కూతురికి ఎంతో ఇష్టమని గతంలో చెప్పడం విశేషం. ఇక అదే విధంగా జాన్వీ కపూర్ కూడా మహేష్ బాబు ఫిట్నెస్, హ్యాండ్సమ్ లుక్ విషయం లో ఇన్స్పైర్ అవడం ఆసక్తికరంగా మారింది. మహేష్ బాబు హ్యాండ్సమ్ లుక్ పై విదేశాల్లోనూ సర్వే నిర్వహించారు. లేటెస్ట్ ఫోటోలపై మహేష్ బాబు ఏజ్ ను అడగగా కేవలం 25 సంవత్సరాలు మాత్రమే ఉంటారని విదేశీయులు చెప్పడం కూడా అప్పట్లో ఇంట్రెస్టింగ్ గా మారింది.
మహేష్ బాబు మోతాదుకు మించి అసలు తినరు. తినాల్సిన దానికన్నా ఒక ముద్ద తక్కువ గానే తింటానని గతంలో మహేష్ బాబునే చెప్పారు. ఫుడ్ ఒక్కటి కంట్రోల్లో పెడితే నిత్యం యవ్వనంగానే కనిపిస్తామని, ఇక ఆయన రాత్రి 7 లోపు డిన్నర్ చేసేస్తానని కూడా చెప్పారు. ఎక్కువగా మసాలాలు, స్పైసిస్ లేని ఫుడ్ తీసుకుంటారని వివరించారు. మహేష్ బాబుకు హైదరాబాద్ బిర్యానీ అంటే కూడా ఇష్టమని గతంలో చెప్పుకొచ్చారు. మహేశ్ బాబుకు ప్రస్తుతం 49 ఏళ్లు. మరికొద్ది నెలల్లో 50లో అడుగుపెట్టబోతున్నారు. ఇక మహేశ్ బాబు ప్రస్తుతం ఎస్ఎస్ రాజమౌళితో కలిసి ఎస్ఎస్ఎంబీ29 చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక జాన్వీ కపూర్ రామ్ చరణ్ సరసన పెద్ది చిత్రంలో నటిస్తూ బిజీగా ఉంది.


Click it and Unblock the Notifications











