Don't Miss!
- News
తీన్మార్ మల్లన్న అరెస్ట్.. జీవో రద్దు చేసేవరకు పోరాడుతాం: మల్లన్న
- Sports
IPL 2022: తూ.. దీనమ్మ జీవితం..ఫైనల్‌కు పోయిన ఆనందం కూడా లేదు!
- Finance
తెలంగాణలో యూరియా ప్లాంట్‌ను తెరిపించింది మేమే: మోడీ: రూ.8 లక్షల కోట్లు
- Automobiles
భారతదేశంలోకి రావాలంటే మా కండిషన్స్ ఇవి: టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్
- Lifestyle
'ఈ' టీ తాగడం వల్ల మీ గుండెను సురక్షితంగా ఉంచుకోవచ్చు అని మీకు తెలుసా?
- Technology
Xiaomi Pad 6 లాంచ్ వివరాలు వచ్చేసాయి ! స్పెసిఫికేషన్లు చూడండి
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Janhvi Kapoor: బటన్స్ విప్పేసి రచ్చ చేసిన జాన్వీ కపూర్.. ముందుకు వంగి మరీ అందాల జాతర
మిగిలిన ఇండస్ట్రీలతో పోలిస్తే బాలీవుడ్‌లో సినీ స్టార్ల వారసులు ఎక్కువగా పరిచయం అవుతూ ఉంటారు. అక్కడ అబ్బాయిలనే కాదు.. తమ కూతుళ్లను కూడా ఇండస్ట్రీలోకి తీసుకొస్తుంటారు. ఇలా ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చి సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో దిగ్గజ నటి శ్రీదేవి వారసురాలు జాన్వీ కపూర్ ఒకరు. అందంలో తల్లికి తీసిపోని విధంగా ఉండే ఈ అమ్మడు.. యాక్టింగ్‌తో అలరిస్తూ ప్రేక్షకులను ఫిదా చేసేస్తోంది. ఇక, సోషల్ మీడియాలో యమా యాక్టివ్‌గా ఉంటూ అప్పుడప్పుడూ అందాల విందు చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా జాన్వీ కపూర్ టాప్ బటన్స్ విప్పేసి మరీ దిగిన ఫొటోలను షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం? ఆ పిక్‌పై మీరూ ఓ లుక్కేయండి!

సినిమాల్లోకి రాకముందే పాపులర్
అలనాటి అందాల తార శ్రీదేవి కుమార్తెగా జాన్వీ కపూర్ చిన్నప్పుడే ప్రపంచానికి పరిచయమైంది. అదీగాక చిన్న వయసులోనే వివాదాస్పద తీరుతో ఈమె చర్చనీయాంశం అయిపోయింది. అప్పట్లో అక్షత్ రంజన్ అనే కుర్రాడితో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఈ భామ.. ఆ తర్వాత శిఖర్ అనే అబ్బాయితో ప్రేమాయణం సాగించింది. వీళ్లతో ఉన్న ఫొటోలు సంచలనం అయ్యాయి.
రష్మీ, సుధీర్ బండారం బయటపెట్టిన గెటప్ శ్రీను: పెళ్లి ఎప్పుడని అడిగితే.. సీక్రెట్ లీక్ చేసి మరీ!

అలా ప్రవేశం.. ప్రశంసల వర్షంతో
సున్నితమైన ప్రేమకథతో వచ్చిన 'ధడక్' మూవీతో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రంలో ఆమె నటనతో మెప్పించింది. ఏమాత్రం బెరుకు లేకుండానే హవభావాలు పలికించి విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ఫలితంగా అదిరిపోయే ఆరంభాన్ని అందుకుంది. శశాంక్ ఖైతాన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో ఇషాన్ హీరోగా చేసిన విషయం తెలిసిందే.

అలాంటివే చేస్తూ సాగిపోతోందిగా
మొదటి చిత్రంతో వంద కోట్ల క్లబ్‌లో చేరిపోయిన జాన్వీ కపూర్‌కు ఆ తర్వాత ఆఫర్లు వెల్లువెత్తాయి. కానీ, ఆమె మాత్రం పాత్రకు ప్రాధాన్యం ఉన్న సినిమాలనే చేస్తోంది. ఈ క్రమంలోనే గత ఏడాది 'గుంజాన్ సక్సేనా: ద కార్గిల్ గర్ల్' అనే బయోపిక్ మూవీలో నటించి మెప్పించింది. ఇక, ఇటీవల 'రూహీ' అనే సినిమా చేసింది. అయితే, ఇది మాత్రం జాన్వీ కపూర్‌కు భారీ షాక్ ఇచ్చింది.
అరాచకమైన హాట్ ఫొటోను వదిలిన దిశా పటానీ: అబ్బో బికినీలో శృతి మించి.. ఇలా చూస్తే తట్టుకోగలరా!

ఇప్పుడ అలా బిజీ... యమ స్పీడ్
ప్రస్తుతం జాన్వీ కపూర్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి 'గుడ్ లక్ జెర్రీ'. ఇది తమిళంలో సూపర్ హిట్ అయిన 'కలమావు కోయిల'కు రీమేక్. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో పూర్తయింది. అనివార్య కారణాల వల్ల వాయిదా పడుతోంది. ఇక, మరో చిత్రం 'దోస్తానా 2'. అలాగే, ఇటీవలే బోనీ కపూర్ తీస్తున్న 'మిలీ' సినిమాను ఈ అమ్మడు పూర్తి చేసుకుంది.

అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీగా
కెరీర్ పరంగా వరుస సినిమాలతో సత్తా చాటుతోన్నా.. జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో మాత్రం ఎంతో యాక్టివ్‌గా ఉంటోంది. ఇందులో భాగంగానే తరచూ తనకు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. అదే సమయంలో సినిమాల అప్‌డేట్లు కూడా ఇస్తోంది. వీటితో పాటు ఫొటోలు, వీడియోలను వదులుతూ ఎప్పుడూ ట్రెండింగ్‌లోనే ఉంటోంది.
Dhee 13 Winner: ముందే లీకైన ఢీ షో విజేత పేరు.. ఊహించని కంటెస్టెంట్‌కు టైటిల్.. ఆ వీడియో రావడంతో!

గ్లామర్‌తో ఇంటర్నెట్‌ను ఊపేస్తూ
చిన్న వయసులోనే విచిత్రమైన డ్రెస్‌లతో జాన్వీ కపూర్ గ్లామర్ షో చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తూ ఉండేంది. ఇప్పుడు కూడా పొట్టి డ్రెస్‌లు వేసుకుని లేలేత అందాలను కనువిందు చేస్తోంది. ఇక, కొంత కాలంగా సోషల్ మీడియా వేదికగా తన అందాలతో కుర్రాళ్లకు వల వేస్తోంది. తరచూ హాట్ హాట్ ఫొటోలు, వీడియోలు షేర్ చేస్తోంది. తద్వారా ఇంటర్నెంట్‌ను ఓ ఊపు ఊపుతోంది.

బటన్స్ విప్పేసి రచ్చ చేసిన జాన్వీ
సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోన్న జాన్వీ కపూర్ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఇందులో ఈ అమ్మడు బ్లాక్ కలర్ బ్లేజర్ వేసుకుని అందాలను ఆరబోస్తుంది. మరీ ముఖ్యంగా ఎద అందాలు కనిపించేలా బటన్స్ విప్పేసి మరీ ఫోజిలిచ్చింది. దీంతో ఈ ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చి ఇవి వైరల్ అయ్యాయి.