‘అలా మద్యానికి బానిసనయ్యా.. ఆ పరిస్థితుల్లో తాగుడుకు అలవాటు పడ్డా’

తల్లి అడుగుజాడల్లో సినీరంగంలోకి అడుగుపెట్టారు బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్. సెలెక్టివ్‌గా సినిమాలు చేసుకుంటూ దూసుకెళ్తున్నారు ఈ నటి. అయితే ప్రతి మనిషికి ఉన్నట్లుగానే ఆమెకు కూడా కొన్ని బలహీనతలు ఉన్నాయి. ముఖ్యంగా మద్యం తన జీవితాన్ని నాశనం చేసిందని.. దాని నుంచి బయటపడటానికి ఎంతో కష్టపడినట్లుగా జాన్వీ కపూర్ తెలిపారు. ఈ వివరాల్లోకి వెళితే..

తన స్థాయికి కూతురిని తీసుకురావాలని ఎన్నో కలలు కన్నారు శ్రీదేవి. నటన, డ్యాన్స్ ఇలా అన్ని విషయాల్లో జాన్వీకి శిక్షణ ఇప్పించారు. కానీ దురదృష్టవశాత్తూ కూతురి తొలి చిత్రం చూడకుండానే ఆమె తిరిగిరాని లోకాలకు తరలిపోయారు. అయినప్పటికీ కుటుంబ సభ్యులు, అభిమానుల ఆశీస్సులతో జాన్వీ కపూర్ ముందుకు సాగుతున్నారు. బాలీవుడ్‌లో లీడింగ్ హీరోయిన్‌గా ఉంటూనే.. తన తల్లి కోరిక మేరకు దక్షిణాదిలోనూ సినిమాలు చేస్తున్నారు. తెలుగులో దేవర చిత్రంలో నటించిన ఆమె.. ప్రస్తుతం రామ్ చరణ్ - బుచ్చిబాబుల పెద్దిలో నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది.

Janhvi Kapoor Opens Up About Alcohol Addiction and Mental Health Awareness

సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే జాన్వీ కపూర్ ఎప్పటికప్పుడు సినిమాలు, వ్యక్తిగత విషయాలు, షూటింగ్స్ తదితర విషయాల గురించి అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. పలు సామాజిక అంశాలపై సెలబ్రిటీగా తన అభిప్రాయాలను వ్యక్తపరుస్తుంటారు. సమాజానికి తన వంతు బాధ్యతగా మద్యపానం, దాని వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కలిగిస్తున్నారు. ఓ స్వచ్ఛంద సంస్థతో కలిసి అవగాహన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇటీవల ఓ సెమినార్‌లో పాల్గొన్న జాన్వీ కపూర్.. మద్యపానం గురించి, దాని వల్ల వ్యక్తులు పడే ఇబ్బందుల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

మద్యానికి బానిసగా మారిన వ్యక్తులను, వారి వ్యక్తిత్వాన్ని తక్కువ చేసి చూడొద్దు. నిజానికి మద్యపానంతో పాటు ఎలాంటి వ్యసనమైనా విలసం కాదు, అదొక మానసిక రుగ్మత. ఒత్తిడి, ఆందోళన, ఇతర వ్యక్తిగత కారణాల కారణంగా పలువురు వ్యసనాల బారినపడుతుంటారు. సమాజం వారిని ఏదో తప్పు చేసిన నేరస్థుల్లా కాకుండా.. రోగుల్లా చూడాలి. వారిని విమర్శించడం, వెలి వేయడం, దూరంగా ఉంచడం వంటి చూడొద్దు. కుదిరితే ప్రేమను పంచాలి.. తోటి మనుషుల నుంచి సానుభూతి, మద్ధతు లభిస్తేనే అలాంటి వారు త్వరగా మామూలు మనుషులుగా మారతారు అని జాన్వీ కపూర్ పేర్కొన్నారు.

నా వ్యక్తిగత జీవితానికి వస్తే మద్యపానం నా జీవితంలో పెద్ద విలన్‌లా తయారైంది. అప్పుడప్పుడు నేను మద్యం తీసుకునే దానిని, కానీ ఉదయాన్నే లేచేసరికి హ్యాంగోవర్‌లా అనిపించేది. ఓ రోజున ఆ వాసన నాకు అసహ్యం వేసింది. నాకు తెలియకుండానే నేను దానికి బానిసగా మారిపోయా.. వ్యసనం అంటే మనతో ఎవరో తెలియని ఒక అపరిచిత వ్యక్తి సావాహసం చేస్తున్నట్లే. బంధువులు, స్నేహితుల దగ్గర జాగ్రత్తగా అడుగులు వేయాల్సి వచ్చేది. నాకున్న అలవాటు గురించి గతంలో ఎప్పుడూ నేను మాట్లాడలేదు. కానీ నా చుట్టూ ఉన్న చాలామంది ఆ వ్యసనానికి బలికావడం ప్రత్యక్షంగా చూశా. వ్యసనం కూడా ఓ మానసిక ఆరోగ్య సమస్య అని గుర్తించా. వ్యసనం కారణంగా జీవితంలో కోల్పోయేవి, జరిగే నష్టాలు తెలిసిన తర్వాత ఏం చేయాలనే దానిపై అవగాహన కలిగిందని జాన్వీ కపూర్ పేర్కొన్నారు.

Read more about: janhvi kapoor
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X