షాకింగ్: డ్రైవర్ వద్ద అప్పు తీసుకున్న జాన్వీ.. ఆ డబ్బు ఏం చేసిందో తెలుసా..?
ఎన్ని డబ్బులున్నా, ఎంత హోదా ఉన్నా, బ్యాంకు బ్యాలెన్స్ ఫుల్లుగా ఉన్నా నిజ జీవితంలో కొన్ని సందర్భాల్లో, అదీ సరిగ్గా అవసరమైన సమయంలో చేతిలో రూపాయి లేని పరిస్థితులు తలెత్తుతుంటాయి. సాధారణ ప్రజలు మొదలుకొని సెలెబ్రిటీల వరకు ఈ సిచువేషన్ అందరూ ఎప్పుడో ఒకప్పుడు ఎదుర్కొనే ఉంటారు. తాజాగా శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌కి సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. దీంతో తన కారు డ్రైవర్ వద్దే ఆమె అప్పు తీసుకోవాల్సి వచ్చింది. ఇంతకీ డ్రైవర్ వద్ద అప్పు తీసుకోవాల్సినంత అర్జెంట్ జాన్వీకి ఎందుకొచ్చింది? వివరాలు చూద్దామా..

జిమ్‌కి వెళ్లే అలవాటు
జాన్వీ కపూర్ రెగ్యులర్ అలవాటు గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఎందుకంటే ప్రతీ రోజు జిమ్ములకు వెళ్లడం, పొట్టి బట్టలతో కెమెరాకు చిక్కడ ఆ తర్వాత ఆ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం సాధారణమే కాబట్టి. ఎన్నోసార్లు ఇలా జిమ్ము నుంచి బయటకొస్తూ తన డ్రెస్సింగ్ సెన్స్ విషయమై జనం నోళ్ళలో నానింది జాన్వీ.

మరోసారి అదే సందర్భం.. కాకపోతే కాస్త భిన్నం
ఎప్పటి లాగే జిమ్ పూర్తి చేసుకుని తిరిగి ఇంటికి వెళ్తున్న జాన్వీ కపూర్ ఈ సారి కాస్త డిఫరెంట్ సందర్భాన్ని ఎదుర్కొంది. ఆమె కారు ఎక్కుతుండగా ఓ బాలుడు వెంటపడి తన వద్ద ఉన్న మ్యాగజైన్ కొనాలని తెగ బ్రతిమాలాడు. దీంతో మనసు కరిగిన జాన్వీ కారు ఎక్కగానే తన పర్సు తీసి, డబ్బు కోసం చూసింది. కానీ ఆ పర్సులో మ్యాగజైన్ కి కావాల్సిన డబ్బు లేదు.
డ్రైవర్ వద్ద అప్పు తీసుకొని మరీ..
సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో ఎవ్వరైనా కారులో సైలెంటుగా వెళ్ళిపోతారు. కానీ జాన్వీ మాత్రం అందుకు భిన్నంగా డ్రైవర్ వద్ద అప్పు తీసుకొని మరీ ఆ బాలుడికి ఇచ్చేసింది. ఈ ఉదంతం అంతా అక్కడున్న కొందరు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో అది కాస్త వైరల్ గా మారింది. ఈ వీడియో చూసి నెటిజన్లు జాన్విపై ప్రశంసల జల్లు కురిపించారు. తల్లి లాగే జాన్వీలో దయాగుణం ఎక్కువని అభినందిస్తున్నారు.

జాన్వీ కపూర్ సినీ జర్నీ
ప్రస్తుతం జాన్వీ కపూర్ ‘రూహీ అఫ్జా' అనే సినిమాలో నటిస్తోంది. హార్ధిక్ మెహతా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను దినేష్ విజన్, లంబా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రాజ్‌కుమార్ రావు లీడ్ రోల్ చేస్తుండగా, వరుణ్ శర్మ, రోహిత్ రాయ్, పంకజ్ త్రిపాఠి తదితరులు నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను 2020 మార్చిలో విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. అలాగే ‘దోస్తానా 2' అనే మరో సినిమాలోనూ జాన్వీ నటిస్తోంది.


Click it and Unblock the Notifications











