రామ్ చరణ్‌పై జాన్వీ కపూర్ ఫిదా.. పెద్దిపై అంచనాలు పెంచేసిందిగా!

Janhvi Kapoor: బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ప్రస్తుతం తెలుగు, హిందీ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారిన విషయం తెల్సిందే. తెలుగులో దేవర(Devara) సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు తాజాగా రామ్ చరణ్ 'పెద్ది' సినిమాలో నటిస్తోంది. ఇక ఈ సినిమాతో తెలుగులో జాన్వీ స్టార్ హీరోయిన్ అవ్వడం గ్యారెంటీ అని తెలుగు ప్రేక్షకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో పెద్ది సినిమాపై జాన్వీ కపూర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. పైగా రామ్ చరణ్ వర్కింగ్ స్టైల్ కు ఫిదా అయ్యింది.

దేవర సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ సరసన టాలీవుడ్‌లో అరంగేట్రం చేసిన బాలీవుడ్ నటి జాన్వీ కపూర్, ఇప్పుడు మళ్లీ తెలుగు తెరపై అలరించడానికి సిద్ధమవుతోంది. ఈసారి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ - బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది'లో జాన్వీ హీరోయిన్‌గా నటిస్తోంది.

Janhvi Kapoor Praises Ram Charan Her Unique Role in Telugu Film Peddi

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన జాన్వీ కపూర్.. పెద్ది సినిమా అనుభవాన్ని పంచుకుంది. "బుచ్చిబాబు సనా దర్శకత్వంలో పని చేయడం ఒక గొప్ప అనుభవం. ఆయన ఒక అద్భుతమైన దర్శకుడు. ఆయన చేసిన 'ఉప్పెన'హార్ట్ టచ్చింగ్ మూవీ. ఆయన డైరెక్షన్ అద్భుతం. ఇక పెద్దిలో నేను సాంప్రదాయ హీరోయిన్ పాత్రలో కాకుండా ఓ భిన్నమైన, ఆసక్తికరమైన పాత్రలో కనిపించబోతున్నాను. ఈ పాత్ర నా కెరీర్ కు కలిసివస్తోందని భావిస్తున్నాను" అని చెప్పింది.

రామ్ చరణ్‌పై జాన్వీ కపూర్ ప్రశంసలు
ఇక గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో కలిసి పనిచేయడం చాలా ఉత్సాహంగా ఉందని జాన్వీ కపూర్ తెలిపింది. "రామ్ సర్ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన ఎంత పెద్ద స్టార్ అయినా, సెట్‌లోకి ఓ విద్యార్థిలా వస్తారు. ఆయన సినిమా కోసం చాలా కష్టపడతారు. ఆయన ఎనర్జీ, హానెస్టీ, అంకితభావం చూసి నేనెంతో ప్రేరణ పొందాను. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆ సెట్‌లోకి తిరిగి వెళ్లడానికి ఇక ఆగలేను" అని జాన్వీ పేర్కొంది.

పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలతో వస్తున్న 'పెద్ది' నుంచి విడుదలైన ఫస్ట్ షాట్ టీజర్ అభిమానులను ఫిదా చేస్తోంది. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో, వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ టైటిల్ రోల్‌లో కనిపిస్తున్నారు. టీజర్‌లో రామ్ చరణ్ భుజంపై బ్యాట్, పెదవుల్లో బీడీతో క్రికెట్ మైదానంలో ఎంట్రీ ఇవ్వడం మాస్ ఫీలింగ్‌ను పెంచింది. పొలాల్లో పరిగెత్తడం, యాక్షన్ సన్నివేశాలు, క్రికెట్ షాట్స్ గూస్‌బంప్స్ తెప్పించాయి. ఇక చరణ్ గెటప్, డైలాగ్ డెలివరీ, విజయనగరం యాసలో బాడీ లాంగ్వేజ్ అద్భుతంగా ఆకట్టుకున్నాయి. బుచ్చిబాబు విజన్, రత్నవేల్ విజువల్స్, ఏఆర్ రెహమాన్ సంగీతం టీజర్‌కు హైలైట్‌గా నిలిచాయి. ఈ మూవీ వచ్చే ఏడాది మార్చి 27న గ్రాండ్ గా విడుదల కానున్నది.

పెద్ది కోసం రామ్ చరణ్ మాస్ లుక్
ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ వీడియో, పోస్టర్లు మెగా అభిమానుల్లో హైప్ క్రియేట్ చేశాయి. రామ్ చరణ్ పవర్‌ఫుల్ ప్రెజెన్స్, మాస్ అటిట్యూడ్ చూసిన తర్వాత సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటాయి. తాజాగా చరణ్ ట్రైనింగ్ సెషన్‌లో ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఆ ఫోటోలో ఆయన గుబురు గడ్డం, రఫ్ హెయిర్‌స్టైల్, సిక్స్ ప్యాక్ బాడీతో హాలీవుడ్ హీరోలలా కనిపించారు. ఈ లుక్ చూసిన అభిమానులు సోషల్ మీడియాలో ఫైర్ కామెంట్స్ చేస్తున్నారు. "ఇది ఊర మాస్ అంతే!", "పెద్ది బాక్సాఫీస్‌ను బద్దలు కొడుతుంది" అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

More from Filmibeat

Read more about: ram charan janhvi kapoor peddi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X