కేంద్ర మంత్రికి క్షమాపణ చెప్పిన జాన్వీ కపూర్!

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ మధ్య ముంబయి విమానాశ్రయంలో సరదా సంఘటన చోటు చేసుకుంది. ఇటీవల స్మృతి ఇరానీకి జాన్వీ కపూర్ ఎయిర్ పోర్ట్ లో తారసపడింది. దీనితో వీరిద్దరూ విమానాశ్రయంలోనే కాసేపు ముచ్చటించారు. జాన్వీ.. స్మృతి ఇరానీతో మాట్లాడుతూ పలుమార్లు ఆమెని ఆంటీ అని సంభోదించింది. కాసేపటి తర్వాత జాన్వీ స్మృతి ఇరానీకి క్షమాపణ కూడా చెప్పిందట. ఈ విషయాన్నీ స్మృతి ఇరానీ ఇంస్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు.

జాన్వీ అన్ను పలుమార్లు యాంటీ అని పిలిచింది. ఆ తర్వాత సారీ కూడా చెప్పింది. నేను పర్వాలేదు బేటా అని అన్నాను. ఈ కాలం పిల్లలున్నారే.. ఎవరైనా ఆంటీ అని పిలుస్తుంటే.. నన్ను షూట్ చేయండి అని గట్టిగా అరవాలనిపిస్తుంది అంటూ స్మృతి ఇరానీ సరదాగా వ్యాఖ్యానించారు. స్మృతి ఇరానీ కూడా ఒకప్పుడు నటిగానే ఉన్నారు. బుల్లితెరపై కొన్ని సీరియల్స్ లో నటించారు. ప్రస్తుతం ఆమె నరేంద్రమోడీ కేబినెట్ లో మంత్రిగా ఉన్న సంగతి తెలిసిందే.

Janhvi Kapoor meets Smriti Irani, annoys her by continuously calling her aunty

ఇదిలా ఉండగా జాన్వీ కపూర్ ఈ ఏడాదే బాలీవుడ్ హీరోయిన్ గా దఢక్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం రెండు చిత్రాలతో బిజీగా ఉంది. జాన్వీ తదుపరి చిత్రం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ గుంజన్ సక్సేనా బయోపిక్ చిత్రంలో నటించబోతున్న సంగతి తెలిసిందే, జాన్వీ దీనికి సంబందించిన శిక్షణ కూడా తీసుకుంటోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X