ప్యాంట్ వేయడం మరచిందా ఏంటి.. కాక రేపుతున్న జాన్వీ తాజా ఫోటోషూట్
ఇప్పటి దాకా తెలుగులో ఒక్క సినిమా కూడా చేయనప్పటికీ జాన్వీ కపూర్ తెలుగు వారందరికీ సుపరిహితమే. ఎందుకంటే ఆమె తల్లి అందాల నటి శ్రీదేవి తెలుగు సినిమా ద్వారానే రంగప్రవేశం చేసి ఆ తర్వాత బాలీవుడ్ ను కొంత కాలం పాటు ఏలి స్టార్ హీరోయిన్ అనిపించుకుంది. అయితే ఆమె అకాల మరణంతో ఇప్పుడు జాన్వీ కపూర్ తన తండ్రి బోనీ కపూర్ సహాయంతో హీరోయిన్గా ఎస్టాబ్లిష్ అయ్యే ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే ఎప్పటికప్పుడు హాట్ ఫోటో షూట్స్ వదులుతూ సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతుంది. తాజాగా ఆమె ప్యాంట్ లేకుండా వదిలిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే

ధడక్ తో
జాన్వీ కపూర్ 2018వ సంవత్సరంలో శశాంక్ ఖైతాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ధడక్ అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది. మరాఠీలో విడుదలై సూపర్ హిట్ గా నిలిచిన సైరాత్ అనే సినిమాకు ధడక్ బాలీవుడ్ రీమేక్ గా తెరకెక్కింది. ఆ సినిమాలో హీరోగా ఇషాన్ ఖట్టర్ నటించగా అతని సరసనే జాన్వీ నటించింది. ఈ సినిమాకు మంచి స్పందన అయితే లభించలేదు కానీ కలెక్షన్లు మాత్రం గట్టిగానే వచ్చాయి.

గుంజన్ సక్సేనాగా
ఆమె మొదటి సినిమా పూర్తయిన తర్వాత మరో రెండేళ్ల పాటు ఇంకో సినిమా జోలికి పోలేదు. ఆ తరువాత జాన్వీ ఘోస్ట్ స్టోరీస్ అని ఒక వెబ్ సిరీస్ లో అసహాయ నర్సు పాత్రలో నటించి ఆకట్టుకుంది. ఇక జోయా అక్తర్ తెరకెక్కించిన ఆ సిరీస్ లో ఆమె నటనకు మంచి అప్లాజ్ అయితే దక్కింది. ఆ పాత్ర తరువాత జాన్వీ గుంజన్ సక్సేనా అనే ఒక సినిమాలో గుంజన్ సక్సేనా పాత్రలో నటించి ప్రేక్షకులందరినీ తన నటనతో ఆకట్టుకుంది.

వరుస సినిమాలతో
ఇక ఆ తర్వాత రూబీ అనే సినిమాలో కూడా ఆమె నటించింది కానీ ఈ సినిమా కూడా ఆమెకు పెద్దగా క్రేజ్ అయితే తీసుకు రాలేదు. ఇక ఆ తర్వాత ఆమె గుడ్ లక్ జెర్రీ, మిల్లీ అనే సినిమాల షూటింగ్స్ పూర్తి చేయగా ఆ సినిమాలు ఎప్పుడు విడుదల కానున్నాయి అనే విషయం మీద క్లారిటీ లేదు.

షర్ట్ లాంటిది ధరించి
ఆ సినిమాలు ఈ ఏడాది విడుదలయ్యే అవకాశం కనిపిస్తోందని అంటున్నారు. అయితే ఆమె చేస్తున్న మరో సినిమా భవ వచ్చే ఏడాది విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
జాన్వి ఎప్పటికప్పుడు అభిమానులను అలరించడానికి తన హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగానే ఇప్పుడు జాన్వీ ప్యాంట్ వేసుకోకుండా ఒక షర్ట్ లాంటిది ధరించి రచ్చ రేపింది.

మత్తెక్కించే చూపులతో
అందులో ఆమె ఒకపక్క ఎద అందాలు ఆరబోస్తూనే మరోపక్క మత్తెక్కించే చూపులతో మంత్రముగ్ధుల్ని చేసే ప్రయత్నం చేస్తోంది. ఇక ఆమె షేర్ చేసిన ఫోటోలకు కామెంట్లు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.


Click it and Unblock the Notifications











