‘ప్రైవేట్ పార్ట్స్‌పై జూమ్ ఎందుకు?' అలాంటి ఫొటోలపై స్టార్ హీరోయిన్ ఫైర్ !

Janhvi Kapoor Paparazzi Controversy: ఒక వృత్తిని నిజాయితీగా చేసే వారు ఉన్నట్టే, అదే వృత్తిని తప్పుదారి పట్టించి డబ్బు కోసం వాడుకునే వారు కూడా ఉంటారు. ఈ కారణంగా మొత్తం వృత్తికే చెడ్డపేరు వచ్చే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సినీ రంగంలో తారల కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు కీలక పాత్ర పోషిస్తారు. వారి ద్వారా అభిమానులు తమ ఇష్టమైన తారలను చూసి ఆనందపడతారు. అయితే ఇటీవల పరిస్థితి మారిపోయింది. ఈ కవరేజ్ పేరుతో కొందరు ఫోటోగ్రాఫర్లు హీరోయిన్స్ ను అసభ్యకర యాంగిల్స్‌లో ఫోటోలు, వీడియోలు తీసిసొమ్ము చేసుకుందామా అనేవారు ఎక్కువగా తయారయ్యారు. వీరిని పాపరాజిలు అంటారు.

తారలు నడుస్తున్నా, కూర్చున్నా, వేదికపై ఉన్నా అసభ్యకర కోణాల్లో వీడియోలు తీసి స్లోమోషన్‌తో వైరల్ చేస్తున్నారు. ఇంతటితో ఆగకుండా జిమ్‌లు, యోగా సెంటర్ల వద్ద కూడా సెలబ్రిటీలను వెంబడిస్తూ, వారి అనుమతి లేకుండా ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ విధంగా పాపరాజి సంస్కృతి రోజురోజుకూ హద్దులు దాటి, తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. తాజాగా పాపరాజీ కల్చర్‌పై బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ (Janhvi Kapoor)సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. మహిళల శరీరాన్ని టార్గెట్ చేస్తూ ఫొటోలు, వీడియోలు తీసే విధానంపై ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

Janhvi Kapoor Slams Paparazzi for Invasive Angles Calls Out Consent Violation

ముఖ్యంగా కన్సెంట్ లేకుండా కెమెరాను జూమ్ చేసి ప్రత్యేకంగా బాడీ పార్ట్స్‌ను క్యాప్చర్ చేయడం అనైతికమని జాన్వీ కపూర్ స్పష్టం చేశారు. సినీ ప్రపంచంలో కెమెరాలు, ఫ్లాష్‌లైట్లు సహజమే. సెలబ్రిటీల ప్రతి కదలికను క్యాప్చర్ చేయాలనే ఆసక్తితో పాపరాజీ ఎప్పుడూ వారి వెంటనే ఉంటారు. ముఖ్యంగా హీరోయిన్‌ల విషయంలో ఇది మరింత ఎక్కువగా కనిపిస్తుంది. జిమ్‌కు వెళ్లినా, షాపింగ్‌కు వెళ్లినా, రెస్టారెంట్‌లో కనిపించినా అన్నిచోట్ల కెమెరాలు వెంటాడుతుంటాయి. కొన్ని సందర్భాల్లో తీసే ఫొటోలు హద్దులు దాటుతున్నాయని జాన్వీ కపూర్ అభిప్రాయపడ్డారు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన జాన్వీ కపూర్.. తాను ఇటీవల ఫోటోగ్రాఫర్స్ (పాపరాజీ)తో వ్యక్తిగతంగా సమావేశమై ఈ విషయంపై మాట్లాడినట్లు తెలిపారు.'మహిళలను ఎలా ఫోటో తీస్తున్నారు అన్నది నేను నేరుగా వారితో చర్చించాను. కొన్ని ఫొటోలు చాలా ఇన్‌వేసివ్‌గా అనిపిస్తాయి. మాకు అసౌకర్యంగా ఉంటుంది. ఇది కన్సెంట్ లేకుండా జరుగుతున్నదే' అని చెప్పారు. అంతేకాకుండా, 'మేము ఏ దుస్తులు వేసుకున్నా, అది ఎవరికైనా బాడీ పార్ట్స్‌పై జూమ్ చేయడానికి సరికాదు. అలాంటి అసభ్యకర యాంగిల్స్‌లో ఫొటోలు తీయడం, వాటిని స్లో మోషన్, మ్యూజిక్‌తో సోషల్ మీడియాలో వైరల్ చేయడం సరైంది కాదు'అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

జాన్వీ ఇంకా మాట్లాడుతూ.. ఇలాంటి చర్యలు కేవలం నటీమణులకే కాదు, ఫొటోగ్రాఫర్ల గౌరవానికీ నష్టం కలిగిస్తాయని పేర్కొన్నారు. 'వ్యూస్ కోసం మహిళల శరీరాన్ని వస్తువులా చూపించడం సరికాదు. అది మీ ప్రొఫెషన్‌కు కూడా తగదు' అని అన్నారు. కన్సెంట్ గురించి మాట్లాడుతూ జాన్వీ ఒక ఉదాహరణ ఇచ్చారు. 'సినిమాలో ఎలా నటించిన అది నా నిర్ణయం, నా అనుమతి. కానీ బయట నేను తెలియకుండా తీసిన వీడియోలు మాత్రం నా కన్సెంట్ కాదు. ఆ తేడా చాలా ముఖ్యం' అని వివరించారు.

ఇక, షూటింగ్ సెట్స్‌లో కూడా నటీమణులకు తమ అభిప్రాయం చెప్పే హక్కు ఉండాలని ఆమె అన్నారు. 'ఒక కెమెరా యాంగిల్ నాకు కంఫర్ట్ కాకపోతే 'ఇది చేయొద్దు' అని చెప్పగలగాలి. దాన్ని అనప్రొఫెషనల్‌గా చూడకూడదు' అని పేర్కొన్నారు. ఇలా జాన్వీ కపూర్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పాపరాజీ కల్చర్‌పై ఆమె తీసుకున్న ఈ స్టాండ్‌కు పలువురు మద్దతు తెలుపుతున్నారు. మహిళల గౌరవం, కన్సెంట్‌కు ప్రాధాన్యం ఇవ్వాలనే ఆమె సందేశం ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X