అన్ని వదిలేసి అతడినే పెళ్లి చేసుకుంటా.. అక్కడే సెటిల్.. జాన్వీ కపూర్ షాకింగ్ కామెంట్

ఎవరైనా లైఫ్ లో ఎకనామికల్ గా వెల్ సెటిల్ కావాలని, హై పొజిషన్ లో ఉంటూ లగ్జరీగా గడపాలని భావిస్తారు. కానీ, ఓ బాలీవుడ్ బ్యూటీ మాత్రం సినిమాలకు స్వస్తి చెప్పి..పెళ్లి చేసుకొని తిరుపతిలో సెట్ కావాలని, ముగ్గురు పిల్లలతో.. సదాసీదాగా లైఫ్ ను ఎంజాయ్ చెయ్యాలని ఉందని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కామెంట్స్ ఇంటర్నెట్ లో తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో ఓ లుక్కేయండి.

ఆ బ్యూటీ ఎవరో కాదు.. అతిలోక సుందరి, అందాల తార శ్రీదేవి వారసురాలు జాన్వీ కపూర్ (Janhvi kapoor). బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. స్టార్ కిడ్ గా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ.. స్టార్ హీరోయిన్ గా మారింది.

Janhvi Kapoor reveals she wants to settle in Tirupati with husband and 3 kids

తొలుత 'దఢక్'సినిమాతో హీరోయిన్ గా బాలీవుడ్ లోకి ఏంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పలు కమర్షియల్, ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీస్ నటిస్తూ బాలీవుడ్ తన కంటూ ఓ స్పెషల్ ఫేమ్ ను సొంతం చేసుకుంది. ఇక గత ఏడాది కొరటాల శివ- ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన 'దేవర' సినిమాలో హీరోయిన్ గా నటించి, మెప్పించింది. ఈ తొలి తెలుగు సినిమా సక్సెస్ కావడంతో వరుస అవకాశాలు అందుకుంటుంది. అలా బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న RC 16 సినిమాలో హీరోయిన్ గా సెలక్ట్ అయ్యింది. మెగాస్టార్‌ కొడుకు, అతిలోక సుందరి కూతురు కాంబోలో వస్తున్న ఆ ప్రాజెక్ట్ మీద భారీ అంచనాలు నెలకున్నాయి.

ఇలా తెలుగు, హిందీ భాషల్లో పలు ప్రాజెక్టులతో తన సత్తా చాటుతున్న జాన్వీ.. తాజాగా మిస్టర్ అండ్ మిసెస్ మహి అనే బాలీవుడ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా సక్సెస్ తో జాన్వీ లెవల్ పెరిగిపోయింది. ఆ తాజా ఓ ఇంటర్వ్యూలో జాన్వీ చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో సంచలనంగా మారాయి. అన్ని వదిలేసి.. జీవితానికి చాలా సాదాసీదాగా సాగించాలని అంటూ.. తన కెరీర్, పెళ్లిపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

Janhvi Kapoor reveals she wants to settle in Tirupati with husband and 3 kids

కరణ్ జోహార్ షోలో జాన్వీ కపూర్ మాట్లాడుతూ.. సినిమా కెరీర్ కొనసాగిస్తూనే మరోవైపు తన వ్యక్తిగత జీవితం గురించి కూడా ఓపెన్ గా మాట్లాడింది. 'పెళ్లి తర్వాత తిరుమలలో భర్తతో సెటిల్ అవ్వాలని, భర్త, ముగ్గురు పిల్లలతో సుఖంగా జీవించాలి 'అని తెలిపింది. అలాగే.. 'ప్రతిరోజూ అరటి ఆకుల్లో ఆహారం తినాలని, గోవిందా గోవిందా అంటూ ప్రార్థన చేయాలని, అలాగే, మణిరత్నం సినిమాల సంగీతం వింటూ జీవించాలని'అనింది. జాన్వీకి వెంకటేశ్వర స్వామి అంటే ఎంత ఇష్టమో దీన్నిబట్టి తెలుస్తుంది. గత కొన్నేళ్లుగా జాన్వీ తన ప్రియుడితో కలిసి తిరుమల ఆలయానికి వెళ్తోంది.

ప్రస్తుతం ఈ అమ్మడు కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జాన్వీ నిజంగా గ్రేట్ అంటూ ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు ఫ్యాన్స్.

More from Filmibeat

Read more about: bollywood janhvi kapoor ntr
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X