Janhvi Kapoor: మత్స్యకన్య అవతారంలో జాన్వీ కపూర్.. తల్లి శ్రీదేవిని తలపిస్తున్నా అందాలు
బాలీవుడ్ బ్యూటిఫుల్ జాన్వీ కపూర్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేదు. అతిలోక సుందరి, దివంగత శ్రీదేవి ముద్దుల కూతురిగా హిందీ చిత్ర పరిశ్రమలోనే కాకుండా తెలుగులో కూడా సుపరిచితమే. అయితే జాన్వీ కపూర్ తెలుగులో సినిమా చేయనప్పటికీ శ్రీదేవి కుమార్తెగా మాత్రం ఆమెపై అనేకమందికి అభిమానం ఉంది. ఇక ఇప్పుడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో తెలుగులో కూడా హీరోయిన్ గా తెరంగేట్రం చేయనుంది. అలాంటి ఈ ముద్దుగుమ్మ తాజాగా తన తల్లిని మైమపిరించేలా ఆకట్టుకుంది.
నటనతో హైలెట్:అతిలోక సుందరి, దివంగత శ్రీదేవి అందానికి వారసురాలిగా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది బ్యూటిఫుల్ హీరోయిన్ జాన్వీ కపూర్. మరాఠీ హిట్ సినిమా సైరాట్‌కు రీమేక్‌గా వచ్చిన దఢక్ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైంది జాన్వీ కపూర్. ఈ సినిమాలో తనదైన నటనతో ఆకట్టుకుంది. ఇందులో ఆమె అద్భుతమైన నటనతో యమ హైలైట్ అయింది.
విమర్శకుల ప్రశంసలు:అంతేకాకుకండా జాన్వీ కపూర్ చేసిన తొలి సినిమా దఢక్ రూ. వంద కోట్ల క్లబ్‌లో కూడా చేరడంతో ఆమె మరింత ఫేమస్ అయింది. తర్వాత అనేక సినీ ఆఫర్లు అందుకుంది. ఇందులో భాగంగానే 'గుంజాన్ సక్సేనా: ద కార్గిల్ గర్ల్' అనే బయోపిక్ సినిమాలో నటించి మెప్పించింది ముద్దుగుమ్మ జాన్వీ. ఈ సినిమాతో విమర్శకులు నుంచి సైతం ప్రశంసలు అందుకుంది ఈ స్టన్నింగ్ బ్యూటి.

గ్లామర్ బాటలో:అయితే జాన్వీ కపూర్ చేసిన మరో ప్రయోగాత్మక చిత్రం 'రూహీ'. ఈ మూవీ మాత్రం జాన్వీకి నిరాశనే మిగిల్చింది. హీరోయిన్‌గా పరిచయమైన అతి తక్కువ సమయంలోనే జాన్వీ కపూర్ స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది. లేడి ఒరియెంటెడ్ కథలను ఎంచుకుంటూ గ్లామర్ బాటలో కాకుండా నటనకు ప్రాధాన్యత గల సినిమాలను చేస్తోంది జాన్వీ కపూర్.

దేవరో మూవీతో:జాన్వీ కపూర్ ప్రస్తుతం మిస్టర్ అండ్ మిసెస్ మహి సినిమాకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో ఆమె క్రికెటర్ గా కనిపించనున్నట్లు సమాచారం. అలాగే జాన్వీ కపూర్ ఇప్పటికే బావల్ అనే సినిమా చిత్రీకరణను పూర్తి చేసుకుంది. అలాగే దోస్తానా 2 సినిమాతో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న దేవర మూవీలో హీరోయిన్ గా చేస్తుంది.

మత్స్యకన్యలా:దేవర సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది జాన్వీ కపూర్. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే జాన్వీ కపూర్ తాజాగా 'ది లిటిల్ మెర్మెయిడ్' (మత్స్య కన్య) సినిమాను ప్రమోట్ చేసింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మే 26 నుంచి స్ట్రీమింగ్ కానున్న ఈ మూవీకి సంబంధించిన వీడియోలో మత్సకన్యలా దర్శనం ఇచ్చింది ఆశ్చర్యపరిచింది.

శ్రీదేవిలా ఉందంటూ:ఇద్దరు చిన్నారులకు మచ్లీ జల్ కి రాణి హై అనే పద్యం చెబుతూ ఆ జలకన్య నీటి నుంచి బయటకు వస్తే ఎలా ఉంటుందో చెబుతూ తాను మత్స్యకన్య అవతారంలో కనిపించింది జాన్వీ కపూర్. ఇందులో ఎద, నాభి అందాలతో చాలా హాట్ గా దర్శనం ఇచ్చింది జాన్వీ. ఆమె ఫొటోలు వైరల్ కాగా.. అచ్చం జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో శ్రీదేవిలా ఉందంటూ పొగడ్తలు వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











