స్పెషల్ సాంగ్‌లో జాన్వీ కపూర్.. దేవర భామకు ఎన్ని కోట్ల రెమ్యునరేషన్ అంటే?

తెలుగు సినిమాల్లో కొత్త హీరోయిన్స్ వస్తే ఎనీ టైం మన వాళ్ళు రమ్మనడమే తప్ప వద్దని మాత్రం చెప్పరు. ఎప్పటికపుడు అన్ని విషయాల్లో కొత్తదనం కోరుకునే తెలుగు ఆడియెన్స్ హీరోయిన్ విషయంలో కూడా భాషా భేదం లేకుండా అందరినీ ఆదరిస్తాం అంటారు. అలా నార్త్ నుంచి సౌత్ నుంచి ఇతర భాషల్లో వచ్చిన చాలా మంది హీరోయిన్స్ ని మనం స్టార్ హీరోయిన్స్ చేసి మళ్ళీ వారి ఇండస్ట్రీ లకి పంపించాం.

అయితే ఇటీవల కాలంలో అయితే కొందరు హీరోయిన్స్ నార్త్ నుంచి వచ్చి తెలుగులో పాగా వేశారు. కాగా వీరిలో మృణాల్ ఠాకూర్ బాగా హిట్ అయ్యింది. మరి ఈమె కేవలం హీరోయిన్ గా లేదా చిన్న క్యామియో వరకు ఓకే కానీ ఎలాంటి ఐటెం సాంగ్స్ ని చేయలేదు. కానీ నార్త్ నుంచి వచ్చిన మరో బ్యూటీ జాన్వీ కపూర్ అది ఇది అని లేకుండా హీరోయిన్ గా ఇంకో పక్క హాట్ ఐటెం భామగా కూడా అదరగొట్టేస్తుంది.

Janhvi Kapoor shocking remuneration for Special Song in pushpa 2

ఆల్రెడీ తెలుగులో భారీ చిత్రం "దేవర" సినిమా చేసింది. ఇందులో మొన్ననే వచ్చిన చుట్టమల్లే సాంగ్ లో అందాల ఆరబోత చూపించి వర్షాకాలంలో కూడా హీట్ ఎక్కించింది. కాగా ఈ సినిమా కాకుండా రామ్ చరణ్ తో సినిమా ఓకే చేసింది. ఇంకా మరిన్ని సినిమాలు ఓకే చేస్తూ వెళుతుంది. అయితే ఇవి మాత్రమే కాకుండా ఎప్పుడు నుంచో జాన్వీ భారీ సీక్వెల్ లో ఐటెం భామగా కనిపించేందుకు ఓకే చెప్పింది అని స్ట్రాంగ్ రూమర్స్ ఉన్నాయి.

కాగా ఆ చిత్రమే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమా పుష్ప 2 కాగా ఇందులోనే ఐటెం భామగా కనిపించేందుకు జాన్వీ ఓకే చెప్పినట్టుగా టాక్ ఉంది. అయితే ఆ మధ్య అంతా డేట్స్ అడ్జస్ట్ కాక ఫైనల్ గా ఇప్పుడు మేకర్స్ ఓకే చెప్పినట్టు తెలిసింది. దీనితో ఈ సన్నాహాలు చేస్తుండగా ఈ మధ్యలో ఈ ఒక్క సాంగ్ కి ఈమె భారీ మొత్తంలో డిమాండ్ చేస్తున్నట్టుగా పలు గాసిప్స్ ఇపుడు వినిపిస్తున్నాయి.

Janhvi Kapoor shocking remuneration for Special Song in pushpa 2

ప్రస్తుతం జాన్వీ కపూర్ తెలుగులో ఒక్క సినిమాకి 5 నుంచి 6 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్టుగా టాక్ ఉంది. మరి ఇందులో దాదాపు సగాన్ని ఒక్క పుష్ప 2 లోని ఐటెం సాంగ్ కోసం డిమాండ్ చేస్తుందట. హిందీలో జాన్వీ ఫేస్ అందరికీ బాగా తెలుసు. పైగా బన్నీ సుకుమార్, దేవి సినిమాల్లో ఐటెం సాంగ్స్ కి కూడా వేరే క్రేజ్ ఉంటుంది.

ఇలా ఇంత క్రేజ్ ఉన్న సమయంలో తన రేటు కూడా ఎక్కువే ఉండాలి అని జాన్వీ కూడా గట్టిగానే ఛార్జ్ చేస్తుందట. దీనితో రెండున్నర నుంచి మూడు కోట్లు పుష్ప 2 సాంగ్ కోసం ఈమె పారితోషికంగా అందుకుంటుంది అని ఓ పుకారు. మొత్తానికి మాత్రం తెలుగులో జాన్వీ ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టుగా ఉందని చెప్పాలి. అలాగే తెలుగులో ఈమెకి డిమాండ్ కూడా గట్టిగానే కొనసాగుతుంది అని చెప్పొచ్చు.

More from Filmibeat

Read more about: janhvi kapoor allu arjun pushpa2
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X