మొత్తానికి ఆ కోరిక నిజమైందట.. ఎర్ర చీరలో అందాలను ఎరవేస్తూ.. మతిపోగుడుతోన్న జాన్వీ
అతిలోక సుందరి స్వర్గీయ శ్రీదేవీ కూతురు అంటే ఏ రేంజ్ అంచనాలు ఉంటాయో.. వాటికి ఎంత మాత్రం తగ్గకుండా ఉంది జాన్వీ కపూర్. మోడ్రన్ డ్రెస్సుల్లోనే కాదు.. చీరకట్టులోనూ కుర్రాళ్లకు మతిపోగుడుతోంది. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ.. అభిమానులను పలకరిస్తుంది. చేసిన సినిమా ఒక్కటే అయినా.. అభిమాన గణం మాత్రం చాలా ఎక్కువే. దీనికి కారణం మాత్రం సోషల్ మీడియానే. హాట్ హాట్ ఫోటోలతో సోషల్ మీడియాను షేక్ చేసేస్తోంది జాన్వీ. నిత్యం తన అందాలను ఆరబోసే ఫోటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్‌కు కిక్కిస్తూ ఉంటుంది.

వెబ్ సిరీస్‌లతో బిజీ..
ప్రస్తుతం వెబ్ సిరీస్‌ల హవా పెరిగిన నేపథ్యంలో స్టార్ హీరోలు, హీరోయిన్లు సైతం వాటిపై దృష్టి పెడుతున్నారు. ఎలాంటి సెన్సార్ సమస్యలు లేకపోవడం, హద్దుల్లేని శృంగారాన్ని చూపించడంలాంటి ఎన్నో వెసులు బాట్లు అందులో ఉండటంతో అందరూ అటు వైపు మొగ్గుచూపుతున్నారు. వెబ్ సిరీస్‌లో సైతం బలమైన కంటెంట్ ఉండటంతో అవి చాలా క్రేజ్‌ను సొంతం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే జాన్వీ కపూర్ సైతం వెబ్ సిరీస్‌లోకి అడుగుపెట్టేసింది.

విజయ్ దేవరకొండకు నో..
సౌత్ హీరోల్లో తనకు విజయ్ దేవరకొండ అంటే ఇష్టమని పలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిన జాన్వీ.. విజయ్ సినిమాకు నో చెప్పడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే దీనికి పలు కారణాలున్నాయని గుస గుసలు వినిపిస్తున్నాయి. డేట్ల సమస్య ఎదురయ్యాయని కొంతమంది అంటుంటే.. పాత్ర నచ్చలేదని మరికొందరు చెప్పుకొస్తున్నారు.
ప్రస్తుతం పలు ప్రాజెక్ట్‌లతో..
కరణ్ జోహర్ తక్త్ చిత్రంలో ఓ బానిస పాత్రను పోషిస్తున్న పాత్రను జాన్వీ.. గుంజన్ సక్సేనా, రూహీ అఫ్జానా, దోస్తానా 2 అనే పలు చిత్రాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది. ఎంత బిజీగా ఉన్న సోషల్ మీడియాను మాత్రం హీటెక్కించడం మాత్రం మరిచిపోవడం లేదు. చీరకట్టులో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేసింది.
చీరకట్టులోనే ఉండిపోనా..?
నిత్యం చీరకట్టులోనే ఉండిపోనా.. అంటూ అభిమానులను ప్రశ్నిస్తూ అదిరిపోయే ఫోటోలను షేర్ చేసింది. పలు రకాల పోజులను పెడుతూ ఫాలోవర్స్ హార్ట్ బీట్‌ను పెంచేసింది. చీరకట్టు కలలు కూడా నిజమవుతున్నాయంటూ ఎర్ర చీర కట్టుకుని ఎరవేసింది.


Click it and Unblock the Notifications











