Janhvi Kapoor: నన్ను అలానే చూడాలనుకొంటున్నారు.. జాన్వీ కపూర్

బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటించిన పెద్ది చిత్రం జూన్ 4వ తేదీన వరల్డ్ వైడ్‌గా రిలీజైంది. ఈ సినిమాలో చరణ్ సరసన జాన్వీ కపూర్ జంటగా నటించగా.. మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ సంయుక్తంగా నిర్మించాయి. శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యెందు శర్మ, బొమన్ ఇరానీ వంటి స్టార్స్ కీలకపాత్రలు పోషించారు. ప్రీమియర్స్ నుంచే హిట్ టాక్ తెచ్చుకున్న పెద్ది.. బాక్సాఫీస్ వద్ద కూడా భారీ వసూళ్లను రాబడుతూ బ్లాక్ బస్టర్ దిశగా దూసుకెళ్తోంది. హీరో రామ్ చరణ్ నటనపై అన్ని వర్గాల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. రామ్ చరణ్ వన్ మ్యాన్ షోగా సినిమాను తన భుజాలపై మోశారని, ఖచ్చితంగా ఆయనకు ఈసారి నేషనల్ అవార్డ్ వస్తుందని మెగా అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇదే సమయంలో హీరోయిన్ జాన్వీ కపూర్ విషయంలో మాత్రం ఇందుకు విరుద్ధంగా జరుగుతోంది. ఇంతటి క్రేజీ ప్రాజెక్ట్‌లో నటించినప్పటికీ ఆమె పాత్రకు ఎలాంటి ప్రాధాన్యత లభించలేదని, జాన్వీని గ్లామర్ షోకి మాత్రమే ఉపయోగించుకున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు. శ్రీదేవి కనుక బతికుంటే ఇలాంటి పాత్రను చేయనిచ్చేవారు కాదని కామెంట్స్ పెడుతున్నారు. సామాన్యులతో పాటు ప్రముఖులు కూడా సోషల్ మీడియాలో ఆమెపైనా, దర్శకుడు బుచ్చిబాబుపై విరుచుకుపడుతున్నారు. పెద్దిలో తన పాత్ర గురించి వచ్చిన ఓ రివ్యూని జాన్వీ కపూర్ లైక్ చేయడం వివాదాస్పదమైంది. దీనిని బట్టి పెద్దిలో తనను చూపించిన విధానంపై ఆమె కూడా ఆగ్రహంతో ఉన్నారని.. ఇన్‌డైరెక్ట్‌గా ఆమె రియాక్ట్ అయ్యారని అభిమానులు చెబుతున్నారు.

Janhvi Kapoor s Old Interview Goes Viral Amid Peddi Controversy Over Her Role

అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో దర్శకుడు బుచ్చిబాబు స్పందించారు. తాను స్త్రీలను గౌరవిస్తానని, ఎవరినీ బాధపెట్టనని.. పెద్దిలోని కొన్ని సీన్ల వల్ల ఎవరైనా అసౌకర్యానికి గురైతే తనను క్షమించాలని బుచ్చిబాబు తెలిపారు. ఈ సీన్లను తొలగించేందుకు చర్యలు చేపడతామని ఆయన వెల్లడించారు. మహిళను వస్తువుగా చూపించాలన్నది తన ఉద్దేశం కాదని బుచ్చిబాబు తెలిపారు. ఆయన క్లారిటీతోనైనా విమర్శలకు చెక్ పడుతుందా? లేదా? అనేది చూడాలి.

జాన్వీ నటించిన రెండు తెలుగు సినిమాలలోన ఆమె పాత్రకు చెప్పుకోదగ్గ ప్రాధాన్యత లేకపోవడంతో దక్షిణాది దర్శకులపై బాలీవుడ్ అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. దేవరలోనూ హీరోతో పాటల్లో డ్యాన్స్ చేయడానికి, అందాల ప్రదర్శనకే పరిమితం అయ్యారు జాన్వీ కపూర్. ఇప్పుడు లేటెస్ట్‌గా పెద్దిలోనూ ఆమెకు అన్యాయం జరిగిందని, దీనికి తోడు మితిమీరిన రొమాంటిక్ సీన్లలో జాన్వీని చూపించారంటూ ట్రోలింగ్ జరుగుతోంది. అయితే పెద్దిలో వివాదం నేపథ్యంలో జాన్వీకపూర్ గతంలో మాట్లాడిన ఓ పాత వీడియో వైరల్ అవుతోంది.

కొద్దిరోజుల క్రితం ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జాన్వీ కపూర్ మాట్లాడుతూ.. తనను గ్లామర్ డాల్‌గా చూపించడం, అందాల ఆరబోతకే పరిమితం చేయడంపై కీలక వ్యాఖ్యలు చేశారు. వెండితెరపై తనను ఎలా చూపించాలన్నది పూర్తిగా ఫిల్మ్ మేకర్స్ నిర్ణయమే. కానీ సినిమాటోగ్రాఫర్ లేదా దర్శకుడి కెమెరా యాంగిల్స్‌లో అతిగా ప్రవర్తిస్తే ఖచ్చితంగా తాను అంగీకరించను. ఇదే సమయంలో నాకున్న గ్లామర్ డాల్ ఇమేజ్ కారణంగా ఫిల్మ్ మేకర్స్ కూడా అలాంటి పాత్రలే ఇస్తున్నారు. భారీ పారితోషికం అందుకునే నటిగా.. సినిమాల రూపకల్పన, పాత్రల చిత్రణ విషయంలో ఫిల్మ్ మేకర్స్‌ నిర్ణయానికి అనుగుణంగానే తాను నడుచుకోవాల్సి ఉంటుందని జాన్వీ తేల్చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుండగా... జాన్వీకపూర్ స్పందనపై నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు.

Read more about: janhvi kapoor peddi ram charan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X