జాన్వీ కపూర్‌కు ఊహించని షాక్.. షూటింగ్ రద్దు చేసుకొని ముంబైకి..!

ఉత్తరాది రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు సాగిస్తున్న ఉద్యమం, ఆందోళనలు సినిమా షూటింగులకు అంతరాయం కలుగుతున్నది. ఢిల్లీ, పంజాబ్‌లో ఉవ్వెత్తున సాగుతున్న ఉద్యమం కారణంగా పలు సినిమా షూటింగులు వాయిదా పడ్డాయి. తాజాగా జాన్వీ కపూర్ నటిస్తున్న చిత్రానికి కూడా రైతులు సెగ భారీగానే తాకింది. రైతుల ఉద్యమం వల్ల జాన్వీ కపూర్‌కు షూటింగుపై ఎలాంటి ప్రభావం పడిందంటే...

నయనతార సినిమా రీమేక్‌లో జాన్వీ

నయనతార సినిమా రీమేక్‌లో జాన్వీ


గుంజన్ సక్సెనా తర్వాత జాన్వీ కపూర్ నటిస్తున్న చిత్రం గుడ్ లక్ జెర్రీ. ఈ చిత్రం నయనతార నటించిన కలమావు కోకిల చిత్రానికి రీమేక్‌గా రూపొందుతున్నది. ఈ చిత్రానికి సిద్దార్థ్ సేన్‌గుప్తా దర్శకత్వం వహిస్తుండగా, పంకజ్ మట్టా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. జాన్వీ కపూర్‌తోపాటు మితా విశిష్ట్, సుశాంత్ సింగ్, దీపక్ డొబ్రియాల్, నీరజ్ సూద్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రం పంజాబ్‌లోని పాటియాలాతోపాటు పలు ప్రాంతాల్లో షూటింగు జరుపుకొంటున్నది.

పంజాబ్‌లో షూటింగుకు బ్రేక్

పంజాబ్‌లో షూటింగుకు బ్రేక్


గుడ్‌లక్ జెర్రీ చిత్రానికి రైతుల సెగ గట్టిగానే తగిలింది. గత నెల కూడా రైతుల ఆందోళన కారణంగా ఫతేగఢ్‌ సాహిబ్ జిల్లాలో జరిగిన షూటింగ్ వాయిదా పడింది. అప్పట్లో రైతుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని షూటింగ్ వాయిదా వేస్తున్నట్టు జాన్వీ కపూర్ ఓ ప్రకటన చేసింది. ఆ తర్వాత మళ్లీ జనవరి చివరి వారంలో షూటింగు మొదలుపెట్టారు.

రైతుల ఉద్యమంతో షూటింగ్ రద్దు

రైతుల ఉద్యమంతో షూటింగ్ రద్దు


పాటియాలా ప్రాంతంలో గుడ్‌లక్ జెర్రీ సినిమా షూటింగు జరుగుతుండగా నాలుగు రోజుల క్రితం మళ్లీ రైతులు అడ్డుకొన్నారు. రైతుల ఉద్యమం ముగిసే వరకు మా ప్రాంతంలో ఎలాంటి షూటింగులు జరపొద్దు అంటూ రైతులు చిత్ర యూనిట్‌ను వేడుకొన్నట్టు తెలిసింది. దాంతో రెండోసారి కూడా గుడ్‌లక్ జెర్రీ సినిమా షూట్‌కు అంతరాయం కలిగింది.

Recommended Video

Boney Kapoor Slams SS Rajamouli Over RRR-Maidaan Clash
ముంబైకి చేరుకొన్న జాన్వీ కపూర్

ముంబైకి చేరుకొన్న జాన్వీ కపూర్


గుడ్‌లక్ జెర్రీ సినిమా షూటింగ్ వాయిదా పడటంతో జాన్వీ కపూర్‌తోపాటు చిత్ర యూనిట్‌ ముంబైకి తిరుగుముఖం పట్టింది. పాటియాలా నుంచి ముంబైకి చేరుకొన్న జాన్వీకపూర్ ఎయిర్‌పోర్టులో మీడియా కంటికి చిక్కారు. ఇక జాన్వీ కెరీర్ విషయానికి వస్తే.. రుహీ ఆఫ్జా చిత్రంలో రాజ్ కుమార్ రావుతో కలిసి నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X