Don't Miss!
- News
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎర కేసు: సీబీఐ దర్యాప్తుపై హైకోర్టు తీర్పు 6న
- Sports
విహారీ.. ఇది రివర్స్ స్వీప్ కాదు.. రివర్స్ స్లాప్: దినేశ్ కార్తీక్
- Finance
భారత్ పై అమెరికా సెనేటర్ ఆరోపణలు.. ఇండియాను దోషిగా నిలబెట్టడమే ధ్యేయం!
- Lifestyle
రాత్రుళ్లు నిద్ర పట్టట్లేదా? ఈ పాదాభ్యంగనం చేస్తే గాఢ నిద్రలోకి ఇట్టే జారుకుంటారు
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Technology
ప్రపంచంలోనే అతిపెద్ద 5G నెట్వర్క్ గా మారనున్న Airtel!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
తడి అందాలతో దేవకన్యల జాన్వీ కపూర్ హాట్ షో.. తల్లి శ్రీదేవిని మైమరిపించేలా ఫొటోలు!
బాలీవుడ్ స్టార్ కిడ్స్ లలో హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ ఒకరు. అతిలోక సుందరి, దివంగత నటి శ్రీదేవి కూతురిగా సినీ ఇండస్ట్రీలో కాలు మోపిన గ్లామర్ క్వీన్ జాన్వీ కపూర్ తనదైన మార్క్ క్రియేట్ చేసుకుంది. శ్రీదేవి ముద్దుల తనయగా మొదటి సినిమా చేసిన జాన్వీ కపూర్ ఆ తర్వాత తన నటనతో అవకాశాలను అందిపుచ్చుకుంటూ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది. ఓవైపు నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో ఎవరు చూపించని రీతిలో హాట్ షో చేస్తూ ట్రెండ్ అవుతోంది. ఇటీవల మిలి సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఈ ముద్దుగుమ్మ తాజాగా చూపు తిప్పుకోనివ్వని ఫొటోలను అప్ లోడ్ చేసింది.

నటనతో మంచి మార్కులు..
అతిలోక సుందరి, దివంగత శ్రీదేవి అందానికి వారసురాలిగా బాలీవుడ్లో తెరంగేట్రం చేసింది గ్లామరస్ బ్యూటి జాన్వీ కపూర్. మరాఠీ హిట్ మూవీ సైరాట్‌కు రీమేక్‌గా వచ్చిన దఢక్ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైన జాన్వీ కపూర్ తనదైన నటనతో ఆకట్టుకుంది. ఇందులో ఆమె అద్భుతమైన నటనతో మంచి మార్కులు కొట్టేసింది. అంతేకాకుండా ఈ సినిమా రూ. వంద కోట్ల క్లబ్‌లో కూడా చేరడంతో జాన్వీకి మరింత కలిసి వచ్చింది.

నిరాశ మిగిల్చిన ప్రయోగం..
ఇషాన్ ఖట్టర్ తో జోడి కట్టిన 'దఢక్' సినిమా ద్వారా జాన్వీ కపూర్‌కు నేషనల్ రేంజ్‌లో గుర్తింపు వచ్చింది. ఈ సినిమా ఇచ్చిన పాపులారిటీని కంటిన్యూ చేసుకునేలా ఈ అమ్మడు తనకంటూ ప్రత్యేకమైన పంథాను ఏర్పరచుకుని ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగానే 'గుంజాన్ సక్సేనా: ద కార్గిల్ గర్ల్' అనే బయోపిక్ మూవీలో నటించిన జాన్వీ విమర్శకులు సైతం ప్రశంసించేలా మెప్పించింది. ఆ తర్వాత మరోసారి చేసిన ప్రయోగాత్మక చిత్రం 'రూహీ' మాత్రం జాన్వీకి నిరాశనే మిగిల్చింది.

