అందరూ అవే చూస్తున్నారు.. నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది.. జాన్వీ కపూర్ కామెంట్స్
అతిలోక సుందరి స్వర్గీయ శ్రీదేవికి ప్రతిరూపంగా వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. తొలి సినిమా ధడక్‌తోనే ఎంతో మంది గుండెల్ని దోచుకుందీ జూనియర్ అతిలోక సుందరి. అందంతో పాటు అభినయంలోనూ ప్రత్యేకతను చాటుకుంటూ వరుస ఆఫర్లను చేజిక్కించుకుంటోంది. వెబ్ సిరీస్‌లోనూ నటిస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తోంది.

సోషల్ మీడియాలో హల్ చల్..
సినిమాలతో వెండితెరపై మెరవడం కంటే సోషల్ మీడియాలోనే జాన్వీ హల్ చల్ చేస్తూ ఉంటుంది. తన స్టైలింగ్, డ్రెస్సింగ్‌తో నెటిజన్లకు నిద్ర పట్టకుండా చేస్తోంది. జిమ్‌కు వెళ్లేటప్పుడు వేసుకునే పొట్టి డ్రెస్సులతో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు కునుకు లేకుండా చేస్తోంది.

తాజాగా అదిరిపోయే పిక్..
తాజాగా జాన్వీ కపూర్ షేర్ చేసిన పిక్ మరింత రచ్చగా మారింది. జాలిలాంటి దుస్తులను ధరించడంతో అంతా ఫ్రీ షోలా బయటికి కనిపించింది. దీంతో సోషల్ మీడియాలో వేడిని రాజేసినట్టైంది. క్షణాల్లో ఈ పిక్ ఓ రేంజ్‌లో వైరల్ అయింది.

నాకు ఇబ్బందిగా ఉంది..
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అభిమానులు ఇంతకుముందు తన దగ్గరకు వచ్చి ధడక్ గురించి మాట్లాడేవారని చెప్పుకొచ్చింది. ఆ సినిమా బాగుందని, అందులో నా నటన చాలా బాగుందని చెప్పేవారంటూ తెలిపింది. ఇప్పుడేమో తాను జిమ్‌కి వేసుకునే దుస్తులు చాలా బాగుంటున్నాయ్ అంటున్నారని, వారు అలా మాట్లాడుతుంటే చాలా ఇబ్బందిగా ఉంటుందని పేర్కొంది.

అందరూ అవే చూస్తున్నారు..
అయితే అలాగని వారినేం తప్పు పట్టనని చెప్పుకొచ్చింది. ఎందుకంటే అందరూ అందం, దుస్తుల మీదే దృష్టి పెడతారని అవే చూస్తున్నారని తెలిపింది. మున్ముందు తాను వేసుకునే పొట్టి దుస్తుల గురించి కాకుండా, తన సినిమాల గురించి మాట్లాడుకుంటారని అనుకుంటున్నానని ధీమా వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఐఏఎఫ్ తొలి మహిళా పైలట్ గుంజన్ సక్సేనా బయోపిక్‌లో, తక్త్ సినిమాలోనూ నటిస్తోంది.


Click it and Unblock the Notifications











