For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Janhvi Kapoor స్పోర్ట్స్ బ్రాలో జాన్వీ కపూర్ కేక.. పొట్టిదుస్తుల్లో గ్లామర్ ట్రీట్

  |

  దేశం గర్వించ దగిన నటి, దివంగత శ్రీదేవి నటవారసత్వాన్ని పుచ్చుకొన్ని బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో ఎప్పడూ యాక్టివ్‌గా కనిపిస్తుంటుంది. తన జీవితంలోని ప్రతీ విషయాన్ని ఎప్పటికప్పుడూ అభిమానులు, నెటిజన్లతో పంచుకొంటుంది. ఆమె పోస్ట్ చేసే ఫోటోలు వైరల్‌గా మారుతుంటాయి. తాజాగా మే నెలలో తన యాక్టివిటీస్‌కు సంబంధించిన ఫోటో ఆల్బమ్‌ను షేర్ చేయగా వైరల్ అయ్యాయి. ఆ ఫోటోలు, ఆమె వ్యక్తిగత విషయాలు, కెరీర్ గురించిన విషయాల్లోకి వెళితే..

  జాన్వీలో ఆ జోష్ కనిపించకుండా

  జాన్వీలో ఆ జోష్ కనిపించకుండా


  జాన్వీ కపూర్ సినీ జీవితానికి వస్తే.. ప్రస్తుతం ఆమె కెరీర్ గ్రాఫ్ అంతగా సంతృప్తికరంగా కనిపించడం లేదు. తొలి సినిమాతో భారీ విజయాన్ని అందుకొన్న జాన్వీ ఆ తర్వాత ఆ జోష్ కనిపించలేదు. నాసిరకం చిత్రాల ఎంపిక, కొన్ని చిత్రాలు బాగున్నా ప్రేక్షకులను మెప్పించలేకపోయడంతో గ్రాఫ్ రివ్వున దూసుకెళ్లిన దాఖలాలు పెద్దగా కనిపించడం లేదు. దాంతో త్వరలో విడుదలయ్యే సినిమాలపైనే జాన్వీ కపూర్ దృష్టిపెట్టింది.

  ఎన్టీఆర్‌తో కలిసి టాలీవుడ్ ఎంట్రీ

  ఎన్టీఆర్‌తో కలిసి టాలీవుడ్ ఎంట్రీ

  టాలీవుడ్‌లో జాన్వీ కపూర్ అడుగుపెడుతున్నదనే వార్తలు తరచూ మీడియాలో వినిపిస్తుంటాయి. కానీ ఆ వార్తలు అభిమానులను ఊరిస్తూనే ఉంటాయి. ఇలాంటి వార్త ప్రస్తుతం మీడియాలో హల్‌చల్ చేస్తున్నది. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చే చిత్రంలో నటించేందుకు ఆసక్తి చూపుతున్నదనే విషయం మీడియాలో ప్రధానంగా చర్చ జరుగుతున్నది. అయితే ఆ వార్తకు సంబంధించి అధికారికంగా ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో అది కేవలం రూమర్‌గానే మిగిలిపోయింది.

  ఖుషీ కపూర్ తొలి సినిమాపై

  ఖుషీ కపూర్ తొలి సినిమాపై

  ఇక తన కెరీర్‌నే కాకుండా జాన్వీ కపూర్ తన చెల్లెలి కెరీర్‌పైన దృష్టిపెట్టింది. తన సోదరి ఖుషి కపూర్ నటించిన తొలి చిత్రం ది అర్చిస్ సినిమా గురించి అప్‌డేట్స్ పంచుతూ.. సోషల్ మీడియాలో తన ఆనందాన్ని పంచుకొంటున్నది. నా సోదరి నటించిన తొలి సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ రిలీజైంది. ఆ లుక్‌ చూడగానే ఊపిరి ఆగినంత ఉద్వేగానికి గురయ్యాను. నా సోదరి సినిమా నాకు అత్యంత ప్రత్యేకమైనది. ఈ సినిమాను చూడటానికి సినీ ప్రపంచంతోపాటు నేను ఎదురు చూస్తున్నాను అని జాన్వీ కపూర్ చెప్పింది.

