ఆ అటెన్షన్ కోసం దిగజారుతారా? సీక్రెట్ చాట్ లీక్‌పై జాన్వీ కపూర్ సీరియస్

మెగా పవర్ సార్ట్ రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'పెద్ది'. బుచ్చి బాబు సానా దర్శకుడుగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించారు. ఈ మూవీకి ఏఆర్ రెహ్మాన్ సంగీతం సమకూర్చారు. ఈ నెల 4వ తేదీన విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా విడుదలైన నాలుగు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.200 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించింది. అయితే, ఈ సినిమాలో జాన్వీ కపూర్‌ అచ్చియ్యమ్మ పాత్రపై ట్రోలింగ్ జరుగుతోంది. అదే సమయంలో డైరెక్టర్ టేకింగ్ పై ఆరోపణలు చేస్తూ కొన్ని ఫేక్ స్క్రీన్ షాట్స్ వైరలవుతున్నాయి. ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన ఈ వివాదంపై హీరోయిన్ జాన్వీ కపూర్ టీం ఘాటుగా స్పందించింది. ఇంతకీ ఏం జరిగిందంటే?

పాన్ ఇండియా సినిమా'పెద్ది'విడుదలైన తర్వాత హీరోయిన్ జాన్వీ కపూర్ పేరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఒకవైపు సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతుండగా, మరోవైపు జాన్వీ పోషించిన 'అచ్చియమ్మ' పాత్రపై వివాదం చెలరేగింది. ముఖ్యంగా ఆమె పాత్రను కేవలం గ్లామర్‌కే పరిమితం చేశారంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో జాన్వీ కపూర్ పేరుతో కొన్ని ప్రైవేట్ చాట్ స్క్రీన్‌షాట్లు, సోషల్ మీడియా పోస్టులు వైరల్ కావడం మరోసారి పెద్ద చర్చకు దారితీసింది.

Janhvi Kapoor Slams Fake Chat Leak Rumours Amid Peddi Controversy and Viral Screenshots

ముఖ్యంగా ఓ సోషల్ మీడియా పోస్టుకు హీరోయిన్ జాన్వీ కపూర్ లైక్ చేసినట్లు చూపిస్తూ కొన్ని స్క్రీన్‌షాట్లు వైరల్ అయ్యాయి. వాటిలో 'పెద్ది' సినిమాలో హీరోయిన్ పాత్రకు జరిగిన అన్యాయంపై విమర్శలు ఉన్నట్లు ప్రచారం జరిగింది. ఈ క్రమంలో కొత్త హీరోయిన్స్, సిని ప్రముఖలు జాన్వీకి సపోర్టుగా నిలిచారు. ఇక్కడితో ఈ ప్రచారం ఎండ్ కాలేదు. అదే సమయంలో షూటింగ్ సమయంలో కొన్ని కెమెరా యాంగిల్స్‌పై జాన్వీ అభ్యంతరం వ్యక్తం చేసిందని, రామ్ చరణ్ కూడా ఆమెకు మద్దతుగా నిలిచారని పేర్కొంటూ మరికొన్ని ప్రైవేట్ చాట్ స్క్రీన్‌షాట్లు నెట్టింట చక్కర్లు కొట్టాయి.

వైరలవుతున్న చాట్‌ల ప్రకారం.. 'పెద్ది' షూటింగ్ సమయంలోనే కొన్ని సన్నివేశాల చిత్రీకరణపై జాన్వీ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తన చెస్ట్, నడుము, మిడ్‌రిఫ్ భాగాలపై ఎక్కువగా ఫోకస్ చేసే కెమెరా యాంగిల్స్‌పై ఆమె అభ్యంతరం వ్యక్తం చేసినట్లు ఆ మెసేజ్ ల్లో కనిపిస్తోంది. "అలాంటి షాట్స్ వద్దని నేను ముందుగానే చెప్పాను" అని జాన్వీ పేర్కొన్నట్లు స్క్రీన్‌షాట్‌లలో ఉంది. అంతేకాకుండా, ఈ విషయంలో హీరో రామ్ చరణ్ కూడా తనకు మద్దతుగా నిలిచారని ఆ చాట్‌లలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

హీరోయిన్‌ను అలాంటి యాంగిల్స్‌లో చిత్రీకరించవద్దని రామ్ చరణ్ దర్శకుడితో మాట్లాడారని, అవసరమైతే గట్టిగా అభ్యంతరం వ్యక్తం చేశారని చాట్ లో తెలుస్తోంది. "రామ్ సర్ చాలా మంచివారు. ఈ ఇండస్ట్రీలోనే ఆయన బెస్ట్ పర్సన్" అని జాన్వీ చెప్పినట్లు వైరల్ మెసేజ్ ల్లో కనిపిస్తుంది. మరో చాట్‌లో 'కన్సెంట్' (సమ్మతి) అంశంపై కూడా చర్చ జరిగినట్లు కనిపిస్తోంది. మహిళల అభిప్రాయాలు, వారి కంఫర్ట్ జోన్‌ను గౌరవించాల్సిన అవసరం ఉందని, ఇప్పటికీ కొందరు పాత ఆలోచనా విధానంతోనే వ్యవహరిస్తున్నారని అందులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రైవేట్ చాట్ సోషల్ మీడియా దూమారం రేపింది. అలాగే సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది.

అయితే ఈ వ్యవహారంపై తాజాగా జాన్వీ కపూర్ ఫ్యాన్ పేజీ స్పందించింది. 'మీ దృష్టి ఆకర్షించడానికి ఎడిటెడ్ స్క్రీన్‌షాట్లు, తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారు. ఇది నిజంగా నిరాశపరుస్తోంది. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు వైరల్ చేయడం బాధాకరం'అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వైరల్ అవుతున్న అనేక స్క్రీన్‌షాట్లు ఎడిట్ చేసినవేనని, వాటిని నిజమని నమ్మవద్దని స్పష్టం చేసింది. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న స్క్రీన్ షాట్ ఫేక్ అని అర్థమవుతోంది. ఇక జాన్వీ కపూర్ కూడా ఇటీవల పరోక్షంగా స్పందిస్తూ, తన పేరుతో తప్పుడు కథనాలు ప్రచారం చేయడం బాధాకరమని పేర్కొన్నారు.

మరోవైపు 'పెద్ది' సినిమాలో జాన్వీ పాత్ర చిత్రీకరణపై వస్తున్న విమర్శల నేపథ్యంలో దర్శకుడు బుచ్చిబాబు సానా ఇప్పటికే స్పందించారు. ప్రేక్షకుల అభ్యంతరాలను గౌరవిస్తున్నామని, కొంతమందికి అసౌకర్యంగా అనిపించిన సన్నివేశాల్లో మార్పులు చేస్తామని ప్రకటించారు. మహిళల పట్ల తనకు ఎంతో గౌరవం ఉందని, ఎవరినీ అవమానించే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ వివాదం కేవలం 'పెద్ది' సినిమాకే పరిమితం కాకుండా, భారతీయ సినిమాల్లో మహిళా పాత్రల చిత్రీకరణ, ఆబ్జెక్టిఫికేషన్, నటీమణుల పాత్రల ప్రాధాన్యత వంటి అంశాలపై పెద్ద చర్చకు దారితీసింది. ఈ వివాదం ఏటు దారితీస్తోంది వేచి చూడాలి.

Read more about: peddi ram charan janvi kapoor
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X