Samantha కంటే ఎక్కువగా డామినేట్ చేస్తున్న శ్రీదేవి కూతురు.. ఆ రూట్లో భారీగా సంపాదన!
గ్లామర్ ప్రపంచంలో హీరోయిన్స్ గా ఎక్కువకాలం కొనసాగడం అంటే ఈ రోజుల్లో చాలా కష్టమైన పని. ఎంత మంచి నటులు అయినా సరే ఎంత అందంగా ఉన్నా కూడా కొన్నిసార్లు ఇతర హీరోయిన్స్ కారణంగా కూడా అవకాశాలు మిస్ అవుతూ ఉంటాయి. ఈ రోజుల్లో ప్రేక్షకులు కూడా ఎప్పటికప్పుడు సరికొత్త కాంబినేషన్స్ కూడా కోరుకుంటూ ఉండడంతో హీరోయిన్స్ పాత బడిన తరువాత ఆ ప్రభావం గట్టిగానే పడుతోంది. అయితే పోటీగా ఎంతమంది బ్యూటీలు వస్తున్న కూడా కొంతమంది మాత్రం అదే తరహాలో క్రేజ్ అందుకుంటూ వస్తున్నారు. ఇక అలాంటి వారిలోలో ప్రస్తుతం శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ కూడా మంచి క్రేజ్ అందుకుంటోంది. అయితే ఇటీవల ఈ బ్యూటీ సమంత గత పదేళ్ళలో సాధించిన విజయాన్ని కేవలం మూడు నాలుగేళ్ళ లోనే బ్రేక్ చేయడం విశేషం.

సక్సెస్ లేకపోయినా..
ఇటీవల కాలంలో సినిమాలతో సంబంధం లేకుండా కొంతమంది గ్లామర్ బ్యూటీలు ఎంతగానో క్రేజ్ అందుకుంటున్నారు. సినిమాలు సక్సెస్ అయినా కాకపోయినా కూడా వారి స్టార్ హోదా మాత్రం ఒకే తరహాలో పెంచుకుంటూ ఉన్నారు. ఇక ఇప్పటివరకు బాక్సాఫీస్ వద్ద సరైన సక్సస్ చూడని జన్వి కపుర్ కూడా మంచి క్రేజ్ అయితే అందుకుంటోంది.

గ్లామర్ విషయంలో..
ధడక్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన జాన్వికపూర్ ఆ తర్వాత గుంజన్ సక్సేనా బయోపిక్ లో నటించిన విషయం తెలిసిందే. కానీ ఆ సినిమాలేవి కూడా ఈ బ్యూటీకి అనుకున్నంత స్థాయిలో గుర్తింపు లభించలేదు. కానీ ఆ తర్వాత చేసిన కొన్ని కమర్షియల్ సినిమాలు పర్వాలేదు అనిపించాయి. అంతేకాకుండా గ్లామర్ విషయంలో మాత్రం ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు జనాలను బాగానే ఎట్రాక్ట్ చేస్తోంది.

సమంత కంటే వేగంగా..
జాన్వి కపూర్ ఇటీవల కాలంలో బయట ఎక్కడ కనిపించినా కూడా ఫిట్నెస్ డ్రెస్ లలో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఆమె ఫిట్నెస్ అందాలు చూపును తిప్పుకొనివ్వడం లేదని కామెంట్ చేస్తున్నారు. అంతే కాకుండా సోషల్ మీడియాలో కూడా జాన్వికపూర్ ఫాలోవర్స్ సంఖ్య పెరుగుతోంది. త్వరలోనే 20 మిలియన్ల ఫాలోవర్స్ కు దగ్గరవుతుండడం విశేషం. ఒక విధంగా సమంత గత పదేళ్లుగా సినిమా ఇండస్ట్రీలో ఉంటూ సోషల్ మీడియాలో కూడా నిత్యం ఏదో ఒక గ్లామరస్ ఫొటోలతో నెటిజన్లను ఎట్రాక్ట్ చేస్తూ ఫ్యాన్ ఫాలోవర్స్ ను సంఖ్యను పెంచుకుంది.

సోషల్ మీడియాతో ఆదాయం
ఇక సమంత అన్నేళ్ళు కష్టపడితే కాని ఆమెకు ఆ రేంజ్ లో ఫాలోవర్స్ సంఖ్య పెరగలేదు. కానీ ఇప్పుడు జాన్వీ మాత్రం సోషల్ మీడియాలో కి వచ్చిన కొన్నాళ్ళకే భారీ స్థాయిలో ఫాలోవర్స్ సంపాదించుకోవటం విశేషం. ఇక సమంత తరహాలోనే జాన్వికపూర్ సోషల్ మీడియా ద్వారా మంచి ఆదాయాన్ని అందుకుంటున్నట్లు తెలుస్తోంది. ఆమె సోషల్ మీడియాలో బ్రాండ్ ప్రమోషన్స్ కోసం ఒక పోస్ట్ చేస్తే 3 లక్షల రూపాయల నుంచి 5 లక్షల మధ్యలో డిమాండ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

రాబోయే ప్రాజెక్టులు
ఒకవిధంగా జాన్వికపూర్ సినిమాల కంటే కూడా తన గ్లామర్ తోనే క్రేజ్ ఎక్కువగా పెంచుకుంటోంది. ఇక సోషల్ మీడియాలో కూడా అదే ఫార్ములాను వాడుతోంది. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో అయితే చాలా మంచి సినిమాలే ఉన్నాయి. దోస్తానా 2 షూటింగ్ కొనసాగుతూ ఉండగా గుడ్ లక్ జెర్రీ, మిలి సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇక తెలుగు హీరోలతో కూడా ఈ బ్యూటీ కొన్ని సినిమాల్లో నటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











