Don't Miss!
- News
భయం నా బయోడేటాలోనే లేదు: నారా లోకేష్
- Finance
Pharma Mutual Funds: ఫార్మా మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడికి ఇదే సరైన సమయమా..!
- Sports
INDvsNZ : ఇదేం బౌలింగ్రా.. నువ్వే వాళ్లను గెలిపిస్తున్నావ్.. టీమిండియా పేసర్‌పై ట్రోల్స్!
- Travel
పచ్చని తలకోన.. చల్లని హార్స్లీ హిల్స్ చూసొద్దాం!
- Technology
TTD ద్వారా కొత్త మొబైల్ యాప్! ఉపయోగాలు ఏమిటో చూడండి!
- Automobiles
కొత్త సంవత్సరంలో కూడా తగ్గని ధరల మోత: XUV700 ధరలు మళ్ళీ పెరిగాయ్..
- Lifestyle
Chanakya Niti: ఈ పనులతో పేదలు కూడా ధనవంతులు అవుతారు, అవేంటంటే..
Janhvi Kapoor: మరోసారి జాన్వీ కపూర్ హాట్ షో.. స్టన్ అయ్యే పోజులతో స్టిల్స్
పేరుకు అతిలోక సుందరి, దివంగత శ్రీదేవి ముద్దుల కూతురు అయినప్పటికీ తనదైన మార్క్ వేసుకుంది బ్యూటిఫుల్ జాన్వీ కపూర్. శ్రీదేవి పెద్ద కూతురుగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ తనదైన నటనతో ముందుకు వెళ్తోంది. ఇక ఈ భామ సోషల్ మీడియాలో చేసే అందాల విందు మాములుగా ఉండదు. కుర్రకారు గుండెళ్లో గుబులు పుట్టించేలా ఉంటాయి జాన్వీ కపూర్ హాట్ ఫొటోలు. బికినీ, చీరకట్టు, డిఫరెంట్ ఇలా ఏ డ్రెస్ వేసిన తన అందాలను ప్రదర్శించకుండా ఉండదు ఈ ముద్దుగుమ్మ. తాజాగా విభిన్నమైన డ్రెస్ లో తన నాభి అందాలను ఘాటుగా చూపించి ఆకట్టుకుంది ఈ హాట్ భామ.

రూ. 100 కోట్ల్ క్లబ్ లో..
అతిలోక సుందరి, దివంగత శ్రీదేవి అందానికి వారసురాలిగా బాలీవుడ్లో తెరంగేట్రం చేసింది బ్యూటిఫుల్ హీరోయిన్ జాన్వీ కపూర్. మరాఠీ హిట్ మూవీ సైరాట్‌కు రీమేక్‌గా వచ్చిన దఢక్ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైంది జాన్వీ కపూర్. ఈ సినిమాలో తనదైన నటనతో ఆకట్టుకుంది. ఇందులో ఆమె అద్భుతమైన నటనతో యమ హైలైట్ అయింది. దీనికితోడు ఇది వంద కోట్ల క్లబ్‌లో కూడా చేరడంతో ఆమె ఫుల్ ఫేమస్ అయింది. 'దఢక్' మూవీతో జాన్వీ కపూర్‌కు నేషనల్ రేంజ్‌లో గుర్తింపు వచ్చింది.

ప్రయోగాత్మక చిత్రం..
దఢక్ మూవీతో వచ్చిన పాపులారిటీని కంటిన్యూ చేసుకునేలా ఈ అమ్మడు తనకంటూ ప్రత్యేకమైన పంథాను ఏర్పరచుకుని ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగానే 'గుంజాన్ సక్సేనా: ద కార్గిల్ గర్ల్' అనే బయోపిక్ మూవీలో నటించి మెప్పించింది. ఈ సినిమాతో విమర్శకులు నుంచి సైతం ప్రశంసలు అందుకుంది ఈ ముద్దుగుమ్మ. అయితే మరో ప్రయోగాత్మక చిత్రం 'రూహీ' మాత్రం జాన్వీకి నిరాశనే మిగిల్చింది.

