క్రష్, మ్యారేజ్... విజయ్ దేవరకొండ మాయ నుంచి తేరుకోని జాహ్నవి!

Recommended Video

Jhanvi Kapoor Want To Marry Vijay Devarakonda? | విజయ్ దేవరకొండ తో పెళ్లి కి బాలీవుడ్ హీరోయిన్‌ సై?

విజయ్ దేవరకొండ... 'పెళ్లి చూపులు', 'అర్జున్ రెడ్డి', 'గీత గోవిందం' సినిమాలతో అమ్మాయిల ఫేవరెట్ అయిపోయాడు. చాలా మంది అతడి మాయలో పడిపోయారు. వీరిలో సాధారణ అమ్మాయిలు మాత్రమే కాదు... దివంగత నటి శ్రీదేవి కూతురు, బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాహ్నవి కపూర్ కూడా ఉన్నారు.

గతంలో కరణ్ జోహార్ హోస్ట్ చేసిన హిందీ టాక్ షో 'కాఫీ విత్ కరణ్' కార్యక్రమంలో జాహ్నవి కపూర్... 'ఏదైనా ఒక రోజు మేల్ యాక్టర్‌గా నిద్రలేవాల్సి వస్తే ఎవరిని ఎంచుకుంటారు'... అనే ప్రశ్నకు ఆమె విజయ్ దేవరకొండ పేరు చెప్పిన విషయం తెలిసిందే.

క్రష్, పెళ్లి... విజయ్ దేవరకొండ

క్రష్, పెళ్లి... విజయ్ దేవరకొండ

తాజాగా ఓ వెబ్ ఛానల్ ఇంటర్వ్యూలో మరోసారి జాహ్నవి కపూర్ నోట విజయ్ దేవరకొండ మాట వినిపించింది. ఏ హీరోను చూస్తే మీకు క్రష్ కలుగుతుంది, పెళ్లి చేకోవాలనిపిస్తుంది? అనే ప్రశ్నకు విజయ్ దేవరకొండ అని జాహ్నవి తెలిపారు.

అతడి పాట నన్ను మాయ చేస్తోంది

అతడి పాట నన్ను మాయ చేస్తోంది

‘గీత గోవిందం' చిత్రంలోని ఇంకేం ఇంకేం కావాలి సాంగ్ తనను మాయ చేసిందని, ఆ పాట చాలా సార్లు రిపీటెడ్‌గా విన్నాను అని జాహ్నవి చెప్పడం గమనార్హం. దీన్ని బట్టి ఆమె విజయ్ దేవరకొండ సినిమాలను ఫాలో అవుతున్నట్లు స్పష్టమవుతోంది.

అవకాశం వస్తే వదలదేమో...

అవకాశం వస్తే వదలదేమో...

విజయ్ దేవరకొండ మీద జాహ్నవి కపూర్ రోజు రోజుకు పెంచుకుంటున్న అభిమానం, ఇష్టం చూస్తుంటే.... ఒక వేళ అతడితో కలిసి సినిమా చేసే అవకాశం వస్తే అస్సలు వదులుకోదేమో? మరి ‘ధడక్' బ్యూటీకి ఆ ఛాన్స్ ఎప్పుడు వస్తుందో చూడాలి.

జాహ్నవి కపూర్

జాహ్నవి కపూర్


2018లో ‘ధడక్' అనే సినిమా ద్వారా హీరోయిన్‌గా పరిచయమైన జాహ్నవి కపూర్... ప్రస్తుతం ‘తక్త్', ‘రణ్ భూమి' అనే చిత్రాల్లో నటిస్తోంది. తొలి చిత్రంతోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న జాహ్నవి ... బాలీవుడ్లో టాప్ హీరోయిన్‌గా ఎదగడం ఖాయం అంటున్నారు సినీ విశ్లేషకులు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X