Janhvi Kapoor : నెట్ చీరలో అందాల గాలం .. జాన్వీ వలకి చిక్కారో అంతే సంగతులు
అతిలోక సుందరి , దివంగత శ్రీదేవి , బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ బోనీ కపూర్ దంపతుల పెద్ద కుమార్తె జాన్వీ కపూర్. హిందీ పరిశ్రమలోని పెద్ద ఫ్యామిలీకి చెందిన వ్యక్తే అయినా ఆమెకు అవకాశాలు అంత తేలిగ్గా దక్కలేదు. ఇందుకోసం ఆమె ఎంతో కష్టపడ్డారు, అవమానాలు భరించారు. కానీ విమర్శలు ఎదుర్కొన్న చోటే గెలిచి తన సత్తా చాటారు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే జాన్వీ కపూర్ తాజాగా పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..
1997 మార్చి 6న ముంబైలో జన్మించారు జాన్వీ కపూర్. నగరంలోనే చదువుకున్న ఆమె అనంతరం అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న లీ స్ట్రాస్‌బెర్గ్ థియేటర్ అండ్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో నటనలో శిక్షణ తీసుకుని అన్ని అంశాలపై పట్టు సాధించారు. జాన్వీ కపూర్‌ని హీరోయిన్‌గా చూడాలని శ్రీదేవి ఎంతో ఆశపడ్డారు. ఇందుకోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుని ఓ నటికి ఏమేం కావాలో అన్ని సమకూర్చి ఆమెను తీర్చిదిద్దారు. కానీ కూతురిని తెరపై చూడకుండానే శ్రీదేవి తిరిగిరాని లోకాలకు తరలిపోయారు.

2018 ఫిబ్రవరి 24న దుబాయ్‌లో శ్రీదేవి కన్నుమూశారు. అప్పటికి జాన్వీ హీరోయిన్‌గా నటిస్తోన్న డెబ్యూ మూవీ ధడక్ చిత్రీకరణ, పోస్ట్ ప్రొడక్షన్ ఇంకా పూర్తి కాలేదు. కరణ్ జోహార్ నిర్మాతగా శశాంక్ ఖైతాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2018 జూలై 20న విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. తల్లి శ్రీదేవి ఆశయ సాధన కోసం జాన్వీ ఎంతో శ్రమించారు. ఘోస్ట్ స్టోరీస్, గుంజన్ సక్సెనా : ది కార్గిల్ గర్ల్, రూహి, గుడ్ లక్ జెర్రీ, మిలి, బవాల్, రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ, మిస్టర్ అండ్ మిసెస్ మహి, ఉల్జా వంటి చిత్రాలతో బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగారు.
తల్లి కోరిక మేరకు దక్షిణాదిలోనూ ఎంట్రీ ఇవ్వాలని జాన్వీ కపూర్ తీవ్రంగా ప్రయత్నించారు. ముఖ్యంగా టాలీవుడ్‌లో తెరకెక్కిన పలు చిత్రాల్లో హీరోయిన్‌గా జాన్వీ పేరు తెరపైకి వచ్చింది. కానీ అవన్నీ పుకార్లుగానే మిగిలిపోయాయి. చివరికి కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన దేవరలో జాన్వీ హీరోయిన్‌గా అవకాశం అందుకున్నారు. బాలీవుడ్‌లో గత కొన్నేళ్లుగా హిట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న జాన్వీకి దేవర రూపంలో సాలీడ్ హిట్ దొరికింది. అందం విషయంలో తల్లికి ఏమాత్రం తగ్గని నిరూపించుకున్న జాన్వీ కపూర్ నటిగా సరైన రోల్ కోసం వెయిట్ చేస్తున్నారు.
అయితే దేవర 2లో జాన్వీ కపూర్‌కు మంచి స్కోప్ ఉంటుందని ఫిలింనగర్ టాక్. దేవర సెకండ్ పార్ట్‌తో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - బుచ్చిబాబు కాంబినేషన్‌లో తెరకెక్కనున్న మూవీలోనూ జాన్వీ కపూర్‌కు హీరోయిన్‌గా ఛాన్స్ దక్కిన సంగతి తెలిసిందే. ఇక భక్తి భావం ఎక్కువైన జాన్వీ కపూర్ .. తరచు తిరుమల శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటారు. తాజాగా హైదరాబాద్ మధురానగర్ ఆంజనేయ స్వామి ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే జాన్వీ కపూర్ .. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. నెట్ శారీలో నాభి, నడుము అందాలు చూపిస్తున్న ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. ఇంకేందుకు ఆలస్యం ఈ ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి.


Click it and Unblock the Notifications