నటనకు ప్రాధాన్యత గల చిత్రాలు..
హీరోయిన్‌గా పరిచయమైన చాలా తక్కువ సమయంలోనే జాన్వీ కపూర్ స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది. లేడి ఒరియెంటెడ్ కథలను ఎంచుకుంటూ గ్లామర్ బాటలో కాకుండా నటనకు ప్రాధాన్యత గల సినిమాలను చేస్తోంది జాన్వీ కపూర్. ఇందుకు ఉదాహారణే గుడ్‌లక్ జెర్రీ, మిలి చిత్రాలు. గుడ్ లక్ జెర్రీ తమళంలో హిట్ అయిన కోలమావు కోకిల చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కింది. లేడి సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీని తెలుగులో కోకోకోకిల సినిమాగా డబ్ చేసిన విషయం తెలిసిందే.

క్రికెటర్ గా జాన్వీ..
జాన్వీ కపూర్ ప్రస్తుతం మిస్టర్ అండ్ మిసెస్ మహి మూవీకి సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో ఆమె క్రికెటర్ గా కనిపించనున్నట్లు సమాచారం. అలాగే జాన్వీ కపూర్ ఇప్పటికే బావల్ అనే సినిమా చిత్రీకరణను పూర్తి చేసుకుంది. బావల్ సినిమా అనుభవం గురించి సోషల్ మీడియా వేదికగా పంచుకుంది బ్యూటిఫుల్ జాన్వీ కపూర్. అలాగే ఈ జూనియర్ శ్రీదేవి భవిష్యత్తు సినిమాలకు విషయానికి వస్తే ఆమె చేతిలో మరో రెండు సినిమాలు ఉన్నట్లు సమాచారం.

దోస్తానా 2లో ముద్దుగుమ్మ..
కరణ్ జోహార్ ప్రొడక్షన్ లోనే ఈ రెండు సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. దోస్తానా 2లో కూడా జాన్వీ నటిస్తున్నట్లు తెలుస్తోంది. వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిన జాన్వీ కపూర్ సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో షేర్ చేసుకుంటూ తన క్రేజ్‌ను పెంచుకుంటోంది.

బికినీలో హాట్ గా..
జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో ఏ రేంజ్‌లో సందడి చేస్తుందో అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా ఆమె అందాలను ఆరబోస్తూ ఓ రేంజ్‌లో రెచ్చిపోతోంది. పొట్టి దుస్తులు, బికినీలో, టైట్ బట్టల్లో హాట్ నెస్ కి అంతకుమించి అనేలా హాట్ ట్రీట్ ఇస్తుంటుంది. అలాగే చీరకట్టులో కూడా పద్ధతిగా కనిపిస్తూ ఆకర్షిస్తుంటుంది. ఇటీవల మాల్దీవ్స్ లో ఎంజాయ్ చేసిన జాన్వీ కపూర్ బికినీలో హాట్ గా అందాలను ప్రదర్శించింది.
నాభి అందాలతో..
జాన్వీ కపూర్ తాజాగా పలు ఫొటో షూట్ లు నిర్వహించింది. ఈ ఫొటోషూట్ లలో బ్లాక్, గ్రీన్, యెల్లో డ్రెస్ లో హాట్ గా అందాలను చూపించడమే కాకుండా మరికొన్ని ఫొటోల్లో యువరాణిలా ముస్తాబయి కనువిందు చేసింది. ఇక మెర్మేడ్ గ్రీన్ కలర్ డ్రెస్ లో జాన్వీ కపూర్ నాభి అందాలు చూపరులను ఆకట్టుకునేలా ఉన్నాయి. అలాగే యెల్లో డ్రెస్ లో మత్తెక్కించేలా చూస్తూ ఆకర్షిస్తోంది ఈ బాలీవుడ్ భామ.