అబ్బో! జూ.ఎన్టీఆర్‌తో చాలా కష్టం.. జాన్వీ కపూర్ ఘాటైన కామెంట్

By Lekhaka

జూనియర్ ఎన్టీఆర్-కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా షూటింగ్ జరుగుతోంది. కథానాయికగా బాలీవుడ్ యంగ్ హీరోయిన్ జాన్వీ కపూర్ నటిస్తోంది. జాన్వీ కపూర్ తెలుగులో నటిస్తున్న తొలిచిత్రం. ఇప్పటికే ఒక సాంగ్ షూటింగ్ అయిపోయింది, రెండో సాంగ్ కోసం ఎదురుచూస్తున్న.. ఎన్టీఆర్ తో డ్యాన్స్ చేయడం తనకు ఇష్టమంటూ క్రేజీ కామెంట్స్ చేసింది జాన్వీపాప.

ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్స్, ఫియర్ సాంగ్ ప్రేక్షకుల్లో ఓ అంచనాను క్రియేట్ చేస్తే జాన్వీ కపూర్ కామెంట్స్ మరింత బలాన్ని చేకూర్చాయి. విజయ దశమి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు మూవీ మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

janhvi kapoor praises junior ntr s Dancing skill in Devara

జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజీ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న చిత్రం కావడంతో ప్రేక్షకులు, అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జాన్వీ కపూర్ కామెంట్స్ తో చిత్రంపై అంచనాలు మరింత పెరిగాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ సినీ ప్రియులను ఆకట్టుకున్నాయి.

ఫియర్ సాంగ్ అయితే యూట్యూబ్ లో అన్ని10 కోట్లకు పైగా వ్యూస్ రాబట్టింది. త్వరలోనే సెకండ్ సింగిల్ కూడా రానుంది. అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో హీరోయిన్ గా నటిస్తున్న జాన్వీ కపూర్, జూనియర్ ఎన్టీఆర్ డ్యాన్స్ గురించి ఒక ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

విక్కీ కౌశల్, హృతిక్ రోషన్ లలో ఎవరితో డ్యాన్స్ చేయడాన్ని మీరు ఎక్కువగా ఇష్టపడతారు అని ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు జూనియర్ ఎన్టీఆర్ తో డ్యాన్స్ చేయడం ఇష్టమని జాన్వీ కపూర్ బదులిచ్చింది. ఇప్పటికే ఒక సాంగ్ చేశా, రెండో సాంగ్ చేయడానికి ఆత్రుతగా ఎదురుచూస్తున్నా అని చెప్పుకొచ్చింది. తారక్ సింగిల్ టేక్ ఆర్టిస్ట్, ఆయనతో చేయాలంటే చాలామంది హీరోయిన్స్ భయపడతారు. ఆయన స్పీడ్ ను అందుకోవడం అంత తేలిక కాదు. కానీ జాన్వీ పాప మాత్రం తారక్ తో పోటీ పడటానికి ఆసక్తి చూపించడం విశేషం.

janhvi kapoor praises junior ntr s Dancing skill in Devara

జనతా గ్యారేజీ తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న దేవర సినిమా రెండు పార్ట్ లుగా తెరకెక్కిస్తున్నారు. పార్ట్-1 చిత్రీకరణ జరుగుతోంది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ప్రకాష్ రాజ్, షైన్ టాం ఛాకో, శ్రీకాంత్, మురళీ శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తుండగా, ఎడిటర్ గా శ్రీకర ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ గా సాబు సిరిల్ పనిచేస్తున్నారు.

ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ పతాకాలపై ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా నిర్మిస్తున్నారు. తీర ప్రాంతం నేపథ్యంలో, ఫిషింగ్ హార్బర్ విలేజ్, పోర్ట్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో స్టోరీ రన్ అవుతుంది. పార్ట్-1, పార్ట్-2 గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ దసరా సందర్భంగా సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. జూనియర్ మాస్ యాక్టింగ్ చూసేందుకు తెలుగు ప్రేక్షకులు, నందమూరి అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.

More from Filmibeat

Read more about: janhvi kapoor junior ntr
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X