తమిళ రీమేక్ మూవీతో..
హీరోయిన్‌గా పరిచయమైన అతి తక్కువ సమయంలోనే జాన్వీ కపూర్ ఒక రకమైన స్టార్‌డమ్ సొంతం చేసుకుంది. లేడి ఒరియెంటెడ్ కథలను ఎంపిక చేసుకుంటూ గ్లామర్ బాటలో కాకుండా నటనకు ప్రాధాన్యత గల సినిమాలను చేస్తోంది జాన్వీ కపూర్. ఇందుకు ఉదాహారణే గుడ్‌లక్ జెర్రీ, మిలి చిత్రాలు. గుడ్ లక్ జెర్రీ తమళంలో హిట్ అయిన కోలమావు కోకిల చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కింది. లేడి సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీని తెలుగులో కోకోకోకిల సినిమాగా డబ్ చేసిన విషయం తెలిసిందే.

మలయాళ రీమేక్ చిత్రంతో..
ఇక నవంబర్ 2022లో సర్వైవల్ థ్రిల్లర్ గా వచ్చిన మిలి చిత్రంతో ఆకట్టుకుంది జాన్వీ కపూర్. ఈ సినిమా కూడా మలయాళంలో 2019లో వచ్చి హిట్ కొట్టిన హెలెన్ కు రీమెక్ గా తెరకెక్కించారు. బేవ్యూ ప్రాజెక్ట్స్, జీ స్టూడియోస్ బ్యానర్ లపై బోనీ కపూర్ నిర్మించిన ఈ సినిమాకు మత్తుకుట్టి జేవియర్ దర్శకత్వం వహించారు. ఇందులో జాన్వీతోపాటు సన్నీ కౌశల్, మనోజ్ పహ్వా, హస్లీన్ కౌర్ కీలకపాత్రలు పోషించారు.

రెండు సినిమాలతో బిజీగా..
ఇక జాన్వీ కపూర్ ప్రస్తుతం మిస్టర్ అండ్ మిసెస్ మహి మూవీకి సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో ఆమె క్రికెటర్ గా కనిపించనున్నట్లు సమాచారం. అలాగే జాన్వీ కపూర్ ఇప్పటికే బావల్ అనే సినిమా చిత్రీకరణను పూర్తి చేసుకుంది. బావల్ సినిమా అనుభవం గురించి సోషల్ మీడియా వేదికగా పంచుకుంది బ్యూటిఫుల్ జాన్వీ కపూర్. అలాగే ఈ జూనియర్ శ్రీదేవి భవిష్యత్తు సినిమాలకు విషయానికి వస్తే ఆమె చేతిలో మరో రెండు సినిమాలు ఉన్నట్లు సమాచారం.

కరణ్ జోహార్ ప్రొడక్షన్స్ లో..
బాలీవుడ్ ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ ప్రొడక్షన్ లోనే ఈ రెండు సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. దోస్తానా 2లో కూడా జాన్వీ నటిస్తున్నట్లు తెలుస్తోంది. వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిన జాన్వీ కపూర్ మరోవైపు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో షేర్ చేసుకుంటూ తన క్రేజ్‌ను పెంచుకుంటోంది.

శ్రీదేవిని తలపించేలా..
సోషల్
మీడియాలో
తాజాగా
జాన్వీ
కపూర్
హాట్
ఫొటోలను
షేర్
చేసింది.
ఈ
ఫొటోల్లో
తెల్ల
చీర
కట్టుకున్న
జాన్వీ
కపూర్
ఆమె
తల్లి
శ్రీదేవిని
మైమరిపిస్తోంది.
తెల్ల
చీరకు
గోల్డ్
రంగు
బార్డర్
తో
ఉన్న
ఈ
వస్త్రాధరణలో
జాన్వీ
కపూర్
నడుము,
నాభి,
ఎద
అందాలు
చూపరులను
ఆకట్టుకుంటున్నాయి.
నీళ్లలో
జలకాలాడుతున్న
దేవకన్యలా
అందంగా
ఉంది
జాన్వీ
కపూర్.
ఎప్పుడు
కనిపించిన
రీతిలో
పద్ధతైన
చీరలో
సూపర్
హాట్
గా
దర్శనమిచ్చింది
గ్లామర్
క్వీన్
జాన్వీ
కపూర్.