జాకెట్ లేకుండా జాన్వీ కపూర్ రచ్చ: అసలైందే హైలైట్ చేస్తూ ఫోజు
సినీ రంగంలోకి ఎంతో మంది స్టార్లు తమ వారసులను పరిచయం చేశారు. అయితే, అందులో కొందరు మాత్రమే తమ కూతుళ్లను కూడా తెరంగేట్రం చేయించారు. అలా వచ్చిన వారిలో అలనాటి అందాల తార శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ఒకరు. అందానికి అందం, నటనకు నటనతో చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్న ఈ భామ.. వరుస చిత్రాలతో తెగ సందడి చేసేస్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ జాన్వీ కపూర్ ఓ రేంజ్‌లో హడావిడి చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ అమ్మడు కొన్ని పిక్స్ షేర్ చేసింది. వాటిని మీరే చూసేయండి మరి!

చిన్నప్పుడే సెన్సేషన్.. ఎంట్రీ
శ్రీదేవి కూతురిగా చిన్న వయసులోనే జాన్వీ కపూర్ ఫుల్ పాపులర్ అయిపోయింది. అలాగే వేసుకునే డ్రెస్‌లు, చేసే పనులతో దేశ వ్యాప్తంగా సెన్సేషన్‌గా మారిపోయింది. అలా టీనేజ్‌లోనే 'ధడక్' అనే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఇందులో ఆమె అద్భుతమైన నటనతో యమ హైలైట్ అయింది. దీనికితోడు ఇది వంద కోట్ల క్లబ్‌లో కూడా చేరి సత్తా చాటుకుంది.

వరుస చిత్రాలతో ఫుల్ బిజీగా
జాన్వీ కపూర్‌కు 'ధడక్' మూవీతో జాతీయ స్థాయిలో గుర్తింపు సొంతమైంది. దాన్ని కంటిన్యూ చేసుకునేలా ఈ అమ్మడు తనకంటూ ప్రత్యేకమైన పంథాను ఏర్పరచుకుని ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగానే 'గుంజాన్ సక్సేనా: ద కార్గిల్ గర్ల్' అనే బయోపిక్ మూవీలో నటించి మెప్పించింది. అయితే మరో ప్రయోగాత్మక చిత్రం 'రూహీ' మాత్రం అంతగా ఆడలేదు.

రెండు చిత్రాలు.. సక్సెస్ రాలే
బాలీవుడ్‌లో జాన్వీ కపూర్ వరుస సినిమాలు చేస్తూ సత్తా చాటుతోంది. గత ఏడాది ఈ అమ్మడు 'గుడ్ లక్ జెర్రీ' అనే మూవీతో వచ్చింది. ఓటీటీలో రిలీజైన ఈ సినిమాకు ఆశించిన రీతిలో స్పందన దక్కలేదు. అలాగే, పోయిన సంవత్సరమే బోనీ కపూర్ నిర్మించిన 'మిలీ' అనే సినిమాలోనూ ఆమె హీరోయిన్‌గా నటించింది. ఇది కూడా జాన్వీకి నిరాశనే మిగిల్చిందని చెప్పాలి.

ఆ చిత్రాలు.. తెలుగులో కూడా
ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా జాన్వీ కపూర్ వరుస సినిమాలతో సందడి చేస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పుడీ అమ్మడు హిందీలో 'బవాల్', 'మిస్టర్ అండ్ మిస్సెస్ మహి' అనే చిత్రాల్లో నటిస్తోంది. అలాగే, ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రం ద్వారా తెలుగులోకి కూడా జాన్వీ ఎంట్రీ ఇవ్వబోతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది.

సోషల్ మీడియాలో ఫుల్ బిజీ
బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన వెంటనే జాన్వీ కపూర్ స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది. అదే సమయంలో వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారింది. అయినప్పటికీ.. ఈ అమ్మడు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తనకు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో షేర్ చేసుకుంటూ తన క్రేజ్‌ను రెట్టింపు చేసుకుంటోంది.

అందాలతో వల వేస్తోన్న నటి
సోషల్ మీడియాలో జాన్వీ కపూర్ ఏ రేంజ్‌లో సందడి చేస్తుందో అందరికీ తెలిసిందే. మరీ ముఖ్యంగా ఆమె అందాలను ఆరబోస్తూ ఓ రేంజ్‌లో రెచ్చిపోతోంది. ఇందులో భాగంగానే తన లేలేత అందాలను చూపిస్తూ దిగిన ఫొటోలు, తీసుకున్న వీడియోలనే ఎక్కువగా వదులుతోంది. ఫలితంగా ఈ బ్యూటీ తరచూ హాట్ టాపిక్ అవడంతో పాటు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.

జాన్వీ శారీ ఫొటోలు వైరల్‌గా
జాన్వీ కపూర్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని హాట్ ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఆమె జాకెట్ లేకుండానే చీర కట్టుకుని విపరీతంగా షో చేస్తూ రెచ్చిపోయింది. ఫలితంగా ఈ ఫొటోల్లో జాన్వీ కపూర్ అందాలు భారీ రేంజ్‌లో కనువిందు చేస్తున్నాయి. దీంతో ఈ హీరోయిన్ షేర్ చేసిన ఈ పిక్స్‌కు నెటిజన్ల నుంచి భారీ రెస్పాన్స్ దక్కుతోంది. ఫలితంగా ఇవి వైరల్‌గా మారాయి.


Click it and Unblock the Notifications











