Janhvi Kapoor: చీరకట్టులో జాన్వీ కపూర్ వయ్యారాలు.. చూపుతిప్పుకోనివ్వని అందాలు

పేరుకు అతిలోక సుందరి, దివంగత శ్రీదేవి ముద్దుల కూతురు అయినప్పటికీ తనదైన మార్క్ వేసుకుంది బ్యూటిఫుల్ జాన్వీ కపూర్. శ్రీదేవి పెద్ద కూతురుగా సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ తనదైన నటనతో ముందుకు వెళ్తోంది. ఇక ఈ భామ సోషల్ మీడియాలో చేసే అందాల విందు మాములుగా ఉండదు. కుర్రకారు గుండెళ్లో గుబులు పుట్టించేలా ఉంటాయి జాన్వీ కపూర్ హాట్ ఫొటోలు. అయితే గ్లామర్ పిక్స్ మాత్రమే కాకుండా అప్పుడప్పుడు పద్ధతిగా, సాంప్రదాయ దుస్తుల్లో కూడా కనువిందు చేస్తుంది ఈ భామ. తాజాగా చీరకట్టులో పద్ధతిగా ఎంతో ముద్దుగా దర్శనమిచ్చింది జాన్వీ.

మరాఠీ రీమేక్ మూవీతో..

మరాఠీ రీమేక్ మూవీతో..

అతిలోక సుందరి, దివంగత శ్రీదేవి అందానికి వారసురాలిగా బాలీవుడ్​లో తెరంగేట్రం చేసింది బ్యూటిఫుల్​ హీరోయిన్ జాన్వీ కపూర్. మరాఠీ హిట్​ మూవీ సైరాట్​కు రీమేక్​గా వచ్చిన దఢక్​ చిత్రంతో హీరోయిన్​గా పరిచయమైన జాన్వీ కపూర్​ తనదైన నటనతో ఆకట్టుకుంది. ఆ తర్వాత చేసిన గుంజన్​ సక్సేనా, రూహి వంటి తదితర చిత్రాలలో నటించి విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది.

మహిళా ప్రాధాన్యత గల చిత్రాలలో..

మహిళా ప్రాధాన్యత గల చిత్రాలలో..

లేడి ఒరియెంటెడ్​ కథలను ఎంచుకుంటూ గ్లామర్​ బాటలో కాకుండా నటనకు ప్రాధాన్యత గల సినిమాలను చేస్తోంది జాన్వీ కపూర్. ఇందుకు ఉదాహారణ ఇటీవల జాన్వీ కపూర్ నటించిన గుడ్​లక్ జెర్రీ చిత్రమే. ఈ మూవీ తమళంలో హిట్​ అయిన కోలమావు కోకిల చిత్రానికి రీమేక్​గా తెరకెక్కింది. లేడి సూపర్​ స్టార్​ నయనతార ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీని తెలుగులో కోకోకోకిల సినిమాగా డబ్ చేసిన విషయం తెలిసిందే.

క్రికెటర్ గా జాన్వీ..

క్రికెటర్ గా జాన్వీ..

జాన్వీ కపూర్ ప్రస్తుతం మిస్టర్ అండ్ మిసెస్ మహి మూవీకి సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో ఆమె క్రికెటర్ గా కనిపించనున్నట్లు సమాచారం. అలాగే జాన్వీ కపూర్ ఇప్పటికే బావల్ అనే సినిమా చిత్రీకరణను పూర్తి చేసుకుంది. బావల్ సినిమా అనుభవాన్ని సైతం సోషల్ మీడియా వేదికగా పంచుకుంది ఈ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్.

చీరలో కనువిందు..

చీరలో కనువిందు..

ఇక సోషల్ మీడియా వేదికగా జాన్వీ కపూర్ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. బికినీతోపాటు హాట్, టైట్, పొట్టి దుస్తుల్లో అందాల ఆరబోతకు ఏమాత్రం అడ్డుచెప్పకుండా వడ్డిస్తుంది. గ్లామర్ దుస్తుల్లో అందాలను వడ్డించే జాన్వీ కపూర్ సాంప్రదాయ దుస్తుల్లో కూడా కనువిందు చేస్తూ ఉంటుంది. తాజాగా చీరకట్టులో పద్ధతిగా దర్శనమిచ్చింది జాన్వీ కపూర్. వైట్ ఫ్లోరల్ చీరలో గ్లామరస్ గా, బ్యూటిఫుల్ గా కనువిందు చేసింది ఈ ముద్దుగుమ్మ.

తెలుగులోనూ ఆఫర్లు..

తెలుగులోనూ ఆఫర్లు..

కాగా జాన్వీ కపూర్ కు గతంలో చాలా రకాల టాలీవుడ్ ఆఫర్లు కూడా వచ్చాయి. కానీ ఈ బ్యూటీ మొదట్లో తెలుగు సినిమాలు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించింది లేదు. కానీ చాలా కాలం తర్వాత మాత్రం విజయ్ దేవరకొండ లాంటి హీరోతో నటించాలని ఉంది అని తెలియజేసింది.

విజయ్ తో ఛాన్స్ వస్తే..

విజయ్ తో ఛాన్స్ వస్తే..

అతనితో ఛాన్స్ వస్తే మాత్రం తప్పకుండా నటిస్తాను అంటూ మంచి టాలెంటెడ్ నటుడు అని కూడా పలు ఇంటర్వ్యూలలో తన ఇష్టాన్ని తెలియజేసింది. అలాగే కాఫీ విత్ కరణ్ షో ఏడో సీజన్ లో తను, తన స్నేహితురాలు సారా అలీ ఖాన్ ఇద్దరు కలిసి అన్నదమ్ములను డేటింగ్ చేసిన విషయం కూడా చెప్పి ఆశ్చర్యపరిచింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X