జాహ్నవి కపూర్ క్లిప్పింగ్ లీక్.. సోషల్ మీడియాలో వైరల్
ధడక్ మూవీ తర్వాత జాహ్నవి కపూర్ నటిస్తున్న చిత్రం రూహీ ఆఫ్జా. ఈ చిత్రంలో రాజ్‌కుమార్ రావుతో కలిసి నటిస్తున్నారు. దినేష్ విజాన్ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకోవడానికి సిద్ధమవుతున్నది.. ఈ సందర్భంగా మీ అటెన్షన్ కబ్జా చేయడానికి వస్తున్నాం. ఈ రోజు నుంచి రూహీ అఫ్జా మొదలవుతున్నది అని చిత్ర యూనిట్ ట్వీట్ చేసింది. ఈ సినిమా షూటింగ్‌లో జాహ్నవి కపూర్ లుక్ లీక్ అయి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నది.
జాహ్నవి కపూర్ గ్లామర్ దూరంగా సంప్రదాయ దుస్తుల్లో దర్శనమిచ్చింది. మూములుగా కనిపించే కుర్తా, గ్రీన్ పటియాలా, దుపట్టా వేసుకొని సెట్లో కనిపించింది. అంతేకాకుండా మెడలో ఓ తావీజ్ కూడా ఉంది. సింపుల్ లుక్‌లో జాహ్నవి ఆకట్టుకొంటున్నది.

రూహీ అఫ్జా సినిమా గురించి నిర్మాత దినేష్ విజన్ మాట్లాడుతూ.. ఈ సినిమా కథ విభిన్నమైనది. ఈ చిత్రంలోని పాత్రలను పోషించడానికి పట్టుదల ఉన్న నటులు ఉండాలి. రాజ్ కుమార్ రావు, వరుణ్ శర్మ, జాహ్నవి లాంటి నటులు మా సినిమాకు పనిచేయడం హ్యాపీగా ఉంది అని అన్నారు.
రూహీ అఫ్జా చిత్రంలో ఓ విలక్షణ పాత్రను జాహ్నవి పోషిస్తున్నది. దెయ్యం పాత్రలో జహ్నవి కనిపించబోతున్నట్టు సమాచారం. దెయ్యం రూపంలో పాటల పాడుతూ పెళ్లి కుమారులను నిద్ర మత్తులోకి పంపి.. పెళ్ళి కూతుళ్లను ఆవహించే పాత్రలో కనిపిస్తారనేది బాలీవుడ్ పత్రికల సమాచారం. ఈ చిత్రం మార్చి 20, 2020లో విడుదలకు సిద్ధమవుతున్నది.


Click it and Unblock the Notifications











