twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గోవా ఫిల్మ్ ఫెస్ట్: శ్రీదవిపై జాహ్నవి పద్యం, అంతా ఎమోషనల్ అయ్యారు..

    |

    గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(ఐఎఫ్ఎఫ్ఐ) 2018కు బాలీవుడ్ నటి జాహ్నవి కపూర్ తన తండ్రి, ప్రముఖ నిర్మాత బోనీ కపూర్‌తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జాహ్నవి తన తల్లిపై రాసిన ఒక పద్యాన్ని స్వయంగా చదివి వినిపించి ఆమెకు డెడికేట్ చేశారు. ఇది అక్కడున్న వారిని ఎమోషనల్ అయ్యేలా చేసింది.

    2018 సంవత్సరం తనకు మిక్డ్స్ బ్యాగ్ లాంటిది, ఈ ఏడాది కొన్ని చేదు జ్ఞాపకాలను, కొన్ని తీపి జ్ఞాపకాలను మిగిల్చిందని జాహ్నవి తెలిపారు. ఆమె తల్లి శ్రీదేవి ఈ ఏడాది ఏప్రిల్‌లో మరణించిన సంగతి తెలిసిందే. ఇదే ఏడాది జాహ్నవి 'ధడక్' సినిమా ద్వారా నటిగా తెరంగ్రేటం చేశారు.

    తల్లిని కోల్పోవడంపై

    తల్లిని కోల్పోవడంపై

    తల్లిని కోల్పోవడం తీరని లోటు, ఆ లోటు మా ఫ్యామిలీలో ఎప్పటికీ అలాగే ఉంటుంది. ఈ ఏడాది నేను ఊహించని సంఘటనలు, పరిస్థితులు ఏదురయ్యాయి. అయితే మా ఫ్యామిలీ అంతా ఒకటి అవ్వడం సంతోషాన్ని ఇచ్చింది అని జాహ్నవి తెలిపారు.

    ఆ షాక్ నుంచి బయట పడలేదు

    ఆ షాక్ నుంచి బయట పడలేదు

    అమ్మ చనిపోయిన షాక్ నుంచి మేము ఇంకా తేరుకోలేదు. ఆ సమయంలో మాకు సపోర్టుగా ఉన్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. అందరి సపోర్ట్ వల్లే నేను బాధలోనూ పని చేయగలిగాను. మా తల్లిదండ్రులు గర్వపడేలా చేయడమే ఇకపై నా లక్ష్యం... అని జాహ్నవి కపూర్ తెపారు.

     మధుబాలపై జాహ్నవి ప్రశంసలు

    మధుబాలపై జాహ్నవి ప్రశంసలు

    తనకు ఇష్టమైన నటి మధు బాల అని జాహ్నవి తెలిపారు. ఆమె ఎన్నో మంచి పాత్రలు చేశారు. నటన పరంగా, కథల ఎంపిక పరంగా ఆమె నుంచి మా లాంటి వారు నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది అన్నారు.

    ఫిమేల్ ఓరియెంటడ్ సినిమా అనడం సరికాదు..

    ఫిమేల్ ఓరియెంటడ్ సినిమా అనడం సరికాదు..

    ఈ మధ్య కాలంలో వచ్చే సినిమల్లో నటీమణుల ప్రధాన్యం ఎక్కువ ఉంటే వాటికి లేడీ ఓరియెంటెడ్ సినిమా అనే ట్యాగ్ తగిలిస్తున్నారు. ఇలాంటి ధోరణి సరికాదు. గతంలో మనకు ‘మదర్ ఇండియా', ‘చాల్ బాజ్', ‘సీతా ఔర్ గీతా', ‘సుజాతా' లాంటి సినిమాలు వచ్చాయి. ఈ సినిమాలన్నింటిలో నటీమణుల ప్రాధాన్యత ఎక్కువ. కానీ వాటిని అపుడు ఫిమేల్ ఓయెంటెడ్ సినిమా అనే ట్యాగ్ తగిలించలేదని జాహ్నవి కపూర్ గుర్తు చేశారు.

    జాహ్నవి ఫేవరెట్ బాలీవుడ్

    జాహ్నవి ఫేవరెట్ బాలీవుడ్

    మధుబాల తన ఫేవరెట్ బాలీవుడ్ నటి అని చెప్పిన జాహ్నవి... ఆమె కేవలం అందగత్తె మాత్రమే కాదు, మంచి నటి కూడా. మొఘల్-ఇ-అజమ్ చిత్రంలో ఆమె అద్భుతంగా నటించింది, ఆమెలా ఎవరూ చేయలేరని తెలిపారు.

    English summary
    At International Film Festival of India (IFFI) 2018, Janhvi Kapoor recited a self-written poem that she wrote for her mother, Sridevi. Janhvi also said that she can't emulate her, even if she wants to. 2018 was a mixed bag for her as she had both the worst and best experience of her life in the same breath. Sridevi, passed away earlier this year, while Janhvi was filming her debut, Dhadak. Jahnvi said her personal growth has been tremendous but she has emerged stronger in the trying times.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X