  జాన్వీ కపూర్ పోస్టు వైరల్

  జాన్వీ కపూర్ పోస్టు వైరల్

  ఇక జాన్వీ కపూర్ ఎప్పడూ తన ఫిట్‌నెస్, అందం, ఆహార్యం విషయంలో ఏ మాత్రం రాజీ పడదు. కరోనావైరస్ లాక్‌డౌన్ సమయంలో కూడా వర్కవుట్లు, జిమ్‌లో కసరత్తు వీడియోలు, ఫోటోలతో ఫ్యాన్స్, ఫాలోవర్స్‌కు స్పూర్తిని నింపే ప్రయత్నం చేసింది. తాజాగా జాన్వీ పోస్టు చేసిన వర్కవుట్ వీడియోలు అభిమానులకు జోష్‌ను కలిగించాయి. ప్రస్తుతం వర్కవుట్, మేకప్ ఫోటోలు అభిమానులకు కనువిందు చేస్తున్నాయి.

  యోగా, వర్కవుట్స్‌తో హంగామా

  యోగా, వర్కవుట్స్‌తో హంగామా

  యోగా, వర్కువుట్ సందర్భంగా పొట్టి దుస్తుల్లో అందాన్ని ఆరబోస్తూ కనిపించిన జాన్వీ ఫోటోపై నెటిజన్లు కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. స్పోర్ట్స్ బ్రాలో నలుపు రంగు షార్ట్‌లో అందంగా కనిపించింది. జుట్టును ఒడిసిపట్టి పోని టెయిల్ వేసుకొని గ్లామర్‌గా కనిపించింది. ఇలా అందం, ఆరోగ్యం గురించి వివరిస్తున్న ఫోటోలకు ఇన్స్‌టాగ్రామ్‌లో మంచి రెస్సాన్స్ వస్తున్నది.

  అలాంటి ఆసనంతో ఆరోగ్య సూత్రాలు

  అలాంటి ఆసనంతో ఆరోగ్య సూత్రాలు

  జాన్వీ కపూర్ షూటింగులతో బిజీగా ఉంటూనే తన ఇన్స్‌టాగ్రామ్‌లో ఆరోగ్య సూత్రాలను వెల్లడిస్తున్నది. తాజాగా కింద కూర్చొని శిర్షపాద నటరాజన ఆసనంతో ఆకట్టుకొన్నది. నడుము నొప్పి నివారించుకోవడానికి వేసే ఏరియల్ యోగాతో దర్శనమిచ్చింది. వెన్నుపూసకు బలం చేకూరేలా చేసే యోగా ఆసనాన్ని చూపించింది. యోగా వల్ల మానసిక ధృడత్వం, శరీరానికి సంబంధించిన పటుత్వం లాంటి విషయాలను చెప్పే ప్రయత్నం చేసింది.

  జాన్వీ కపూర్ సినీ కెరీర్ ఇలా.

  జాన్వీ కపూర్ సినీ కెరీర్ ఇలా.

  జాన్వీ కపూర్ కెరీర్ విషయానికి వస్తే.. గుడ్ లక్ జెర్రీ, మిలి లాంటి చిత్రాలతో బిజీగా ఉంది. అంతేకాకుండా వరుణ్ ధావన్‌తో బవాల్ అనే చిత్రంలో నటిస్తున్నది. అలాగే రాజ్‌కుమార్ రావుతో మిస్టర్ అండ్ మహీ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే ఎన్టీఆర్, కొరటాల శివ సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నట్టు సమాచారం.

  English summary
  Actress Janhvi Kapoor gives inspiration to the fan with health tips. She looks stunning in grey sports bra and black shorts shakes instagram, other social media platform.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X