జాహ్నవి కపూర్ సూపర్ హాట్ లుక్, అప్పటి శ్రీదేవి మాదిరిగానే (ఫోటోస్)
బాలీవుడ్ నటి జాహ్నవి కపూర్ రూపంలో అచ్చం తన తల్లి శ్రీదేవి మాదిరిగానే ఉందని పోల్చడం కొత్తమే కాదు. అయితే తాజాగా జాహ్నవిపై తీసిన ఓ ఫోటో షూట్ చూసిన ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఎరుపు రంగు డ్రెస్సులో సూపర్ హాట్‌గా కనిపించిన జాహ్నవి ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి.
సబ్యసాచి 20 ఇయర్స్ యానివర్సరీ ఈవెంట్ సందర్భంగా జాహ్నవి కపూర్ ప్రత్యేకంగా డిజైన్ చేసి ఎరుపు రంగు డ్రెస్ ధరించి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఇందులో ఆమె లుక్ ఒకప్పటి శ్రీదేవి మాదిరిగా ఉండటంతో అంతా సర్ప్రైజ్ అవుతున్నారు.

జాహ్నవి కపూర్
శ్రీదేవికి సంబంధించిన పాత ఫోటోలు ఇంటర్నెట్లో సెర్చ్ చేసి పట్టుకున్న కొందరు అభిమానులు... మీ లుక్ మీ మదర్ శ్రీదేవిలాగ ఉంది, మిమ్మల్ని చూస్తుంటే ఆమెను చూసినట్లే ఉంది అంటూ ఆ ఫోటోలను షేర్ చేస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

రిప్లికా ఆఫ్ శ్రీదేవి
సడెన్‌గా ఈ ఫోటో చూసినపుడు శ్రీదేవి ఫోటోలు అనుకున్నా. ఆమె ఇపుడు మా మధ్య లేకున్నా జాహ్నవిలో మా అభిమాన నటిని చూసుకుంటున్నాం.. అంటూ కొందరు ఫ్యాన్స్ ఎమోషనల్ అయ్యారు. జాహ్నవి ఇండియన్ సినిమా రంగంలో బాలీవుడ్లో తన తల్లి పేరు నిలబెట్టే స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నారు.

ఇప్పుడిప్పుడే తేరుకంటున్న కుటుంబం
దుబాయ్‌లో శ్రీదేవి గతేడాది ప్రమాదవశాత్తు మరణించిన సంగతి తెలిసిందే. ఆమె మరణం నుంచి కుటుంబం, అభిమానులు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో జాహ్నవి మాట్లాడుతూ తల్లి మరణం తర్వాత కొన్ని నెలల పాటు తాను షాక్‌లో ఉన్నానని, ఆ సమయంలో జరిగిన చాలా విషయాలు తనకు గుర్తులేవని తెలిపారు.

జాహ్నవి కపూర్
‘ధడక్' సినిమా ద్వారా నటిగా తెరంగ్రేటం చేసిన జాహ్నవి కపూర్... త్వరలో దినేష్ విజయ్ నిర్మిస్తున్న ‘రూ అఫ్జా' చిత్రంలో కనిపించబోతోంది. దీంతో పాటు కరణ్ జోహార్ రూపొందిస్తున్న ‘తక్త్' చిత్రంలో నటిస్తోంది. దీంతో పాటు గుంజన్ సక్సేనా బయోపిక్ కూడా చేస్తోంది. ఇందులో ఆమె ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కంబాట్ ఫైలట్‌గా కనిపించనుంది.


Click it and Unblock the Notifications











