Jr NTR ఐకానిక్, లెజెండ్ యాక్టర్.. ఆయనతో నటించే ఆఫర్ వస్తే వదులుకొంటానా?. జాన్వీ కపూర్

ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్, ప్రముఖ నిర్మాత బోని కపూర్ సంయుక్తంగా మతుకుట్టి జేవియర్ దర్శకత్వంలో జాన్వీ కపూర్ నటించిన చిత్రం మిలి. హిందీలో విజయవంతమైన హెలెన్ సినిమా ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా నవంబర్ 4వ తేదీన థియేట్రికల్ రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా జాన్వీ కపూర్, బోనికపూర్, సన్నీ కౌశల్ తెలుగు ఫిల్మీబీట్‌తో మాట్లాడుతూ..

మిలి మూవీకి రెమ్యునరేషన్ ఎంతంటే?

మిలి మూవీకి రెమ్యునరేషన్ ఎంతంటే?

మిలి సినిమాకు మా నాన్న బోని కపూర్ నిర్మాత. అయితే నాకు చాలా ఉదారంగా రెమ్యునరేషన్ ఇచ్చారు. నాకు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారో చెప్పలేను అని జాన్వీ కపూర్ అన్నారు. అయితే జాన్వీ కపూర్ మాటలకు బోని కపూర్ అడ్డుపడుతూ... నా కూతురు గతంలో నటించినప్పుడు తీసుకొన్న పారితోషికం కంటే ఎక్కువే ఇచ్చాను అని అన్నారు. అయితే మీరు ఇచ్చిన రెమ్యునరేషన్‌కు నేను అర్హురాలినేనా? అని జాన్వీ అడిగిన ప్రశ్నకు బోని సమాధానం ఇస్తూ.. నేను సినిమా చూసిన తర్వాత చాలా తక్కువగా పే చేశాననే ఫీలింగ్ కలిగింది అని బోని కపూర్ అన్నారు.

మిలీ సినిమా కోసం ప్రాణాలకు తెగించి..

మిలీ సినిమా కోసం ప్రాణాలకు తెగించి..

మిలీ సినిమా కోసం జాన్వీ కపూర్ చాలా కష్టపడింది. ఫ్రీజర్‌లో ఇరుక్కుపోయిన పాత్ర కోసం ప్రాణాలకు తెగించింది. కోవిడ్ పాజిటివ్ నుంచి బయటపడిన వారం రోజులకే షూట్‌కు వచ్చింది. ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా.. మైనస్ 18 డిగ్రీల చలి, ఐస్ ఫ్రీజర్‌లో ఉంటూ నటించింది. అయితే ఆర్టిఫిషియల్‌‌గా షూట్ చేద్దామంటే జాన్వీ వారించింది. ఫ్రీజర్‌లో లేకుండా ఆ పాత్రకు ఫీల్ ఉండదు. ఆ పాత్ర స్ట్రగుల్ చేయడానికి ఫ్రీజర్‌లో ఉండటమే కరెక్ట్ అని చెప్పింది అని బోని కపూర్ అన్నారు.

మానసికంగా.. శారీరకంగా

మానసికంగా.. శారీరకంగా

మిలీ సినిమా షూట్‌లో మానసికంగా, శారీరకంగా చాలా కష్టాలు ఎదురయ్యాయి. అయితే మానసికంగా హెల్త్ ఇష్యూస్ అనేది పెద్ద మాట. అలాంటి సమస్యలు రాలేదు. పాత్ర, షూటింగ్ పరిస్థితులు నాపై మానసికంగా ప్రభావం చూపాయి. ఫ్రీజర్‌లో ఉన్న సమయంలో చాలా ఎమోషనల్‌గా ఫీలయ్యాను అని జాన్వీ కపూర్ చెప్పింది.

జూనియర్ ఎన్టీఆర్‌తో మూవీ గురించి

జూనియర్ ఎన్టీఆర్‌తో మూవీ గురించి

జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమా చేస్తున్నట్టు వార్తలు నా దృష్టికి వచ్చాయి. అయితే ఇప్పటికిప్పుడు అలాంటి చర్చలు జరగలేదు. నేను చాలాసార్లు చెప్పాను. జూనియర్ ఎన్టీఆర్ ఐకానిక్ యాక్టర్, లెజెండ్. ఆయనతో నటించే అవకాశం వస్తే.. ఎవరైనా ఆఫర్‌ను వదులుకొంటారా? ఆయనతో పనిచేయడం నాకు డ్రీమ్ కమ్ ట్రూ లాంటింది అని జాన్వీ కపూర్ చెప్పింది.

 దక్షిణాదిలో జాన్వీ ఎంట్రీ ఎప్పుడంటే?

దక్షిణాదిలో జాన్వీ ఎంట్రీ ఎప్పుడంటే?

దక్షిణాది సినిమా పరిశ్రమకు జాన్వీ కపూర్‌ను పరిచయం చేయాలని ఉంది. కానీ సౌత్‌లో నాలుగైదు సినిమాల్లో నటించి.. మంచి అనుభవం సంపాదించుకొన్న తర్వాత నేను నా కూతురితో సినిమా తీస్తాను. ఎందుకంటే. దక్షిణాది సినిమా పరిశ్రమలో మేకింగ్, సంప్రదాయాలు, అలవాట్లు అన్నీ నేర్చుకోవాలి. ఇక్కడ పరిస్థితులకు అనుగుణంగా మెచ్యురిటీ సాధించాలి. అప్పుడే నేను జాన్వీ కపూర్‌తో సినిమా తీస్తాను అని బోని కపూర్ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X