జాహ్నవి రెయిన్ డ్యాన్స్.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన పిక్
మణిరత్నం సినిమాలోని హీరోయిన్‌లా దివంగత శ్రీదేవి కుమార్తె జాహ్నవి కుమార్తె, బాలీవుడ్ భామ జాహ్నవి కపూర్ ఫౌంటేన్ నీటిలో తడుస్తూ ఎంజాయ్ చేసింది. ప్రస్తుతం తండ్రి బోనికపూర్, చెల్లెలు ఖుషీ కపూర్‌తో కలిసి న్యూయార్క్‌లో విహార యాత్ర చేస్తున్నది. ఇటీవల ఖుషీ కపూర్‌ను ఉన్నత చదువుల కోసం అమెరికాలోని యూనివర్సిటీలో చేర్పించిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా సోదరిని కలువడానికి వెళ్లిన ఆమె రెయిన్ డ్యాన్స్ చేసింది.
ఆ విహారయాత్రకు సంబంధించిన ఫోటోలను జాహ్నవి తన ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చేసింది. న్యూయార్క్.. ఐ లవ్ యూ అంటూ రెయిన్ డ్యాన్స్ చేస్తూ తీయించుకొన్న ఫొటోను షేర్ చేసింది. తాను షేర్ చేసిన ఫోటోపై సోదరి రియా కపూర్, చిచ్చోర్ హీరో వరుణ్ స్పందించి క్యూట్‌గా ఉందని కామెంట్ పెట్టారు. తన మొదటి సినిమా హీరో ఇషాన్ కట్టర్ ట్రోల్ చేశారు. జాహ్నవి ఫోటోపై స్పందిస్తూ వాళ్ల ఫౌంటెన్ వాటర్ కంటే మా వరదలే మేలు అంటూ కామెంట్ చేశారు.

జాహ్నవి, ఖుషీ కపూర్ చాలా క్లోజ్‌గా ఒకరిని వదిలి మరొకరు ఉండలేకుండా కనిపిస్తారు. సోదరి ఖుషి న్యూయార్క్ వెళ్లిన రెండో వారంలోనే జాహ్నవి అక్కడ వాలిపోయింది. చెల్లెలుతో కలిసి మూమెంట్స్‌ను ఎంజాయ్ చేసింది. పలు ప్రాంతాల్లో దిగిన ఫోటోలను ఇన్స్‌టాగ్రామ్‌లో షేర్ చేసింది.
ప్రస్తుతం జాహ్నవి కపూర్ తఖ్త్ అనే సినిమా కోసం ప్రిపేర్ అవుతున్నారు. కరణ్ జోహర్ ఈ సినిమాను రూపొందిస్తున్న సంగతి తలెసిందే. ఈ సినిమాతోపాటు రాజ్ కుమార్ రావుతో కలిసి రూహీ ఆఫ్జా అనే చిత్రంలో నటిస్తున్నది. ఈ చిత్రం 2020లో విడుదల కానున్నది. ఇంకా జాహ్నవి గంజన్ సక్సెనా: ది కార్గిల్ గర్ల్ అనే చిత్రంలో కూడా నటిస్తున్నది.


Click it and Unblock the Notifications











